తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Yamaha Rx 100 | సరికొత్త అవతారంలో మళ్లీ రాబోతున్న ఐకానిక్ బైక్!

Yamaha RX 100 | సరికొత్త అవతారంలో మళ్లీ రాబోతున్న ఐకానిక్ బైక్!

Manda Vikas HT Telugu

19 July 2022, 14:50 IST

google News
    • యూత్ ఐకానిక్ బైక్ యమహా ఆర్‌ఎక్స్ 100 తిరిగి పునరాగమనం చేయబోతుంది. కొత్త బైక్ ఎలా ఉండబోతుందో ఆ వివరాలు చూడండి. 
Yamaha RX100
Yamaha RX100 (pinterest)

Yamaha RX100

తరాలు ఎన్ని మారినా, ఆధునిక ట్రెండ్‌లు ఎన్ని వచ్చినా కొన్ని పాత వాటికి ఉండే పాపులారిటీ ఎన్నటికీ తగ్గదు. మోటార్ సైకిళ్ల విషయానికి వస్తే యమహా RX100 బైక్‌కు యూత్‌లో ఉన్నటివంటి క్రేజ్ మామూలుది కాదు. 90వ దశకంలో ఈ బైక్ యువతను ఎంతగానో ఆకట్టుకుంది. నేటికీ ఈ బైక్‌కు చాలా మంది అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా ఈ బైక్ నుంచి వచ్చే శబ్దం, దీని స్పోర్టీ లుక్, ఈ బైక్ డిజైన్ అంటే చాలా మందికి ఇష్టం. అయితే ఈ బైక్ 1985 నుండి 1996 వరకు ఉత్పత్తిలో ఉంది. ఆ తర్వాత ఈ బైక్ ఉత్పత్తిని నిలిపివేశారు. కానీ మళ్లీ ఈ బైక్ పునరాగమనం చేయబోతుంది.

యమహా మోటార్ ఇండియా చైర్మన్ ఈషిన్ చిహానా మాట్లాడుతూ యమహా ఐకానిక్ ఆర్‌ఎక్స్100 మోనికర్‌ను ఇప్పటి వరకు ఏ ఉత్పత్తిపై ఉపయోగించలేదని వెల్లడించారు. ఆర్‌ఎక్స్ 100 బ్రాండ్‌ భవిష్యత్తు కోసం కంపెనీ ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. దీనిని బట్టి ప్రసిద్ధ యమహా RX100 బైక్ మళ్లీ రాబోతుందని కొన్ని నివేదికలు స్పష్టం చేశాయి.

అయితే పాత యమహా ఆర్‌ఎక్స్100 మళ్లీ రోడ్డుపైకి రావడం లేదు. ఎందుకంటే ఆ బైక్ 2-స్ట్రోక్ ఇంజిన్‌పై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇది కఠినమైన BS6 ఉద్గార నిబంధనలను అందుకోలేదు. అలాంటప్పుడు దాని ఇంజన్ రీప్లేస్ చేయవచ్చు. డిజైన్‌ను కూడా కొంత అప్‌డేట్ చేసుకోవచ్చు. అయితే ఇది ఇప్పటికిప్పుడే జరిగే వ్యవహారం కాదు. నూతన నిబంధనలకు అనుగుణంగా సరికొత్త అవతారంలో Yamaha RX100 పునరాగమనం RX100 2025-26 నాటికి జరగవచ్చు అని నివేదికలు తెలిపాయి. ఇండియా సహా ఇతర దేశాలలోనూ విడుదల చేసే ప్లాన్ ఉన్నట్లు చెబుతున్నారు.

ప్రస్తుతం యమహా పోర్ట్‌ఫోలియోలో 125 సిసి స్కూటర్లు, 150 సిసి స్ట్రీట్, 250 సిసి స్పోర్ట్ మోటార్‌సైకిళ్లు అందుబాటులో ఉన్నాయి.

టాపిక్

తదుపరి వ్యాసం