తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Xiaomi Mix Fold 2। లాంచ్ చేసిన 5 నిమిషాల్లోనే అమ్ముడైపోయిన షావోమి ఫోల్డబుల్ ఫోన్

Xiaomi MIX Fold 2। లాంచ్ చేసిన 5 నిమిషాల్లోనే అమ్ముడైపోయిన షావోమి ఫోల్డబుల్ ఫోన్

HT Telugu Desk HT Telugu

16 August 2022, 18:19 IST

google News
    • షావోమి కంపెనీ ఇటీవల విడుదల చేసిన Xiaomi MIX Fold 2 ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ సేల్స్ దుమ్ములేపుతున్నాయి. ఈ ఫోన్ ప్రత్యేకతలు ఏంటి? ధరలు ఎంత ఇక్కడ తెలుసుకోండి.
Xiaomi MIX Fold 2
Xiaomi MIX Fold 2

Xiaomi MIX Fold 2

ప్రస్తుతం ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ల హవా నడుస్తోంది. శాంసంగ్‌కు ధీటుగా మోటోరోలా, షావోమి, వివో బ్రాండ్ల నుంచి మడతపెట్టే ఫోన్లు విడుదలవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం Redmi K50 ఎక్స్‌ట్రీమ్ ఎడిషన్ విడుదల చేసిన Xiaomi, తమ బ్రాండ్ మీద ఫ్లాగ్‌షిప్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ Xiaomi MIX Fold 2ను కూడా విడుదల చేసింది. లాంచ్ అయిన కేవలం 5 నిమిషాల్లోనే తమ స్మార్ట్‌ఫోన్‌లు అన్నీ అమ్ముడయిపోయాయని షావోమి కంపెనీ సంచలన ప్రకటన చేసింది. అయితే ఎన్ని యూనిట్లు అమ్ముడయ్యాయో ఆ సంఖ్యను మాత్రం వెల్లడించలేదు.

Xiaomi MIX Fold 2 అనేది గతంలో వచ్చిన Mi MIX Fold స్మార్ట్‌ఫోన్‌కు సక్సెసర్. సరికొత్త మిక్స్ ఫోల్డ్ 2ను ప్రీమియం ఫీచర్లతో షావోమి విడుదల చేసింది. ఇందులో ఫోల్డబుల్ స్క్రీన్, Leica-సర్టిఫైడ్ కెమెరాలు ప్రధాన హైలైట్లుగా చెప్పవచ్చు. Xiaomi MIX Fold 2 స్మార్ట్‌ఫోన్‌ను మడతపెట్టినపుడు 6.56-అంగుళాల E5 AMOLED డిస్‌ప్లే ఉంటుంది. మడత తెరిచినపుడు 8.02-అంగుళాల LTPO 2.0 ఇంటీరియర్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీని స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ రక్షణను కలిగి ఉంది.

ఈ ఫోన్ స్టోరేజ్ ఆధారంగా వివిధ కాన్ఫిగరేషన్లలో వచ్చింది. దీనిలో టాప్-ఎండ్ మోడల్ గరిష్టంగా 1TB ఇంటర్నల్ స్టోరేజ్‌తో రావటం విశేషం.

Xiaomi MIX Fold 2లో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి? ధరలు ఏ విధంగా ఉన్నాయో ఈ కింద మరోసారి పరిశీలించండి.

Xiaomi MIX Fold 2 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 120Hz రిఫ్రెష్ రేట్‌ కలిగిన 6.56-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లే.. మడత తెరిస్తే డిస్‌ప్లే సైజ్8.02- అంగుళాలకు పెరుగుతుంది.
  • కాన్ఫిగరేషన్స్: 12GB ర్యామ్, 256GB/ 512GB/1TB ఇంటర్నల్ స్టోరేజ్
  • స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్
  • వెనకవైపు 50MP సోనీ IMX766 ప్రైమరీ సెన్సార్ + 13MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్+ 8M టెలిఫోటో లెన్స్; ముందువైపు 20MP సెల్ఫీ స్నాపర్
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
  • 4500 mAh బ్యాటరీ సామర్థ్యం, 67W ఫాస్ట్ ఛార్జర్

కనెక్టివిటీపరంగా.. 5G , USB టైప్-సి పోర్ట్, బ్లూటూత్ v5.2, NFC , డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, డ్యూయల్ సిమ్ (నానో) మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

ధరలు ఇలా ఉన్నాయి:

12GB RAM+ 256GB స్టోరేజ్ కలిగిన బేస్ మోడల్ ధర 8,999 యువాన్లు (సుమారు రూ. 1,06,200)

12GB RAM+ 512GB స్టోరేజ్ మోడల్ ధర 9,999 యువాన్లు (సుమారు రూ. 1,18,000)

12GB RAM + 1TB స్టోరేజ్ టాప్-ఎండ్ మోడల్ ధర 11,999 యువాన్లు (సుమారు రూ. 1,41,700)

టాపిక్

తదుపరి వ్యాసం