తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Farmer Death: పోలీసు కాల్పుల్లో యువ రైతు మృతి; ఉద్రిక్తంగా ఢిల్లీ సరిహద్దులు

Farmer death: పోలీసు కాల్పుల్లో యువ రైతు మృతి; ఉద్రిక్తంగా ఢిల్లీ సరిహద్దులు

HT Telugu Desk HT Telugu

22 February 2024, 13:07 IST

  • Farmer died in police firing: ఢిల్లీ సరిహద్దుల్లో పోలీసులు, రైతుల మధ్య ఘర్షణల్లో ఒక యువ రైతు ప్రాణాలు కోల్పోయాడు. పోలీసు కాల్పుల్లో పంజాబ్ కు చెందిన శుభ్ కరణ్ సింగ్ అనే 21 ఏళ్ల రైతు బుల్లెట్ గాయంతో మరణించారు.

పోలీసుల కాల్పుల్లో చనిపోయిన పంజాబ్ యువ రైతు శుభ్ కరణ్ సింగ్
పోలీసుల కాల్పుల్లో చనిపోయిన పంజాబ్ యువ రైతు శుభ్ కరణ్ సింగ్

పోలీసుల కాల్పుల్లో చనిపోయిన పంజాబ్ యువ రైతు శుభ్ కరణ్ సింగ్

Farmer died in police firing: ప్రస్తుత రైతు ఉద్యమంలో మరణించిన మొదటి రైతుగా టీనేజ్ నిరసనకారుడు అయిన 21 ఏళ్ల శుభ్ కరణ్ సింగ్ నిలిచాడు. శుభ్ కరణ్ సింగ్ బుల్లెట్ గాయాలతో మరణించాడని అధికారులు నిర్ధారించారు. అయితే, అది రబ్బర్ బుల్లెట్ నా? లేక సాధారణ బుల్లెటా? అనే విషయాన్ని వారు వెల్లడించలేదు. యువ రైతు మరణంతో తమ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని రైతులు ఫిబ్రవరి 23 వరకు వాయిదా వేశారు.

ట్రెండింగ్ వార్తలు

Israel-Hamas war: ఐరాసలో పాలస్తీనాకు అనుకూలంగా ఓటేసిన భారత్; నెగ్గిన ప్రతిపాదన

International Space Station: మే 14 వరకు ఈ సమయాల్లో అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ ను నేరుగా చూసే అవకాశం

Crime news : దారుణం.. తల్లి, భార్యను చంపి- పిల్లల్ని మేడ మీద నుంచి పడేసి.. చివరికి..!

Prajwal Revanna case : ప్రజ్వల్​ రేవన్నపై ఫిర్యాదు చేసిన బీజేపీ నేత అరెస్ట్​- మరో మహిళపై..

బుల్లెట్ గాయంతోనే..

శుభ్ కరణ్ సింగ్ మరణించాడని స్థానిక ఆసుపత్రి, పంజాబ్ ప్రభుత్వం, రైతు సంఘాలు ధృవీకరించాయి. అతను చనిపోయాడని, ప్రాథమిక పరీక్షలో బుల్లెట్ తగిలినట్లు తెలుస్తోందని తెలిపారు. పోస్టుమార్టం తర్వాతే బుల్లెట్ స్వభావాన్ని నిర్ధారించగలం' అని పాటియాలాకు చెందిన రాజేందర్ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ హెచ్ ఎస్ రేఖి తెలిపారు. ఆయన మృతి చెందిన వెంటనే రైతులు రెండు రోజుల పాటు ఢిల్లీ మార్చ్ ను నిలిపివేయాలని నిర్ణయించారు. పోలీసుల కాల్పులు, టియర్ గ్యాస్ దాడిలో పెద్ద సంఖ్యలో రైతులు గాయపడ్డారని అందువల్ల, శుక్రవారం (ఫిబ్రవరి 23) వరకు ఢిల్లీ మార్చ్ ను నిలిపివేయాలని నిర్ణయించామని రైతు నేతలు చెప్పారు. ‘‘మరణించిన శుభ్ కరణ్ సింగ్ దహన సంస్కారాలు, చికిత్స, నష్టపరిహారం తదితర సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఢిల్లీ మార్చ్ ను నిలిపివేయాలని నిర్ణయించాం’’ అని కిసాన్ మజ్దూర్ మోర్చా సమన్వయకర్త శ్రావణ్ సింగ్ పంధేర్ తెలిపారు.

పంజాబ్, బటిండా కు చెందిన యువ రైతు..

పోలీసు కాల్పుల్లో చనిపోయిన శుభ్ కరణ్ సింగ్ పంజాబ్ లోని బటిండా జిల్లాలోని బల్లోచ్ గ్రామానికి చెందినవాడు. అతడు తన గ్రామంలోని మరో 15 మంది రైతులతో కలిసి ఛలో ఢిల్లీ నిరసనల్లో పాల్గొనడానికి తరలివచ్చాడు. పంజాబ్, హరియాణాల మధ్య ఉన్న ఖనౌరీ సరిహద్దు వద్ద రైతులు, పోలీసులకు మధ్య తీవ్రస్థాయి ఘర్షణలు జరిగాయి. రైతులను అడ్డుకునేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో శుభ్ కరణ్ సింగ్ గాయపడి, మరణించారు.

కుటుంబ బాధ్యతలు

21 ఏళ్ల శుభ్ కరణ్ సింగ్ పైననే అతడి కుటుంబం ఆధారపడి ఉందని, వారి కుటుంబానికి 1.5 ఎకరాల భూమి ఉందని బంధువులు తెలిపారు. అతనికి ఉన్న భూమి పరిమాణాన్ని ఇతర గ్రామస్తులతో పోల్చి చూస్తే అది చాలా చిన్న ప్లాటు. అది కనీసం జీవనోపాధికి కూడా సరిపోదు. సింగ్ తండ్రి మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. 15 సంవత్సరాల క్రితం శుభ్ కరణ్ సింగ్ తన తల్లిని కోల్పోయాడు. వారి కుటుంబంలో అతనొక్కడే సంపాదనపరుడు’’ అని వారి బంధువు గుర్ప్రీత్ సింగ్ చెప్పారు.

ఖనౌరీ సరిహద్దు వద్ద ఘర్షణలు

వందలాది మంది రైతుల మాదిరిగానే శుభ్ కరణ్ సింగ్ కూడా స్వచ్ఛందంగా ట్రాక్టర్ నడుపుతూ ఢిల్లీకి వచ్చాడు. తమ గ్రామ పెద్ద నుంచి ట్రాక్టర్ ను తీసుకుని గ్రామానికి చెందిన 15 మంది రైతులు ఢిల్లీ బయల్దేరారు. రెండు వారాల క్రితం తన గ్రామం నుంచి బయలుదేరడానికి కొన్ని గంటల ముందు, సింగ్, ఇతరులు గ్రామ గేటు వద్ద ఫోటోలకు ఫోజులిచ్చారు. ఫిబ్రవరి 13న పంజాబ్-ఢిల్లీ హైవేపై ప్రయాణించిన వీరిని ఖనౌరీ వద్ద అడ్డుకున్నారు. ఖనౌరీ సరిహద్దులో 900 ట్రాక్టర్లు, 9 వేల మంది రైతులు ఉన్నారు.

కిచెన్ డ్యూటీ

ఫిబ్రవరి 13న ఖనౌరీకి చేరుకున్న తర్వాత ఆ బృందంలో అతి పిన్న వయస్కుడైన సింగ్ కు సరిహద్దులో కిచెన్ డ్యూటీ ఇచ్చారు. మంగళవారం రాత్రి సరిహద్దులోని శిబిరంలో సింగ్ చపాతీలు తయారు చేసి అందరికీ వడ్డించారని మరో రైతు కరంజీత్ సింగ్ చెప్పారు. ‘‘శుభ్ కరణ్ సింగ్ ఒక్కగానొక్క కొడుకు. అతని అక్కకు వివాహమైంది. 2020-21 నిరసన సమయంలో కూడా, అతను తన తదుపరి లక్ష్యం తన చెల్లెలికి వివాహం చేయడమే అని మాకు చెప్పేవాడు" అని కరమ్జీత్ సింగ్ చెప్పారు.

వేలాది రైతులు

కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) చట్టం సహా పలు డిమాండ్లతో పంజాబ్ కు చెందిన వేలాది మంది రైతులు ఛలో ఢిల్లీ నినాదంతో పంజాబ్, హర్యానా సరిహద్దులను ముట్టడించారు. రుణ మాఫీ, 2020 నవంబర్ నుంచి 2021 డిసెంబర్ వరకు ఢిల్లీలో 13 నెలల పాటు జరిగిన రైతుల ఆందోళనలో మరణించిన వారి బంధువులకు ఉద్యోగాలు, 2021 అక్టోబర్లో లఖింపూర్ ఖేరీలో గాయపడిన రైతులకు పరిహారం, నిరసన తెలుపుతున్న రైతులపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలనేవి రైతుల ప్రధాన డిమాండ్లలో కొన్ని.

హర్యానా పోలీసులపై కేసు

శుభ్ కరణ్ సింగ్ మరణాన్ని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ధృవీకరించారు. హత్యా నేరంపై హర్యానా పోలీసులపై తమ రాష్ట్రం ఎఫ్ఐఆర్ నమోదు చేస్తుందని చెప్పారు. పోస్టుమార్టం అనంతరం కేసు నమోదు చేస్తామన్నారు. అతని మరణానికి కారణమైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని మన్ విడుదల చేసిన ఒక వీడియో సందేశంలో పేర్కొన్నారు.

తదుపరి వ్యాసం