తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Gujarat Elections : 'ఎన్నికల్లో పోటీ చేసేందుకు మగాళ్లే లేరా? మహిళలకు టికెట్లు ఎందుకు?'

Gujarat elections : 'ఎన్నికల్లో పోటీ చేసేందుకు మగాళ్లే లేరా? మహిళలకు టికెట్లు ఎందుకు?'

05 December 2022, 7:11 IST

    • Gujarat elections : ‘ఎన్నికల్లో పోటీ చేసేందుకు మగాళ్లే లేరా? ఆడవాళ్లకు ఎందుకు టికెట్లు ఇస్తున్నారు?’ అని ప్రశ్నించారు అహ్మదాబాద్​ జామా మసీదు మతగురువు షబ్బీర్​. గుజరాత్​ ఎన్నికల రెండో దశ పోలింగ్​ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
షబ్బీర్​ అహ్మెద్​ సిద్దిఖీ
షబ్బీర్​ అహ్మెద్​ సిద్దిఖీ

షబ్బీర్​ అహ్మెద్​ సిద్దిఖీ

Gujarat assembly elections : గుజరాత్​ ఎన్నికల నేపథ్యంలో మహిళా అభ్యర్థులపై అహ్మదాబాద్​ జామా మసీదు మతగురువు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఎన్నికల్లో మహిళలను నిలబెట్టేవారు, వారిని గెలిపించే వారు.. ఇస్లాం మతానికి వ్యతిరేకం అని ఆరోపించారు.

"ఇస్లాం మతంలో నమాజ్​కు మించిన ముఖ్యమైనది ఏదీ ఉండదు. కానీ ఆడవారు నమాజ్​ చేయడం ఎప్పుడైనా చూశారా? ఆడవారు అందరి ముందుకు వచ్చే వెసులుబాటు ఇస్లాంలో ఉండి ఉంటే.. కచ్చితంగా ఎవరు అడ్డుకునేవారు కాదు. కానీ మసీదుల్లో మహిళలు నమాజ్​ చదవకూడదు. ఇది ఇస్లాం మతంలో నిబంధన. అందుకే.. ఎన్నికల్లో ముస్లిం మహిళలకు టికెట్లు ఇచ్చేవారు.. ఇస్లాం మతానికి వ్యతిరేకం," అని షబ్బీర్​ అహ్మెద్​ సిద్దిఖీ అభిప్రాయపడ్డారు.

Shabbir Ahmed Siddiqui : "అసలు మగాళ్లే లేరా? ఆడవారిని తీసుకొస్తున్నారు? ఇది మతాన్ని బలహీనపరుస్తుంది. ఎలా అంటే.. ముస్లిం మహిళలు ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లుగా మారితే.. హిజాబ్​ నిబంధనను కాపాడుకోలేము," అని కర్ణాటక హిజాబ్​ వివాదాన్ని గుర్తు చేశారు షబ్బీర్​ అహ్మెద్​ సిద్దిఖీ.

"ఎన్నికల్లో పోటీ చేసే వారు.. ఇంటింటికీ వెళ్లి ప్రచారాలు చేయాలి. ముస్లింల ఇళ్లకు వెళ్లాలి, హిందువుల ఇళ్లకు వెళ్లాలి. అందుకే వీటికి నేను వ్యతిరేకం. పురుషులకు టికెట్లు ఇచ్చుకోవచ్చు కదా. ఈ పార్టీలు.. వ్యూహాత్మకంగానే మహిళలకు టికెట్లు ఇస్తున్నాయి. కుటుంబాల్లో మహిళలకు పైచేయి ఉంటుంది. వారి మాటలు కుటుంబసభ్యులు వింటారు. అలాంటి వారికి టికెట్లు ఇస్తే.. కుటుంబాల ఓట్లు కూడా పడతాయని పార్టీలు భావిస్తున్నాయి. దీనికి మించి.. మహిళలకు టికెట్లు ఇచ్చేందుకు నాకు వేరే కారణాలు కనిపించడం లేదు," అని పేర్కొన్నారు షబ్బీర్​ అహ్మెద్​ సిద్దిఖీ.

Shabbir Ahmed Siddiqui Gujarat elections : గుజరాత్​ ఎన్నికల రెండో దశ పోలింగ్​ ప్రారంభానికి ఒక రోజు ముందు షబ్బీర్​ అహ్మెద్​ సిద్దిఖీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇవి ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి.

రాష్ట్రంలో సుమారు 10శాతం మంది ముస్లింలు ఉన్నారు. కానీ అసెంబ్లీలో ముస్లిం మహిళల ప్రాతినిథ్యమే లేదు. జాతీయ స్థాయి రాజకీయాల్లోనూ దీనిని చూడవచ్చు అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Gujarat election 2nd phase : గుజరాత్​లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. తొలి దశ పోలింగ్​ డిసెంబర్​ 1న ముగిసింది. రెండో దశ పోలింగ్​ నేడు జరగనుంది. ప్రచారాలు ఇటీవలే ముగిశాయి. బీజేపీ, కాంగ్రెస్​, ఆమ్​ ఆద్మీలు గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశాయి. ఇక ఫలితాలు ఈ నెల 8న వెలువడనున్నాయి.

తదుపరి వ్యాసం