Delhi: 62ఏళ్ల అమెరికన్ మహిళను రేప్ చేసిన కేసులో ఆగ్రా వ్యక్తి అరెస్ట్.. ఏం జరిగిందంటే!
08 May 2023, 20:57 IST
- Delhi: ఓ అమెరికన్‍ను అత్యాచారం చేసిన కేసులో ఆగ్రాకు చెందిన ఓ వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అతడు మోసం చేశాడని ఆ అమెరికన్.. ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రతీకాత్మక చిత్రం
Delhi: పెళ్లి చేసుకుంటానని నమ్మిస్తూ 62 ఏళ్ల అమెరికన్ మహిళను అత్యాచారం చేసిన కేసులో ఆగ్రాకు చెందిన ఓ వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. నిందితుడిని అగ్రాకు చెందిన 32 ఏళ్ల గగన్‍దీప్‍గా పోలీసులు గుర్తించారు. వివరాలివే..
Delhi: 2017లో తాను ఇండియాకు వచ్చానని, ఆ సమయంలో గగన్‍దీప్‍కు చెందిన ఇంట్లో ఉన్నానని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆ అమెరికన్ పేర్కొన్నారు. ఆ తర్వాత తాను, గగన్‍దీప్ స్నేహితులమయ్యామని, ఆ క్రమంలో శారీరక సంబంధం ఏర్పడిందని ఆమె చెప్పినట్టు పోలీసులు వెల్లడించారు.
Delhi: ఆ తర్వాత కూడా కొన్నిసార్లు గగన్‍దీప్‍ను కలిసేందుకు ఇండియాకు వచ్చానని ఆ అమెరికన్ తన కంప్లైట్‍లో తెలిపారు. పెళ్లి చేసుకుంటానని నమ్మిస్తూ పలుసార్లు అతడు తనతో శారీరక బంధాన్ని కొనసాగించాడని ఆమె ఆరోపించారు. సుర్జామాల్ విహార్‌లోనూ ఓసారి అతడు తనతో ఫిజికల్ రిలేషన్ పొందాడని ఆమె తెలిపారు.
Delhi: నమ్మించడంలో భాగంగా తమ బంధాన్ని బంధువులు, తెలిసిన వారికి చెప్పేందుకు కొన్నిసార్లు తనను గగన్‍దీప్.. అమృత్‍సర్ తీసుకెళ్లాడని ఆ మహిళ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే సంవత్సరాలు గడుస్తున్నా పెళ్లి మాట దాటేస్తుండటంతో తనకు అనుమానం వచ్చిందని పేర్కొన్నారు. చివరికి అతడు తనను మోసం చేస్తున్నాడని గుర్తించానని ఆమె పోలీసులకు కంప్లైట్ చేశారు. ఈ ఫిర్యాదు వివరాలను ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.
Delhi: నిందితుడిపై వివేక్ నగర్ పోలీస్ స్టేషన్‍లో అత్యాచారం కేసును పోలీసులు నమోదు చేసినట్టు ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. “విచారణ ఆధారంగా నిందితుడు గగన్‍దీప్‍ను ఆగ్రాలో మే 6వ తేదీన అరెస్ట్ చేశాం” అని ఆయన తెలిపారు.