తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Aai Recruitment 2024: ఏర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 490 ఉద్యోగాల భర్తీ

AAI Recruitment 2024: ఏర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 490 ఉద్యోగాల భర్తీ

HT Telugu Desk HT Telugu

20 February 2024, 19:27 IST

google News
    • AAI Recruitment 2024: ఏర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 490 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ పోస్ట్ లకు ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో ఏప్రిల్ 2వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. 
ఏఏఐ లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ
ఏఏఐ లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ

ఏఏఐ లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ

దేశవ్యాప్తంగా ఉన్న ఏర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కు చెందిన వివిధ శాఖలలో 490 జూనియర్ ఎగ్జిక్యూటివ్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్ట్ లకు దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 2న ప్రారంభమవుతుంది. అభ్యర్థులు మే 1 వ తేదీ వరకు ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోవచ్చు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో ఏర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్ సైట్ www.aai.aero ద్వారా అప్లై చేసుకోవచ్చు.

విద్యార్హతలు..

ఈ పోస్ట్ లకు అప్లై చేసే అభ్యర్థులు సంబంధిత ఇంజినీరింగ్ డిగ్రీ లేదా ఎంసీఏ డిగ్రీ కలిగి ఉండాలి. అలాగే, వారు ఆ సబ్జెక్ట్ లో గేట్-2024కు హాజరై, ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 490 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఖాళీల వివరాలు

జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఆర్కిటెక్చర్): 3

జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజినీరింగ్/ సివిల్): 90

జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్): 106

జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రానిక్స్): 278

జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ): 13

ఏఏఐ రిక్రూట్మెంట్ 2024 వయోపరిమితి

ఈ పోస్ట్ లకు అప్లై చేసే అభ్యర్థుల వయస్సు 27 ఏళ్లు మించి ఉండకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ (నాన్ క్రీమీలేయర్) అభ్యర్థులకు మూడేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.300 చెల్లించాలి. అయితే, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు, ఏఏఏలో సంవత్సరం అప్రెంటిస్ షిప్ పూర్తి చేసుకున్నవారికి ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. మరిన్ని వివరాలకు అభ్యర్థులు డీటెయిల్డ్ నోటిఫికేషన్ ను పరిశీలించాలి.

తదుపరి వ్యాసం