తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Shinzo Abe | `పార్టీ టైమ్‌`.. షింజో హ‌త్య‌పై చైనా సోష‌ల్ మీడియా రియాక్ష‌న్‌

Shinzo Abe | `పార్టీ టైమ్‌`.. షింజో హ‌త్య‌పై చైనా సోష‌ల్ మీడియా రియాక్ష‌న్‌

HT Telugu Desk HT Telugu

08 July 2022, 16:00 IST

google News
  • Shinzo జ‌పాన్ మాజీ ప్ర‌ధాన‌మంత్రి షింజో అబే దారుణ హ‌త్య‌కు గురయ్యారు. ఈ హ‌త్యపై భార‌త్ స‌హా ప్ర‌పంచ దేశాల అధినేత‌లు త‌మ ఆవేద‌న‌ను వ్య‌క్తం చేశారు. కానీ, చైనా సోష‌ల్ మీడియా మాత్రం ఈ దారుణంపై పండ‌గ చేసుకుంటోంది. అబే హ‌త్య‌ను స‌మ‌ర్ధిస్తూ, హంత‌కుడిని హీరోగా అభివ‌ర్ణిస్తూ పోస్ట్‌లు వెల్లువెత్తుతున్నాయి.

షింజో అబే (ఫైల్ ఫొటో)
షింజో అబే (ఫైల్ ఫొటో) (AP)

షింజో అబే (ఫైల్ ఫొటో)

జ‌పాన్ మాజీ పీఎం, దేశ ప్ర‌జాల ఆరాధ్య నేత షింజో అబే హ‌త్య‌కు గుర‌య్యారు. ప్ర‌పంచ దేశాలు ఆయ‌న మృతికి తీవ్ర సంతాపం వ్య‌క్తం చేశాయి. భార‌త్ శ‌నివారం రోజు జాతీయ‌ సంతాప దినంగా ప్ర‌క‌టించింది. ఈ దారుణ హ‌త్య‌పై చైనా సోష‌ల్ మీడియా మాత్రం భిన్నంగా స్పందించింది. హంత‌కుడిని ప్ర‌శంసిస్తూ చైనా సోష‌ల్ మీడియాలో పోస్ట్‌ల వ‌ర్షం కురుస్తోంది.

Shinzo Abe | పార్టీ టైమ్‌

జ‌పాన్‌, చైనాల వైరం కొత్త‌ది కాదు. చైనా ప్ర‌జ‌ల‌కు జ‌పాన్‌పై ఉన్న కోపం కూడా కొత్త కాదు. కానీ, జ‌పాన్ మాజీ ప్ర‌ధాని హ‌త్య‌పై సంతోషం వ్య‌క్తం చేస్తూ సోష‌ల్ మీడియాలో పోస్ట్‌లు పెట్ట‌డాన్ని మాత్రం చాలామంది జీర్ణించుకోలేక‌పోతున్నారు. చైనా జాతీయ‌వాదులు షింజో అబే హంత‌కుడు యామ‌గామిని హీరో అంటూ ప్ర‌శంసిస్తున్నారు. ఇది `పార్టీ టైమ్‌` అంటూ సంబ‌రాలు చేసుకుంటున్నారు. షింజో అబే చ‌నిపోక‌ముందు, ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న స‌మ‌యంలో.. ఆయ‌న‌కు `డెత్ విషెస్‌` పంపిస్తూ త‌మ సాడిజం చూపించారు. ముఖ్యంగా చైనా సోష‌ల్ మీడియా సైట్ `వీబో`లో పెద్ద ఎత్తున ఇలాంటి మెసేజెస్ క‌నిపించాయి. ఈ పోస్ట్‌ల‌కు సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ను ఆస్ట్రేలియాలో ఉంటున్న చైనా కు చెందిన హ‌క్కుల కార్య‌క‌ర్త‌, పొలిటిక‌ల్ కార్టూనిస్ట్ బద్యుకో ట్విట‌ర్‌లో షేర్ చేశారు.

Shinzo Abe | హంత‌కుడు హీరో..

చైనాలోని పాపుల‌ర్ సోష‌ల్ మీడియా సైట్ `వీబో`లో #An Bei Wu Sheng Ming Ti Zheng ” (Abe has no vital signs) పేరుతో హ్యాష్‌ట్యాగ్‌ను ర‌న్ చేశారు. షింజోకు డెత్ విషెస్ పంపిస్తూ దీనికి పెద్ద ఎత్తున స్పంద‌న‌లు వ‌చ్చాయి. జ‌పాన్ ప్ర‌స్తుత పీఎంపై, కొరియా అధ్య‌క్షుడిపై కూడా ఈ కాల్పులు జ‌రిగితే బావుండు` అని ఒక యూజ‌ర్ సాడిజం చూపాడు. `థాంక్యూ యాంటీ జ‌పాన్ హీరో..` అంటూ మ‌రో హీరో హంత‌కుడిని ప్ర‌శంసించాడు. `ఐ యామ్ సో హ్యాపీ` అని మ‌రో యూజ‌ర్ స్పందించాడు.

షింజో అబే | `క్వాడ్‌`పై క‌చ్చ‌

చైనాకు చెక్ పెట్టే లక్ష్యంతో `క్వాడ్ - Quadrilateral Security Dialogue (QUAD)`ను ఏర్పాటు చేసే విష‌యంలో నాటి ప్ర‌ధాని షింజో Shinzo Abe అబే కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. అమెరికా, భార‌త్‌, ఆస్ట్రేలియాలతో క‌లిసి ఈ నాలుగు దేశాల కూట‌మిని ఏర్పాటు చేశారు. 2007లో జ‌పాన్‌లో ఈ క్వాడ్ స‌ద‌స్సు జ‌రిగింది. తూర్పు చైనా స‌ముద్రంపై ఆధిప‌త్యం విష‌యంలో విబేధాల కార‌ణంగా జ‌పాన్‌, చైనాల మ‌ధ్య చాలా సంవ‌త్స‌రాలుగా స‌త్సంబంధాలు లేవు. ఈస్ట్ చైనా సీలోని సెన్‌కుకు ద్వీప స‌ముదాయం జపాన్‌కు చెందిన‌ది కాగా, అది త‌మదేన‌ని చైనా వాదిస్తోంది. తైవాన్ సార్వ‌భౌమ‌త్వం విష‌యంలోనూ ఇరుదేశాల మ‌ధ్య శ‌త్రుత్వం ఉంది. తైవాన్ ను ఆక్ర‌మించేందుకు ప్ర‌య‌త్నించ‌డ‌మంటే.. జపాన్‌పై, త‌ద్వ‌రా అమెరికా కూట‌మిపై దాడి చేయ‌డ‌మేన‌ని షింజో Shinzo Abe గ‌తంలో చేసిన వ్యాఖ్య‌పై చైనా తీవ్రంగా స్పందించింది.

తదుపరి వ్యాసం