తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  15 Electrocuted To Death: విద్యుదాఘాతంతో 15 మంది దుర్మరణం

15 electrocuted to death: విద్యుదాఘాతంతో 15 మంది దుర్మరణం

HT Telugu Desk HT Telugu

19 July 2023, 14:04 IST

google News
  • 15 electrocuted to death: ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ట్రాన్స్ ఫార్మర్ పేలడంతో విద్యదాఘాతానికి గురై 15 మంది ప్రాణాలు కోల్పోయారు. చమోలీ జిల్లాలో అలకనంద నది తీరంలో నిర్మిస్తున్న నమామి గంగ ప్రాజెక్టు వద్ద ఈ ఘోర ప్రమాదం జరిగింది. మృతుల్లో ఒక సబ్ ఇన్ స్పెక్టర్ కూడా ఉన్నారు. 

అలకనంద నది తీరంలో జరిగిన ప్రమాదం దృశ్యం
అలకనంద నది తీరంలో జరిగిన ప్రమాదం దృశ్యం

అలకనంద నది తీరంలో జరిగిన ప్రమాదం దృశ్యం

15 electrocuted to death: ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ట్రాన్స్ ఫార్మర్ పేలడంతో విద్యదాఘాతానికి గురై 15 మంది ప్రాణాలు కోల్పోయారు. చమోలీ జిల్లాలో అలకనంద నది తీరంలో నిర్మిస్తున్న నమామి గంగ ప్రాజెక్టు వద్ద బుధవారం ఈ ఘోర ప్రమాదం జరిగింది. మృతుల్లో ఒక సబ్ ఇన్ స్పెక్టర్, ఐదుగురు హోం గార్డ్స్ కూడా ఉన్నారు.

ట్రాన్స్ ఫార్మర్ పేలడంతో..

అలకనంద నది తీరంలో నిర్మిస్తున్న నమామి గంగ ప్రాజెక్టు వద్ద బుధవారం ఉదయం ట్రాన్స్ ఫార్మర్ పేలడంతో విద్యుత్ షాక్ తగిలి 15 మంది ప్రాణాలు కోల్పోయారు. 10 మంది వరకు గాయాలపాలయ్యారు. పోలీసులు, ఇతర సహాయ సిబ్బంది ఘటనా స్థలానికి చేరకుని క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించే కార్యక్రమం చేపట్టారు. రివర్ డ్యామ్ సైడ్ రెయిలింగ్ వాల్ కు విద్యుత్ ప్రసారం కావడంతో ప్రాజెక్టు సైట్ కేర్ టేకర్ గణేశ్ లాల్ చనిపోయారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 15 మంది చనిపోయారని, ఏడుగురికి తీవ్రంగా గాయాలయ్యాయని రాష్ట్ర మంత్రి ధన్ సింగ్ రావత్ వెల్లడించారు. తీవ్రంగా గాయపడిన వారిని రిషికేష్ లోని ఎయిమ్స్ కు తరలించామన్నారు. ఈ ప్రమాదంపై న్యాయ విచారణ జరుగుతుందన్నారు.

వర్షాలు, వరదలకు తోడు.. ఈ ప్రమాదం..

ఉత్తరాఖండ్ లో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడ్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వరద పరిస్థితి నెలకొన్నది. అలకనంద నదిలో కూడా నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరింది. జీవీకే హైడ్రో పవర్ ప్రాజెక్టు నుంచి కూడా వరద నీరు రావడంతో అలకనందలో నీటి మట్టం భారీగా పెరిగింది. రాష్ట్రంలో ఉన్న ఇతర నదులు కూడా ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో, నదులకు సమీపంగా వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.

తదుపరి వ్యాసం