తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Hepatitis Day। కాలేయాన్ని దెబ్బతీసే ప్రాణాంతక వ్యాధి హెపటైటిస్, నివారణ ఇలా!

Hepatitis Day। కాలేయాన్ని దెబ్బతీసే ప్రాణాంతక వ్యాధి హెపటైటిస్, నివారణ ఇలా!

HT Telugu Desk HT Telugu

28 July 2023, 9:44 IST

    • World Hepatitis Day 2023: ఈరోజు ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం. ఈ వ్యాధి ప్రధానంగా మన కాలేయ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఇప్పటివరకు చికిత్స లేదు. అయితే రాకుండా నివారించవచ్చు.
Hepatitis symptoms, treatment and prevention
Hepatitis symptoms, treatment and prevention (istock)

Hepatitis symptoms, treatment and prevention

World Hepatitis Day: ఈరోజు ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం. హెపటైటిస్ గురించి అవగాహన పెంచడానికి ప్రతి ఏడాది జూలై 28న ప్రపంచ హెపటైటిస్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1967లో హెపటైటిస్ బి వైరస్‌ను కనుగొన్న డాక్టర్ బరూచ్ బ్లమ్‌బెర్గ్ గౌరవార్థం, ఆయన జన్మదినం అయిన జూలై 28న ప్రపంచ హెపటైటిస్ దినోత్సవంగా పాటిస్తున్నారు. రెండేళ్ల తర్వాత 1969లో డాక్టర్ బరూచ్ హెపటైటిస్ B కోసం వ్యాక్సిన్‌ను కూడా అభివృద్ధి చేశారు. అయినప్పటికీ అవగాహనా రాహిత్యంతో నేటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది హెపటైటిస్ B, హెపటైటిస్ C లతో బాధపడుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

హెపటైటిస్‌లో వివిధ రకాలు ఉన్నాయి. ఈ హెపటైటిస్ వ్యాధి ప్రధానంగా మన కాలేయ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. దీని వలన కాలేయం పనితీరు దెబ్బతింటుంది. కాలేయ వ్యాధులు ప్రాణాంతకం కాబట్టి, ఈ వ్యాధిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. హెపటైటిస్ కారణంగా కాలేయంలో మంట, వాపు ఉంటుంది. హెపటైటిస్‌కు గల కారణాలను అర్థం చేసుకోవడం వల్ల దీని బారిన పడే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. వాస్తవానికి ఈ వ్యాధికి ఇప్పటివరకు చికిత్స లేదు. అయితే రాకుండా నివారించవచ్చు. హెపటైటిస్ A, హెపటైటిస్ B రకాలను వ్యాక్సిన్ ద్వారా మాత్రమే నివారించవచ్చు, అయితే హెపటైటిస్ Cని ఆధునిక చికిత్స విధానాల ద్వారా 95 శాతం నయం చేయవచ్చు. తీవ్రమైన హెపటైటిస్ లక్షణాలు ఎలా ఉంటాయో ఈ కింద తెలుసుకోండి.

తీవ్రమైన హెపటైటిస్ లక్షణాలు

జ్వరం

అలసట

ఆకలి లేకపోవడం

వికారం, వాంతులు, కడుపు నొప్పి

ముదురు రంగులో మూత్రం, లేత రంగులో మలం

కీళ్ల నొప్పి

కామెర్లు ఉంటాయి.

మరోవైపు దీర్ఘకాలిక వైరల్ హెపటైటిస్ క్క లక్షణాలు అభివృద్ధి చెందడానికి దశాబ్దాలు పట్టవచ్చు.

హెపటైటిస్‌ను అరికట్టడానికి, అలాగే మీ కాలేయాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి.

పరీక్షలు చేయించుకోండి

బలహీనమైన రోగనిరోధక శక్తిని కలిగి ఉండి, తరచుగా అనారోగ్యం బారినపడుతుంటే ఆలస్యం చేయకూడదు. వీలైనంత త్వరగా హెపటైటిస్ పరీక్ష చేయించుకోవాలి.

టీకాలు వేయించుకోవాలి

వివిధ రకాల హెపటైటిస్‌లకు వివిధ రకాల టీకాలు అందుబాటులో ఉన్నాయి. సరైన సమయంలో టీకాలు వేయించుకోవడం ద్వారా హెపటైటిస్ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. 18 ఏళ్ల లోపు వారు, ఇప్పటివరకు టీకాలు వేసుకోని పెద్దలు కూడా తప్పనిసరిగా హెపటైటిస్ A, B కి వ్యతిరేకంగా టీకాలు వేసుకోవాలి.

ఆరోగ్యకరమైన ఆహారం తినండి

మీ కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, మీరు పోషకాలు సమృద్ధిగా ఉన్న, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. రక్తాన్ని శుద్ధి చేసే ఆహారాన్ని తినాలి. వాల్‌నట్‌లు, బీట్‌రూట్‌లు, పసుపు, వెల్లుల్లి వంటివి ఆహారంలో చేర్చుకోవాలి. బాగా వండిన ఆహారాన్ని తినాలి. పచ్చిగా తినడం వల్ల హెపటైటిస్ వచ్చే అవకాశం ఉంది. కాచి చల్లార్చిన శుద్ధమైన నీరు త్రాగాలి.

సురక్షితమైన శృంగార జీవనం

హెపటైటిస్‌ వైరస్ అనేది యోని స్రావాలు, లాలాజలం, వీర్యంలో కూడా జీవించగలదు. కాబట్టి సురక్షితమైన సెక్స్‌ లైఫ్ కలిగి ఉండటం ద్వారా వైరల్ హెపటైటిస్‌ సంక్రమణను అరికట్టవచ్చు

పరిశుభ్రతను పాటించండి

హెపటైటిస్‌ వ్యాధి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి వ్యక్తిగత పరిశుభ్రతను పాఠించడం చాలా ముఖ్యం. టూత్ బ్రష్, రేజర్లు, సూదులను ఇతరులతో పంచుకోవద్దు. టాయిలెట్‌కి వెళ్లిన ప్రతిసారీ, భోజనానికి ముందు, ఆ తర్వాత కూడా మీ చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. మీ పరిసరాలు శుభ్రంగా ఉంటే హెపటైటిస్ ప్రమాదాన్ని నివారించవచ్చు.

తదుపరి వ్యాసం