తెలుగు న్యూస్  /  ఫోటో  /  Roadster| బుల్లెట్, మెటోర్, జావా లాంటి మోటార్ సైకిళ్లకు దీటుగా యెజ్డీ రోడ్‌స్టర్

Roadster| బుల్లెట్, మెటోర్, జావా లాంటి మోటార్ సైకిళ్లకు దీటుగా యెజ్డీ రోడ్‌స్టర్

26 January 2022, 16:13 IST

యెజ్డీ బ్రాండ్ నుంచి Yezdi Roadster భారత మార్కెట్లో విడుదలైంది. దీని ధరలు ఎక్స్ షోరూం వద్ద రూ.1.98 లక్షల నుండి ప్రారంభమవుతున్నాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350, మీటోర్ 350 అలాగే జావా లాంటి మోటార్‌సైకిళ్లకు పోటీగా నిలవనుంది.

  • యెజ్డీ బ్రాండ్ నుంచి Yezdi Roadster భారత మార్కెట్లో విడుదలైంది. దీని ధరలు ఎక్స్ షోరూం వద్ద రూ.1.98 లక్షల నుండి ప్రారంభమవుతున్నాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350, మీటోర్ 350 అలాగే జావా లాంటి మోటార్‌సైకిళ్లకు పోటీగా నిలవనుంది.
Yezdi రోడ్‌స్టర్‌లో పూర్తిగా ట్యూబ్‌లెస్‌ టైర్లు ఇచ్చారు. వీటి మందం లేదా వెడల్పును చూసుకుంటే ముందు టైర్ 18 అంగుళాలు ఉండగా, వెనుక టైర్ 17 అంగుళాలుగా ఉంది. సస్పెన్షన్ వ్యవస్థలో భాగంగా ముందు వైపు ప్రీలోడ్ అడ్జస్ట్‌తో టెలిస్కోపిక్ ఫోర్క్స్ ఇవ్వగా, వెనకవైపు గ్యాస్-ఛార్జ్డ్ షాక్ అబ్జార్బర్‌లను అమర్చారు.
(1 / 6)

జావా మోటార్‌సైకిళ్లలో ఉన్నట్లుగానే యెజ్డీ రోడ్‌స్టర్ లో కూడా అదే 334సీసీ ఇంజన్‌ను అమర్చారు. రోడ్‌స్టర్‌లోని సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ 29.7 PS శక్తిని, 29 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.
(2 / 6)

ధరల విషయానికి వస్తే యెజ్డీ రోడ్‌స్టర్ ఎక్స్-షోరూమ్‌లలో రూ. 1.98 లక్షల నుండి మొదలై రూ. 2.06 లక్షల వరకు ఉంటుంది. ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350, మీటోర్ 350 అలాగే జావా, హోండా హెచ్‌నెస్ లాంటి మోటార్‌సైకిళ్లతో పోటీపడుతుంది.
(3 / 6)

వింటేజ్ మోడెల్ బైక్‌లను ఇష్టపడేవారికి Yezdi రోడ్‌స్టర్ సంతృప్తినిస్తుంది. ఈ మోటార్‌సైకిల్ నియో-రెట్రో డిజైన్‌తో క్రూయిజ్ బైక్ మోడెల్‌లో వచ్చింది. రైడింగ్ చేసేటపుడు ఒక హుందాతనమైన అనుభూతి కలుగుతుంది. నగరాల్లో, పట్టణాల్లో రోజువారీ పనుల కోసం ఈ బైక్ సరిపోతుంది.Yezdi రోడ్‌స్టర్ బరువు 184 కిలోలు ఉండగా వీల్‌బేస్ 1,440 మిమీగా ఉంది. ఇది 175 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉంది.
(4 / 6)

రోడ్‌స్టర్‌లో డిజిటల్ LCD ప్యానెల్‌తో ట్రిప్‌మీటర్ డిస్‌ప్లే ఇచ్చారు. ఇది సమయం, ట్యాంకులో ఉన్న ఇంధనంతో వచ్చే ప్రయాణ దూరం,  ABS మోడ్, గేర్ సూచికలు మొదలైన అన్నిరకాల రైడ్-సంబంధిత సమాచారాన్ని చూపుతుంది.
(5 / 6)

ఈ మోటార్ సైకిల్‌లో రౌండ్ LED హెడ్‌లైట్లు, టెయిల్‌లైట్లు ఇచ్చారు. డ్యూయల్ ఎగ్జాస్ట్ సైలెన్సర్ ఉంటుంది. Yezdi రోడ్‌స్టర్ డార్క్ స్మోక్ గ్రే, స్టీల్ బ్లూ, హంటర్ గ్రీన్‌తో పాటు రోడ్‌స్టర్ క్రోమ్ గాలంట్ గ్రే, సిన్ సిల్వర్ అనే ఐదు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది.
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి