Chemical tanker explodes: పుణె - ముంబై ఎక్స్ ప్రెస్ వే పై పేలిన కెమికల్ ట్యాంకర్; నలుగురి దుర్మరణం
13 June 2023, 18:36 IST
Chemical tanker explodes: పుణె - ముంబై ఎక్స్ ప్రెస్ వే పై మంగళవారం కెమికల్ ట్యాంకర్ పేలడంతో మంటలు అంటుకుని నలుగురు సజీవదహనమయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదంలో తగలబడిపోతున్న కెమికల్ ట్యాంకర్
Chemical tanker explodes: పుణె - ముంబై ఎక్స్ ప్రెస్ వే పై మంగళవారం కెమికల్ ట్యాంకర్ పేలడంతో మంటలు అంటుకుని నలుగురు సజీవదహనమయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
నలుగురు దుర్మరణం
ప్రమాదకరమైన రసాయనం తీసుకువెళ్తున్న ట్యాంకర్ కు మంటలంటుకోవడంతో పుణె - ముంబై ఎక్స్ ప్రెస్ వే పై అది పేలిపోయి, తగలబడిపోయింది. ట్యాంకర్ డ్రైవర్ ప్రాణాలు కోల్పోగా, అందులోని మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అలాగే, ఆ ట్యాంకర్ లోని రసాయనం చిల్లి, పక్కన వెళ్తున్న వాహనదారులపై పడి, వారికి కూడా మంటలంటుకోవడంతో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రద్దీగా ఉండే పుణె - ముంబై ఎక్స్ ప్రెస్ వే పై ఈ ప్రమాదం జరగడంతో కొన్ని గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. కొన్ని కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు.ఈ ఘటన పుణె - ముంబై ఎక్స్ ప్రెస్ వే పై ఖండాలా ఎగ్జిట్ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.
పుణె వెళ్తుండగా..
పుణె వెళ్తున్న కెమికల్ ట్యాంకర్ కు మొదట మంటలంటుకున్నాయి. ఆ ట్యాంకర్ లో ప్రమాదకర రసాయనం ఉండడంతో మంటలు ఒక్కసారిగా విజృంభించాయి. ఆ రసాయనం వల్ల పేలుడు సంభవించి, ఆ రసాయనంతో కూడిన ఫైర్ బాల్స్ కింద వెళ్తున్న వాహనదారులపై పడ్డాయి. దాంతో, వారు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ట్యాంకర్ సహా మొత్తం 4 వాహనాలు తగలబడ్డాయి. ఈ ప్రమాదంలో మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోయారని, ఐదుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని లోనావాలా సబ్ డివిజన్ డీఎస్పీ సత్య సాయి కార్తిక్ తెలిపారు. పుణె - ముంబై ఎక్స్ ప్రెస్ వే పై ట్రాఫిక్ ను మళ్లీ పునరుద్ధరించామన్నారు.