5G service start in india: 5జీ మొబైల్ సేవల కోసం చూస్తున్నారా? ఇవి తెలుసుకోండి..
30 August 2022, 11:36 IST
5G service start in india: 5G మొబైల్ సేవల కోసం భారతదేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే సగటు వినియోగదారుడు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు మీకందిస్తున్నాం. అందుబాటులో ఉన్న వివిధ 5G బ్యాండ్‌లు ఏవి? ఏ స్మార్ట్‌ఫోన్‌లు 5జీ మొబైల్ సర్వీసెస్‌ను సపోర్ట్ చేస్తాయి? వంటి విషయాలు తెలుసుకోండి.
5G mobile services in india: 5 జీ మొబైల్ సేవలు
5G service start in india: 5జీ మొబైల్ సేవల ప్రారంభం కోసం దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. స్మార్ట్ ఫోన్స్ నేటికాలంలో లైఫ్‌లైన్‌గా మారిపోయాయి. కాల్స్, మెసేజెస్యా వంటి పాతకాలపు సేవలతో పాటు.. యాప్‌ల ద్వారా విభిన్న సేవలు అందిస్తున్నాయి. ఫోటోలు, వీడియోలు తీయడానికి, సోషల్ మీడియా ద్వారా కనెక్ట్ అవ్వడానికి.. ఇలా సర్వం స్మార్ట్‌ఫోన్ మయమే. మరికొద్ది రోజుల్లోనే భారతదేశం 5G సేవల కోసం సిద్ధమవుతోంది. ఈ 5జీ సేవలతో మన జీవితాలు మరింత ఫాస్ట్‌మోడ్‌లోకి వెళ్లబోతున్నాయి. కమ్యూనికేట్ చేసే విధానం త్వరలోనే పూర్తిగా రూపాంతరం చెందబోతోంది.
ఈ ఏడాది అక్టోబర్ 12 నాటికి భారతదేశంలో 5G సేవలను ప్రారంభించనున్నట్లు ఐటీ, కమ్యూనికేషన్ల మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. ఆ తర్వాత దేశంలోని ప్రధాన నగరాలకు విస్తరించనున్నట్టు తెలిపారు. డిజిటల్ ఇండియా విజన్‌లో భాగంగా రాబోయే 2-3 సంవత్సరాలలో దేశంలోని ప్రతి ప్రాంతంలో కనెక్టివిటీని అందించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ క్రమంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) ఇటీవల స్పెక్ట్రమ్ వేలం నిర్వహించింది. దీని ద్వారా ప్రధాన టెలికాం కంపెనీల నుండి రూ. 17,876 కోట్లు పొందింది.
5G సేవలు త్వరలో ప్రారంభమవుతాయని టెలికాం ఆపరేటర్లు ప్రకటించారు. అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ, గాంధీనగర్, గురుగ్రామ్, హైదరాబాద్, జామ్‌నగర్, కోల్‌కతా, లక్నో, ముంబై, పూణే వంటి 13 నగరాల్లో తొలుత 5జీ సేవలు ప్రారంభమవుతాయి. 2023 నాటికి విస్తృత 5G కవరేజీ అందుబాటులోకి రానుంది.
5G ద్వారా అధిక సామర్థ్యం
సెల్యులార్ నెట్‌వర్క్‌లు నేడు మొబైల్ ఫోన్ వినియోగదారులకు అత్యుత్తమ సేవలను అందిస్తున్నాయి. 5G లేదా ఐదవ తరం సెల్యులార్ నెట్‌వర్క్ టెక్నాలజీ మన జీవన విధానాన్ని మార్చివేస్తుందని, అంతులేని అవకాశాలను తేనుందని ఆకాంక్షిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, వర్చువల్ రియాలిటీ, క్లౌడ్ గేమింగ్ వంటి అప్లికేషన్‌లు మరింత మెరుగ్గా పనిచేస్తాయని భావిస్తున్నారు.
అధిక వినియోగ భారం కారణంగా 4G నెట్‌వర్క్‌లు తరచుగా రద్దీగా ఉంటాయి. టవర్ రద్దీ కారణంగా మనం నెట్‌వర్క్ యాక్సెస్ చేయలేని సందర్భాలు ఉన్నాయి. కానీ, 5G నెట్‌వర్క్‌లు పెరిగిన వేగం, అధిక బ్యాండ్‌విడ్త్‌తో నిరంతరాయంగా సేవలను అందిస్తాయి. 5G కనెక్టివిటీ 4Gతో పోలిస్తే 100 రెట్లు అధిక పనితనం అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో మెరుగైన కనెక్టివిటీని కూడా అందించగలదని భావిస్తున్నారు. టెక్-లీడ్ డ్రోన్ డెలివరీలు, స్మార్ట్ సిటీల సృష్టితో భవిష్యత్తులో మరింత కొత్త ఆవిష్కరణలకు ఇది సహాయపడుతుంది.
