తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Shraddha Delhi Murder Case: శ్రద్ధ హత్య కేసులో పోలీసులకు లభించిన 10 ఆధారాలు ఇవే.. ఫోన్ సహా మరిన్ని మిస్సింగ్!

Shraddha Delhi Murder Case: శ్రద్ధ హత్య కేసులో పోలీసులకు లభించిన 10 ఆధారాలు ఇవే.. ఫోన్ సహా మరిన్ని మిస్సింగ్!

17 November 2022, 12:36 IST

google News
    • Shraddha Delhi Murder Case: శ్రద్ద వాకర్ హత్య కేసులో ఢిల్లీ పోలీసులు ఇప్పటికే కొన్ని ఆధారాలు సేకరించారు. అలాగే కీలకమైన మరిన్ని క్లూస్ దొరకాల్సి ఉంది. వాటి వివరాలు ఇవే..
శ్రద్ధ వాకర్ శరీర భాగాలను కొనుగోనేందుకు నిందితుడు అఫ్తాబ్‍ను అడవికి తీసుకెళ్లిన ఢిల్లీ పోలీసులు (ANI)
శ్రద్ధ వాకర్ శరీర భాగాలను కొనుగోనేందుకు నిందితుడు అఫ్తాబ్‍ను అడవికి తీసుకెళ్లిన ఢిల్లీ పోలీసులు (ANI) (HT_PRINT)

శ్రద్ధ వాకర్ శరీర భాగాలను కొనుగోనేందుకు నిందితుడు అఫ్తాబ్‍ను అడవికి తీసుకెళ్లిన ఢిల్లీ పోలీసులు (ANI)

Shraddha Delhi Murder Case: శ్రద్ధా వాకర్ హత్య కేసులో పురోగతి కనిపిస్తోంది. ఢిల్లీలోని ఓ అపార్ట్ మెంట్‍లో శ్రద్ధను అఫ్తాబ్ అమీన్ పునావాలా ఈ ఏడాది మేలో దారుణంగా హత్య చేశాడు. ఈ కేసులో ఐదు రోజుల క్రితం అఫ్తాబ్‍ను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. శ్రద్ధను గొంతు నులిమి చంపిన అఫ్తాబ్.. ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా నరికాడు. మే 18న ఈ దురాగతానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు ఆ శరీర భాగాలను మెహ్రౌలీ అడవిలో పడేశాడు. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను ఢిల్లీ పోలీసులు సేకరిస్తున్నారు. విచారణ చేసే కొద్దీ శ్రద్ధ హత్యకేసులో విస్తుగొలిపే నిజాలు బయటికి వస్తున్నాయి. అఫ్తాబ్ కిరాతక చర్యలు తెలుస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటి వరకు పోలీసులు కొన్ని ఆధారాలు సేకరించారు. మరికొన్ని కీలకమైనవి దొరకాల్సి ఉంది. ఆ పూర్తి వివరాలు ఇవే.

Shraddha Walker Murder Case: పోలీసుల దగ్గర ఉన్న ఆధారాలు

  1. నేరం చేశానని అఫ్తాబ్ అంగీరిస్తూ ఇచ్చిన కన్ఫెషన్.
  2. మే 19న అఫ్తాబ్ ఓ ఫ్రిడ్జ్ కొనుగోలు చేశాడు. అందుకు సంబంధించి స్టోర్ ఓనర్ స్టేట్‍మెంట్, బిల్‍ను పోలీసులు సేకరించారు. శ్రద్ధ శరీర భాగాలను అఫ్తాబ్ కొన్నిరోజుల పాటు ఈ ఫ్రిడ్జ్ లోనే స్టోర్ చేశాడు.
  3. రూ.300 విలువైన వాటర్ బిల్. రక్తాన్ని, మర్డర్ కు సంబంధించిన ఆధారాలను చెరిపివేసేందుకు అఫ్తాబ్ వేల లీటర్ల నీటిని వినియోగించాడని దీని ద్వారా పోలీసులు భావిస్తున్నారు. ఢిల్లీ ప్రభుత్వం వేల లీటర్ల వరకు ఉచితంగా నీటిని సరఫరా చేస్తున్నా.. అంతకు మించి నీటిని అఫ్తాబ్ వినియోగించాడని ఈ బిల్ ద్వారా పోలీసులకు తెలుస్తోంది.
  4. అఫ్తాబ్.. కత్తిని కొనుగోలు చేసిన షాప్ సిబ్బంది స్టేట్‍మెంట్.
  5. అఫ్తాబ్ చేతికి అయిన గాయానికి కుట్లు వేసిన డాక్టర్ అనిల్ సింగ్ స్టేట్‍మెంట్.
  6. అడవిలో దొరికిన శరీర భాగాలు. వాటిని డీఎన్ఏ టెస్టుల కోసం పోలీసు ల్యాబ్‍కు పంపారు.
  7. అఫ్తాబ్ ఉంటున్న అపార్ట్ మెంట్‍ కిచెన్‍లో లభించిన రక్తం. దీన్ని కూడా పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్‍కు పంపారు.
  8. శ్రద్ధ బ్యాంక్ అకౌంట్ నుంచి అఫ్తాబ్ ట్రాన్స్ ఫర్ చేసుకున్న రూ.54,000.
  9. ఫోన్ల నుంచి సేకరించిన కాల్ రికార్డ్స్, లొకేషన్స్ డేటా.
  10. అఫ్తాబ్ అపార్ట్ మెంట్‍లో గుర్తించిన శ్రద్ధ బ్యాగ్.

Shraddha Delhi Murder Case: ఇంకా దొరకనివి..

  • శ్రద్ధ శరీరాన్ని ముక్కలుగా చేసేందుకు అఫ్తాబ్ వినియోగించిన కత్తి లేదా రంపం.
  • ఇంకా శ్రద్ధ శరీరానికి సంబంధించిన కొన్ని పార్ట్స్ లభించలేదు. కపాలం కూడా దొరకలేదు.
  • శ్రద్ధ మొబైల్ దొరలేదు.
  • హత్య జరిగిన రోజు శ్రద్ధ, అఫ్తాబ్ ధరించిన దుస్తులు కూడా మిస్సింగ్. వీటిని తాను కాల్చేశానని అఫ్తాబ్ పోలీసులకు చెప్పాడని సమాచారం.

తదుపరి వ్యాసం