తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Iit, Iim, Nit Students Suicide: 61 మంది నిట్, ఐఐటీ, ఐఐఎం విద్యార్థుల ఆత్మహత్య

IIT, IIM, NIT students suicide: 61 మంది నిట్, ఐఐటీ, ఐఐఎం విద్యార్థుల ఆత్మహత్య

HT Telugu Desk HT Telugu

28 March 2023, 20:02 IST

google News
  • IIT, IIM, NIT students suicide: 2018 నుంచి 2022 వరకు ప్రతిష్టాత్మక నిట్ (NIT), ఐఐటీ (IIT), ఐఐఎం (IIM) విద్యాసంస్థల్లో చదువుతున్న మొత్తం 61 మంది విద్యార్థులు బలవన్మరణం పొందారని కేంద్రం పార్లమెంటుకు తెలిపింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

IIT, IIM, NIT students suicide: 2018 నుంచి 2022 వరకు ప్రతిష్టాత్మక నిట్ (National Institutes of Technology NIT), ఐఐటీ (IIT Indian Institutes of Technology), ఐఐఎం (Indian Institutes of Management IIM) విద్యాసంస్థల్లో చదువుతున్న మొత్తం 61 మంది విద్యార్థులు బలవన్మరణం (suicide) పొందారు. ఈ విషయాన్ని మంగళవారం కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు వెల్లడించింది. ఈ వివరాలను కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి సుభాష్ సర్కార్ లిఖిత పూర్వకంగా లోక్ సభకు తెలిపారు.

IIT, IIM, NIT students suicide: ఐఐటీ ల నుంచి 33 మంది

2018 నుంచి 2022 వరకు ఆత్మహత్య (suicide) చేసుకున్న నిట్ (National Institutes of Technology NIT), ఐఐటీ (IIT Indian Institutes of Technology), ఐఐఎం (Indian Institutes of Management IIM) విద్యార్థుల్లో సగానికి పైగా ఐఐటీ విద్యార్థులే ఉన్నారు. ఈ నాలుగేళ్లలో 33 మంది ఐఐటీ (IIT) విద్యార్థులు, 24 మంది నిట్ (NIT) విద్యార్థులు, నలుగురు ఐఐఎం (IIM) విద్యార్థులు ఆత్మహత్య (suicide) కు పాల్పడ్డారు. వీరిలో 2018లో 11 మంది, 2019లో 16 మంది, 2020లో ఐదుగురు, 2021 లో 9 మంది ప్రాణాలు తీసుకున్నారు. కాంగ్రెస్ సభ్యులు గౌరవ్ గొగోయి, కే మురళీధరన్ తదితరులు అడిగిన ప్రశ్నకు జవాబుగా కేంద్ర మంత్రి ఈ వివరాలను వెల్లడించారు. ‘‘గత ఐదేళ్లలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లోని విద్యార్థుల్లో ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారు? అందుకు కారణాలేంటి? ఈ ఆత్మహత్యల (suicide) నివారణకు తీసుకుంటున్న చర్యలేంటి?’’ అని ఆ సభ్యులు ప్రశ్నించారు.

IIT, IIM, NIT students suicide: ఒత్తిడే ప్రధాన కారణం..

కాంగ్రెస్ (congress) సభ్యులు అడిగిన ప్రశ్నలకు జవాబుగా.. విద్యాసంస్థల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న చదువుకు సంబంధించిన ఒత్తిడి (academic stress) ఈ ఆత్మహత్యలకు (suicide) ప్రధాన కారణంగా తేలిందని కేంద్ర మంత్రి తెలిపారు. అలాగే, కుటుంబ కారణాలు, వ్యక్తిగత కారణాలు, అనారోగ్యకారణాలు కూడా ఈ ఆత్మహత్యల వెనుక ఉన్నాయన్నారు. నూతన విద్యా విధానం (NEP) లో ఒత్తిడిని ఎదుర్కొంటున్న విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించే ప్రతిపాదన కూడా ఉందన్నారు.

టాపిక్

తదుపరి వ్యాసం