తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ambuja Cements Results: అంబుజా సిమెంట్స్ నికర లాభంలో 25 శాతం డౌన్..

Ambuja Cements results: అంబుజా సిమెంట్స్ నికర లాభంలో 25 శాతం డౌన్..

HT Telugu Desk HT Telugu

20 July 2022, 9:53 IST

google News
  • Ambuja Cements results: అంబుజా సిమెంట్స్ నికర లాభంలో 25 శాతం తగ్గుదల నమోదైంది.

అంబుజా సిమెంట్స్ నికర లాభంలో తగ్గుదల నమోదు (ప్రతీకాత్మక చిత్రం)
అంబుజా సిమెంట్స్ నికర లాభంలో తగ్గుదల నమోదు (ప్రతీకాత్మక చిత్రం) (REUTERS)

అంబుజా సిమెంట్స్ నికర లాభంలో తగ్గుదల నమోదు (ప్రతీకాత్మక చిత్రం)

న్యూఢిల్లీ, జూలై 19: అంబుజా సిమెంట్స్ నికర లాభం 25.46 శాతం మేర తగ్గింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం రూ. 866.44 కోట్లుగా ఉందని అంబుజా సిమెంట్స్ క్యూ1 రిజల్ట్స్ (ambuja cements results) వెల్లడించాయి. ఇంధన ధరల్లో పెరుగుదల ఇందుకు కారణమైందని ఫలితాలు నివేదించాయి.

ఈ కంపెనీ జనవరి-డిసెంబర్ ఆర్థిక సంవత్సరాన్ని అనుసరిస్తుంది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో రూ. 1,161.16 కోట్ల లాభాన్ని ఆర్జించింది.

అయితే కంపెనీ రెవెన్యూ మాత్రం ఈ త్రైమాసికంలో 15.11 శాతం మేర పెరిగి రూ. 8,032.88 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 6,978.24 కోట్ల ఆదాయం వచ్చింది.

అంబుజా సిమెంట్స్ మొత్తం వ్యయాలు రూ. 7,276.72 కోట్లుగా ఉన్నాయని, 33.09 శాతం పెరుగుదల ఉందని తెలిపింది.

అంబుజా సిమెంట్స్ కన్సాలిడేట్ ఫలితాల్లో ఏసీసీ లిమిటెడ్ గణాంకాలు కూడా మిళితమై ఉన్నాయి. అయితే స్టాండలోన్ ప్రాతిపదికన చూస్తే అంబుజా సిమెంట్స్ నెట్ ప్రాఫిట్‌లో 44.92 శాతం పెరిగి రూ. 1,047.90 కోట్లుగా ఉందని తెలిపింది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో నికర లాభం రూ. 723.08 కోట్లుగా ఉంది.

అంబుజా సిమెంట్స్ సేల్స్ 15.10 శాతం పెరిగాయని, 7.39 మిలియన్ టన్నులకు చేరుకుందని తెలిపింది.

2022 తొలి అర్ధ సంవత్సరంలో అంబుజా సిమెంట్స్ కన్సాలిడేటెడ్ నెట్ ప్రాఫిట్ 27.93 శాతం మేర తగ్గి రూ. 1,721.90 కోట్లుగా ఉంది.

ఏప్రిల్-జూన్ 2022 త్రైమాసికంలో పెరిగిన ఇంధన ధరలు, ద్రవ్యోల్భణం ప్రభావం చూపిందని ఎండీ నీరజ్ అఖౌరీ తెలిపారు.

తదుపరి వ్యాసం