5G యొక్క ప్రయోజనాలు
కొత్త 5G నెట్‌వర్క్‌లు 4G LTE కంటే తక్కువ లేటెన్సీ (జాప్యం) కలిగి ఉంటాయి. ఐదు మిల్లీసెకన్ల కంటే తక్కువ సమయం తీసుకునే డేటా రౌండ్-ట్రిప్ ట్రాన్స్‌మిషన్‌తో పనిచేస్తుంది. వీడియో కాల్స్‌లో ఎలాంటి అంతరాయాలు ఉండవు. లైవ్‌లో మాట్లాడుకున్నట్టే ఉంటుంది. హై రిజల్యూషన్‌లో మూవీస్ చూడొచ్చు.
వేగవంతమైన డౌన్‌లోడ్
ఈ శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌తో మీరు వేగవంతంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. iPhone 13, OPPO Reno8 Pro, Nothing Phone (1) , Motorola Edge 30 Pro వంటి స్మార్ట్‌ఫోన్‌లు భారతదేశంలో విడుదల అవుతున్న మొత్తం 8 రకాల 5G బ్యాండ్‌లకు మద్దతు ఇస్తున్నాయి. దీని వల్ల డౌన్‌లోడ్ కోసం వేగవంతమైన నెట్‌వర్క్‌ను ఎంచుకోవచ్చు.
మెరుగైన గేమింగ్ అనుభవం
హై స్పీడ్, మినిమల్ లాగ్ కలయిక వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ గేమ్‌లకు 5జీ సరైన నెట్‌వర్క్. మీ గేమింగ్ అనుభవాన్ని అంతరాయం లేకుండా, అందులో లీనమయ్యేలా చేస్తుంది.
ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్
మీరు మీ స్మార్ట్‌ఫోన్ ద్వారా స్మార్ట్ టీవీ, స్పీకర్‌లు మొదలైన 10 రెట్లు ఎక్కువ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పరికరాలకు కనెక్ట్ చేయవచ్చు. ఇదంతా 5G వల్ల సాధ్యమవుతుంది.
5G బ్యాండ్‌లు ఏవి అందుబాటులోకి రానున్నాయి?
దేశంలో మూడు రకాల 5G బ్యాండ్‌లు ఉన్నాయి. తక్కువ బ్యాండ్, మధ్య బ్యాండ్, అధిక బ్యాండ్ ఫ్రీక్వెన్సీ ఆధారంగా వర్గీకరిస్తారు. తక్కువ-బ్యాండ్ ఫ్రీక్వెన్సీలలో 600 MHz, 700 MHz, 800 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHz, 2500 MHz ఉన్నాయి.
మధ్య బ్యాండ్ ఫ్రీక్వెన్సీ 3300 MHz. చివరగా స్పెక్ట్రం 72 GHz వరకు అధిక-బ్యాండ్ ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటుంది. దీనిని mmWave అని పిలుస్తారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) 600 MHz నుండి 72 GHz వరకు వివిధ రకాల ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌లను విడుదల చేసింది. ఇందులో టెలికాం ఆపరేటర్లు అన్ని రకాల ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌లను కొనుగోలు చేశారు. కానీ, mm Waveకి ప్రస్తుతం భారతదేశంలో యాక్సెస్ లేదు. ఎందుకంటే దీనికి ప్రత్యేకమైన మౌలిక సదుపాయాలు, యాంటెనాలు అవసరం.
5Gకి మారుతున్నారా?
భారతదేశం ప్రస్తుతం ఉన్న 4G మౌలిక సదుపాయాలను ఉపయోగించుకునేందుకు వీలుంది. ఇది నాన్ స్టాండలోన్ (NSA) 5G నెట్‌వర్క్. స్వతంత్ర (స్టాండలోన్) 5G నెట్‌వర్క్ కోసం తాజా మౌలిక సదుపాయాలను నిర్మించడానికి సమయం పడుతుంది. భారీ మూలధన పెట్టుబడి కూడా అవసరం.
రూ. 15 వేల లోపు 5G ఫోన్‌లు ఇవే..
● POCO M4 5G
● POCO M4 ప్రో 5G
రూ. 20 వేల లోపు 5G ఫోన్‌లు
● Motorola G62 5G
● Realme 9 5G
● POCO X4 Pro 5G
● OPPO K10 5G
● Samsung Galaxy F23 5G
రూ. 25 వేల లోపు 5G ఫోన్‌లు
● Realme 9 Pro+ 5G
● Moto G82 5G
● Vivo T1 ప్రో 5G
రూ. 30 వేల లోపు 5G ఫోన్‌లు
● Xiaomi 11i 5G
● POCO F4 5G
● OPPO Reno8 5G
రూ. 30 వేల పైన 5G ఫోన్‌లు
● OPPO Reno7 Pro 5G
● OPPO Reno8 Pro
● Nothing phone (1)
● Google Pixel 6a
● iPhone 13