తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Goa Crime News: ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన రష్యన్; పరారీలో నిందితుడు

Goa crime news: ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన రష్యన్; పరారీలో నిందితుడు

HT Telugu Desk HT Telugu

21 February 2024, 13:06 IST

  • Goa crime news: ఫిబ్రవరి 4, 5 తేదీల మధ్య రాత్రి గోవా సమీపంలోని అరాంబోల్ లో ఏర్పాటు చేసిన నైట్ క్యాంప్ లో రష్యాకు చెందిన నిందితుడు ఆరేళ్ల చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అనంతరం, మర్నాడు ఆ రష్యన్ దేశం విడిచి పారిపోయాడు.

ఆరేళ్ల బాలికపై రష్యన్ అత్యాచారం
ఆరేళ్ల బాలికపై రష్యన్ అత్యాచారం

ఆరేళ్ల బాలికపై రష్యన్ అత్యాచారం

Goa crime news: ఉత్తర గోవాలోని అరంబోల్ గ్రామంలో ఆరేళ్ల చిన్నారిపై రష్యా జాతీయుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఫిబ్రవరి 4, 5 తేదీల మధ్య రాత్రి అరంబోల్ లో నిర్వహించిన శిబిరంలో నిందితుడు బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఫిబ్రవరి 19న చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో ఆ రష్యన్ ఘటన జరిగిన మర్నాడే దేశం విడిచి పారిపోయాడని తేలింది.

ట్రెండింగ్ వార్తలు

USA Crime News: స్కూల్లో క్లాస్ మేట్స్ ఎగతాళి చేస్తున్నారని పదేళ్ల బాలుడు ఆత్మహత్య

IMD predictions: ఆంధ్ర ప్రదేశ్ సహా దక్షణాది రాష్ట్రాల్లో మే 21 వరకు భారీ వర్షాలు; యూపీ, హరియాణాల్లో హీట్ వేవ్

Air India: పుణె ఎయిర్ పోర్టులో ఎయిరిండియా విమానానికి ప్రమాదం; ప్రయాణికులు, సిబ్బంది సేఫ్

Indian students: భారతీయ విద్యార్థులకు ‘డీపోర్టేషన్’ ముప్పు; భారీగా నిరసనలు

కేసు నమోదు

ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ ఆరోపణలపై రష్యా దేశీయుడైన ఇలియా వసులేవ్ పై ఐపీసీ సెక్షన్ 376, గోవా చిల్డ్రన్స్ యాక్ట్ (చైల్డ్ అబ్యూజ్) సెక్షన్ 8, లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ కల్పించే చట్టం (పోక్సో) సెక్షన్ 4, 8 ల కింద కేసు నమోదు చేశారు. ‘‘ఫిర్యాదుదారుని మైనర్ కుమార్తెను అనుచితంగా తాకి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దాంతో, ఆ రష్యన్ పై కేసు నమోదు చేశాం" అని రాష్ట్ర మహిళా పోలీస్ స్టేషన్ కు చెందిన పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఫిబ్రవరి 4 రాత్రి ఉత్తర గోవాలోని అరంబోల్ గ్రామంలో ఏర్పాటు చేసిన నైట్ క్యాంప్ లో పాల్గొన్న ఆ బాలికపై రష్యన్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఆ బాలిక ఘటన జరిగిన కొద్ది రోజుల తర్వాత తన తల్లిదండ్రులకు చెప్పిందని పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసేందుకు పోలీసులు రష్యా అధికారుల సాయం తీసుకోనున్నారు.

తదుపరి వ్యాసం