తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Old Man Rapes Minor Girl: మైనర్ పై వృద్ధుడి అత్యాచారం; నిందితుడి అరెస్ట్

Old man rapes minor girl: మైనర్ పై వృద్ధుడి అత్యాచారం; నిందితుడి అరెస్ట్

HT Telugu Desk HT Telugu

17 June 2023, 17:05 IST

  • Assam crime news: బాలికపై పలుమార్లు అత్యాచారం చేసిన 62 ఏళ్ల వృద్ధుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన అస్సాంలోని కరీంగంజ్ జిల్లాలో జరిగింది. పోలీసులు అరెస్ట్ చేయడానికి ముందే, ఆ వృద్ధుడికి గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. 

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బాలికపై పలుమార్లు అత్యాచారం చేసిన 62 ఏళ్ల వృద్ధుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన అస్సాంలోని కరీంగంజ్ జిల్లాలో జరిగింది. పోలీసులు అరెస్ట్ చేసేముందు, ఆ వృద్ధుడికి గ్రామస్తులు దేహశుద్ధి చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Viral : ఆటగాడివే! ఒకేసారి ఇద్దరు గర్ల్​ఫ్రెండ్స్​.. దొరికిపోయి- చివరికి..

Southest Monsoon : గుడ్​ న్యూస్​.. ఇంకొన్ని రోజుల్లో దేశాన్ని తాకనున్న నైరుతి రుతుపవనాలు!

PM Modi : ‘పాకిస్థాన్​కి నేను గాజులు తొడుగుతా..’- ప్రధాని మోదీ కామెంట్స్​ వైరల్​!

CBSE Class 10 results : సీబీఎస్​ఈ క్లాస్​ 10 ఫలితాలు విడుదల- ఇలా చెక్​ చేసుకోండి..

మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చి..

మధ్య ప్రాచ్య దేశంలో చాలా రోజులు ఉండి, రెండేళ్ల క్రితం తిరిగి వచ్చిన ఒక ఒంటరి వృద్ధుడు పక్కింటి బాలికపై పలుమార్లు అత్యాచారం చేసిన ఘటన అస్సాంలోని కరీంగంజ్ జిల్లాలో ఉన్న గిరిశ్ గంజ్ గ్రామంలో జరిగింది. బాధిత బాలిక తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం..

ఒంటరిగా ఉన్న బాలికపై..

తల్లిదండ్రులు పనికి వెళ్లడంతో,ఇంట్లో ఒంటరిగా బాలిక ఉండడాన్ని పక్కింట్లో నుంచి గమనించిన నిందితుడు బాధితురాలి ఇంట్లోకి వెళ్లి, ఆ బాలికపై పలుమార్లు అత్యాచారం చేశాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో, పోలీసులు ఆ వృద్ధుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. అయితే, పోలీసులు అరెస్ట్ చేయడానికి ముందే, ఆ వృద్ధుడికి గ్రామస్తులు దేహశుద్ధి చేశారు.

గతంలో కూడా..

గతంలో కూడా, ఈ బాధిత బాలికతో పాటు తన ఇంటి పరిసరాల్లో ఉండే బాలికలతో ఆ వృద్ధుడు అసభ్యంగా, అనుచితంగా ప్రవర్తించేవాడని గ్రామస్తులు తెలిపారు. గ్రామస్తులంతా కలిసి, ఒకసారి గట్టిగా హెచ్చరించడంతో, క్షమాపణలు చెప్పి, మరోసారి అలా చేయనని బ్రతిమిలాడాడని వెల్లడించారు. దాంతో, వదిలేశామని, అయినా తన తీరు మార్చుకోకుండా, ఇలా బాలికపై అత్యాచారం చేశాడని, అందువల్ల, బాగా దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించామని తెలిపారు.

తదుపరి వ్యాసం