తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  `సీఏఏ`ను అమ‌లు చేసి తీరుతాం- అమిత్ షా

`సీఏఏ`ను అమ‌లు చేసి తీరుతాం- అమిత్ షా

HT Telugu Desk HT Telugu

05 May 2022, 20:01 IST

google News
  • పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం(సీఏఏ)ను క‌చ్చితంగా అమ‌లు చేసి తీరుతామ‌ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తేల్చిచెప్పారు. క‌రోనా స‌మ‌స్య స‌మ‌సిపోయిన త‌రువాత సీఏఏను అమ‌లు చేస్తామ‌న్నారు. ప‌శ్చిమబెంగాల్లోని సిలిగురిలో గురువారం అమిత్ షా ఒక కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా
కేంద్ర హోం మంత్రి అమిత్ షా (HT_PRINT)

కేంద్ర హోం మంత్రి అమిత్ షా

కొన్నాళ్లుగా ప‌క్క‌న‌బెట్టిన వివాదాస్ప‌ద పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టాన్ని(సీఏఏ) మ‌ళ్లీ సెంట‌ర్ స్టేజ్‌కి తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. ఇదే విష‌యాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్ప‌ష్టం చేశారు. సీఏఏను అమ‌లు చేయ‌బోర‌ని, ఆ చ‌ట్టాన్ని అమ‌లు కానివ్వ‌బోమ‌ని ప‌శ్చిమ‌బెంగాల్ సీఎం మ‌మ‌త బెన‌ర్జీ అబ‌ద్ధాల‌ను ప్ర‌చారం చేస్తోంద‌ని విమ‌ర్శించారు. `మీ ముందే చెబుతున్నా. క‌రోనా స‌మ‌స్య అంతం కాగానే, సీఏఏ అమ‌లు ప్రారంభ‌మ‌వుతుంది` అని షా పేర్కొన్నారు. `మ‌మ‌త దీదీ.. దేశంలోకి చొర‌బాట్లు కొన‌సాగాల‌ని మీరు కోరుకుంటున్నారా? సీఏఏ అనేది ఒక వాస్త‌వం. దాన్ని అమ‌లు చేసి తీరుతాం. టీఎంసీ ఏం చేయ‌లేదు` అని వ్యాఖ్యానించారు.

చెత్త వాగుడు

దీనిపై ప‌శ్చిమ‌బెంగాల్ సీఎం మ‌మ‌త బెన‌ర్జీ స్పందించారు. 2024లో వారు అధికారంలోకి రాబోవ‌డం లేదు. ఇక్క‌డికి వ‌చ్చిన ప్ర‌తీసారి ఏదో ఒక చెత్త వాగుతుంటారు. మ‌నం ఐక‌మ‌త్యంగా ఉంటే వారు ఏం చేయ‌లేరు` అని మండిప‌డ్డారు. దేశంలో కోవిడ్ విజృంభ‌ణ‌కు ముందు 2019, 2020 మొద‌ట్లో, దేశంలో సీఏఏ వ్య‌తిరేక ఆందోళ‌నలు పెద్ద ఎత్తున చెల‌రేగాయి. 2015కు ముందు పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్తాన్‌ల నుంచి భార‌త్ వ‌ల‌స వ‌చ్చిన ముస్లిమేత‌రుల‌కు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా పౌర‌స‌త్వం క‌ల్పించేందుకు ఈ సీఏఏ చ‌ట్టం వీలు క‌ల్పిస్తుంద‌ని విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

టాపిక్

తదుపరి వ్యాసం