Vaginal Infections in Monsoon । వర్షాకాలంలో స్త్రీలలో యోని ఇన్‌ఫెక్షన్‌లను నివారించడానికి చిట్కాలు!
Vaginal Infections in Monsoon: వర్షాకాలంలో స్త్రీలు UTI, యోని ఇన్‌ఫెక్షన్‌ల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఆరోగ్య నిపుణులు అందించిన కొన్ని సూచనలను ఇక్కడ తెలుసుకోండి.
Vaginal Infections in Monsoon: వర్షాకాలంలో మహిళల్లో రోగనిరోధక శక్తి తగ్గుతుంది, యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్‌తో సహా అనేక రకాల యోని ఇన్‌ఫెక్షన్‌లు సోకడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సరైన పరిశుభ్రత పాటించకపోవడం, బిగుతైన లోదుస్తులు ధరించడం, తరచుగా టాంపాన్‌లు లేదా ప్యాడ్‌లను ఉపయోగిస్తుంటే స్త్రీలలో యోని ఇన్ఫెక్షన్‌ల ప్రమాదం పెరుగుతుంది. ఈ వర్షాకాలంలో UTIల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఆరోగ్య నిపుణులు అందించిన కొన్ని సూచనలను ఇక్కడ తెలుసుకోండి.
ట్రెండింగ్ వార్తలు
పరిశుభ్రత పాటించండి
యోని ప్రాంతంలో హానికరమైన బ్యాక్టీరియా, ఈస్ట్ ఇన్ఫెక్షన్ల పెరుగుదలను నివారించడానికి ఆ ప్రాంతంలో సరైన పరిశుభ్రతను పాటించడం వర్షాకాలంలో తప్పనిసరి. ఇందుకోసం కఠినమైన సబ్బులు వాడకుండా, pH-సమతుల్యత కలిగిన తేలికపాటి ఉత్పత్తులను ఉపయోగించాలి. కఠినమైన సబ్బులు, సువాసనగల సబ్బులు, బబుల్ బాత్‌లు, కఠినమైన డిటర్జెంట్ ఉత్పత్తులతో యోనిలోని సున్నితమైన pH బ్యాలెన్స్‌కు అంతరాయం కలుగుతుంది. ఇది చికాకును మరింత పెంచుతుంది. యోని ప్రాంతంలో pHని కాపాడటానికి సువాసన లేని, హైపోఅలెర్జెనిక్ ఉత్పత్తులను ఎంచుకోవాలి. ఇందుకోసం మీరు గైనకాలజిస్టులను సంప్రదించండి.
పొడిగా ఉంచుకోండి
వర్షాకాలంలో అధిక తేమ ప్రభావం ఈస్ట్ ఇన్ఫెక్షన్లతో సహా బ్యాక్టీరియా, ఫంగల్ పెరుగుదలకు దారితీస్తుంది. ఆ భాగంలో తడిగా ఉంటే ప్రమాదం మరింత ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు మిమ్మల్ని మీరు పొడిగా ఉంచుకోడానికి ప్రయత్నించండి. గాలి ఆడేలా కాటన్ లోదుస్తులు ధరించడం, బిగుతుగా ఉండే దుస్తులను నివారించడం చేయాలి. తడిగా మారిన దుస్తులను ఎప్పటికప్పుడు మార్చుకోవాలి.
సురక్షితమైన శృంగారం
సురక్షితమైన లైంగిక అభ్యాసాలు కూడా UTI, ఈస్ట్ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. లైంగికంగా సంక్రమించే అంటువ్యాధుల (STIలు) నుండి కూడా రక్షిస్తుంది. కాబట్టి కండోమ్‌ల వాడకంతో సహా సంభోగం తర్వాత మీ జననేంద్రియాలను కడగడం చాలా ముఖ్యం.
జీర్ణ ఆరోగ్యం జాగ్రత్త
జీర్ణ ఆరోగ్యానికి, యోని ఆరోగ్యానికి మధ్య సంబంధాన్ని విస్మరించవద్దు, ఆరోగ్యకరమైన యోని వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి. ఆసిడిటీ, విరేచనాలు, కడుపు ఇన్ఫెక్షన్లకు గురికాకుండా మంచి పోషకాహారం తీసుకుంటూ, సరైన జీవనశైలిని అనుసరించడం ద్వారా జీర్ణ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. తద్వారా మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది, ఎలాంటి ఇన్ఫెక్షన్లనైనా నివారించవచ్చు.
యోని ఆరోగ్యానికి ప్రోబయోటిక్స్
యోని ఆరోగ్యానికి ప్రోబయోటిక్స్ చాలా మేలు చేస్తాయి. మీ ఆహారంలో పెరుగు, పులియబెట్టిన ఉత్పత్తులు వంటి ప్రోబయోటిక్ అధికంగా ఉండేలా చూసుకోండి. ఇవి మంచి బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తాయి, వెజైనల్ ఫ్లోరాను కాపాడతాయి, కాండిడా పెరుగుదల వల్ల వచ్చే ఈస్ట్ ఇన్ఫెక్షన్లతో సహా ఇతర ఇన్‌ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
హైడ్రేషన్ కీలకం
వర్షాకాలంలో దాహం తక్కువ వేస్తుంది, అయినప్పటికీ తగినన్ని నీరు, ఆరోగ్యకరమైన పానీయాలు తాగుతూ మిమ్మల్ని మీరు హైడ్రేటింగ్ గా ఉంచుకోవాలి. మీ శరీరంలో తగినంత మొత్తంలో నీరు ఉంటే, అది మీ శరీరం నుండి హానికర టాక్సిన్లను బయటకు పంపడంలో సహాయపడుతుంది, UTIలు, ఈస్ట్ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వర్షాకాలంలో నీటి తీసుకోవడం పెంచాలి.
సహజ నివారణలు
క్రాన్బెర్రీ జ్యూస్ లేదా సప్లిమెంట్స్ UTIలకు కొన్ని సహజ నివారణలు ఉన్నాయి, ఇవి బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించడం ద్వారా UTIలను నిరోధించడంలో సహాయపడవచ్చు. అయినప్పటికీ, పునరావృతమయ్యే UTIల విషయంలో వైద్యుల సలహాను తీసుకోవాలి. యోని భాగంలో నొప్పి, అసౌకర్యం, దురద లేదా అసాధారణమైన ఉత్సర్గ వంటి నిరంతర లక్షణాలను అనుభవిస్తే తక్షణ వైద్య సహాయం తీసుకోవాలి, ఎందుకంటే ఇవి కాండిడా పెరుగుదల వంటి అంతర్లీన పరిస్థితులను సూచిస్తాయి.
సంబంధిత కథనం