తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Lumpy Virus: మహారాష్ట్రలో లంపీ వైరస్ టెన్షన్… 126 పశువులు మృత్యువాత

Lumpy virus: మహారాష్ట్రలో లంపీ వైరస్ టెన్షన్… 126 పశువులు మృత్యువాత

HT Telugu Desk HT Telugu

18 September 2022, 9:09 IST

  • Lumpy virus in Maharashtra: మహారాష్ట్రంలో లంపీ వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటికే 126 పశువులు మృతి చెందినట్లు ఆ రాష్ట్ర అధికారులు వెల్లడించారు. 25 జిల్లాలో కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు.

represntative image
represntative image (ani)

represntative image

126 cattle dead affected by lumpy virus in maharashtra: లంపీ వైరస్ బారిన పడి 126 పశువులు మహారాష్ట్రంలో మృతి చెందాయి. 25 కు పైగా జిల్లాల్లో ఈ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర పశుసంవర్థక శాఖ ప్రకటించింది. దీంతో వైరస్ నియంత్రించేందుకు సర్కార్ చర్యలు ముమర్మం చేసే పనిలో పడింది.

మొత్తం 126 పశువులు చనిపోగా... జల్గాన్ జిల్లాలో 47, అహ్మద్‌నగర్ జిల్లాలో 21, ధులే- 2, అకోలా- 18, పూణే -14, లాతూర్‌లో 2, సతారా - 6, బుల్దానా - 5, అమరావతి - ఏడు ఉండగా సంగ్లీ, జల్నా, నాగ్ పూర్ జిల్లాల్లో ఒకటి మృత్యువాత పడ్డాయి.

లంపీ స్కిన్ డిసీజ్ (ఎల్‌ఎస్‌డి) మహారాష్ట్ర రాష్ట్రమంతటా వేగంగా విస్తరిస్తోంది. ఇది పశువుల చర్మసంబంధమైన వైరల్ వ్యాధి అని వైద్యులు తెలిపారు. ఈ వ్యాధి జంతువుల నుండి లేదా ఆవు పాల ద్వారా మనుషులకు సంక్రమించదని స్పష్టం చేశారు. లంపీ స్కిన్ డిసీజ్ (ఎల్‌ఎస్‌డి) వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ, జంతువుల నుండి లేదా ఆవు పాల ద్వారా మానవులకు సంక్రమించదని పేర్కొంది.

పుకార్లు చేయవద్దు...

ఈ వైరస్ పై అనవసరమైన పుకార్లు ప్రచారం చేయవద్దని మహారాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఈ వ్యాప్తి ఆవులు, ఎద్దులకే పరిమితం చేయబడిందని స్పష్టం చేసింది. మనుషులకు వస్తుందంటూ లేని ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని పేర్కొంది.

వ్యాధి చికిత్సకు అవసరమైన మందుల కొనుగోలు కోసం ప్రతి జిల్లాకు కోటి రూపాయల చొప్పున నిధులు అందుబాటులో ఉంచినట్లు పశుసంవర్థక శాఖ తెలిపింది. Maharashtra Animal and Fisheries Sciences University ఆధ్వర్యంలో టీకాలను కూడా సిద్ధం చేశారు.

ఈ వైరస్ కు సంబంధించిన జంతువల్లో ఏమైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పశుసంవర్థ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రభుత్వం కోరింది.ఇంటివద్ద పశువులకు చికిత్స అందించేలా చర్యలు చేపడుతామని రైతులకు సూచించింది.

టాపిక్