తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Saturday Motivation: మీలో స్ఫూర్తి నింపడానికి ఇలాంటి మోటివేషనల్ కోట్స్ ఉండాల్సిందే, నిరాశగా అనిపిస్తే వీటిని చదవండి

Saturday Motivation: మీలో స్ఫూర్తి నింపడానికి ఇలాంటి మోటివేషనల్ కోట్స్ ఉండాల్సిందే, నిరాశగా అనిపిస్తే వీటిని చదవండి

Haritha Chappa HT Telugu

09 November 2024, 5:30 IST

google News
    • Saturday Motivation: కష్టాల్లో ఉన్నప్పుడు, కన్నీళ్లలో ఈదుతున్నప్పుడు చిన్న చిరు దీపం కూడా ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. అలాంటి చిరు దీపాలే ఇక్కడ ఇచ్చిన మోటివేషనల్ కోట్స్.
మోటివేషనల్ స్టోరీ
మోటివేషనల్ స్టోరీ (Pixabay)

మోటివేషనల్ స్టోరీ

కష్టాల్లో ఉన్న వ్యక్తికి ఎవరైనా తమ బాధను వింటే చాలు... ఎంతో సాంత్వనగా ఉంటుంది. అలా బాధలు, కన్నీళ్ళతో మునిగిపోయిన వాళ్లకి భవిష్యత్తుపై చిన్న చిరు దీపాన్ని వెలిగిస్తే వారు మరింత ధైర్యంగా బతకగలుగుతారు. ప్రపంచంలో ఎన్నో ప్రేరణాత్మక ప్రసంగాలు, మోటివేషనల్ మెసేజులు ఉన్నాయి. వాటిని సరిగ్గా ప్రతికూల పరిస్థితుల్లో చదవడం ముఖ్యం. మీరు అత్యంత కష్టాల్లో ఉన్నప్పుడు మీలో ధైర్యాన్ని నింపే, ప్రేరణ తెచ్చే ఇలాంటి స్ఫూర్తి కరమైన వాక్యాలను చదివేందుకు ప్రయత్నించండి. ఇది మీలో బతకాలన్న ఆశను, ఆసక్తిని పెంచుతాయి. ఏదైనా సాధించాలన్న కోరికను రెట్టింపు చేస్తాయి.

తెలుగులో మోటివేషనల్ కోట్స్

1. ప్రయత్నించండి

ప్రయత్నించండి

ప్రయత్నించండి

విసుగ్గా అనిపించినా కూడా మళ్లీ ప్రయత్నిస్తూనే ఉండండి

విజయానికి ప్రయత్నమే మొదటి మెట్టు

2. ఏ క్షణంలోనైనా వెనక్కి తగ్గకండి

ఈ అవకాశాన్ని వదులుకోకండి

వైఫల్యం ఎదురైనా కూడా లొంగిపోకండి

3. మీరు మీ జీవితాన్ని

తిరిగి చూసుకున్నప్పుడు చింతించకండి

భవిష్యత్తుపై భరోసా ఉంచండి

మీ నమ్మకం మీరే

4. మీ లోపల మండుతున్న అగ్ని

ఎంతో శక్తివంతమైనది

దాన్ని మీ జీవితానికి వెలుగునిచ్చే

కాంతిగా మార్చుకోండి

మిమ్మల్ని కాల్చేసే కార్చిచ్చుగా మార్చుకోకండి

5. ధైర్యం భయాన్ని ఎదుర్కొంటుంది

వైఫల్యాన్ని దాటుతుంది

ధైర్యం ఉంటే చాలు

ఏ సమస్యా మీ ముందు నిలబడదు

6. మీ కలలకు జీవం పోయండి

విజయం ఖచ్చితంగా మీదే

7. మీరు విఫలమయ్యే ఏకైక మార్గం

మీరు ఓడిపోయినట్టు స్వయంగా ఒప్పుకోవడమే.

విఫలమైన ప్రతిసారీ మీరు విజయానికి

ఒక అడుగు దగ్గరగా వచ్చినట్టు భావించండి

మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉండండి

8. భయాన్ని చూసి భయపడకండి

అది మిమ్మల్ని మరింత భయపెడుతుంది

ఆ భయాన్ని ఎదిరించడానికి ప్రయత్నించండి

అది మీకు జీవితాన్ని నేర్పిస్తుంది

9. జీవితమంటే ఇతరులతో పోటీ పడటం కాదు

మీతో మీరే పోటీ పడడం

నిన్నటితో పోలిస్తే ఈరోజు మీరు మరింత మెరుగ్గా మారడం

ఆ పోటీలో మీరు గెలిచి తీరాల్సిందే

10. జీవితమంటే ఎక్కువ సంపాదించడం కాదు

ఎక్కువ సంతోషంగా ఉండడం

11. జీవితమంటే మిమ్మల్ని

ఇతరులతో పోల్చుకోవడం కాదు

మీరు ఉత్తమంగా ఉండడం పై దృష్టి పెట్టడం

ఆ పని చేస్తే మీరు ఎప్పటికైనా విజయం సాధిస్తారు

12. ఈ జీవితం ఒక అద్భుతం

ప్రపంచం ఒక వరం

ఆ జీవితాన్ని మీరు అందంగా మార్చుకుంటే

మీ అంత అదృష్టవంతులు మరొకరు ఉండరు

13. జీవితమంటే డబ్బు మాత్రమే కాదు

జీవితం గడపడానికే కొంత డబ్బు అవసరం

ఆ డబ్బులు మీతో తీసుకెళ్లలేరు

కాబట్టి దాని గురించి ఒత్తిడి పెంచుకోకండి

ప్రశాంతంగా జీవించేందుకు ప్రయత్నించండి

14. మీరు విజయం సాధించాలంటే

మీ మంచి ఆలోచనలు

సానుకూల ప్రవర్తనలే సహకరిస్తాయి

వీలైనంతగా మీరు మంచిగా ఆలోచించేందుకే ప్రయత్నించండి

15. విజయం చిన్నదైనా, పెద్దదైనా

మీలో ఉత్సాహాన్ని నింపుతుంది

అలాంటి చిన్న విజయానికి కూడా

గొప్ప విలువను ఇవ్వడం నేర్చుకోండి

16. ప్రతి అనుభవం నుండి

ఒక మంచి గుణపాఠం నేర్చుకోండి

అదే మీ జీవితంలో విజయం సాధించడానికి సహకరిస్తుంది

17. విధి వెయ్యి తలుపులు మూసేసినా

ప్రయత్నం కనీసం ఒక్క కిటికీ అయినా తెలుస్తుంది

18. మనం నిన్నటిని సరిదిద్దలేకపోవచ్చు

కానీ రేపటిని మీరు సృష్టించగలరు

19. వైఫల్యం తర్వాత మరోసారి ప్రయత్నించడమే

విజయానికి మరో మార్గం

తదుపరి వ్యాసం