Breastfeeding। శిశువు ఎదుగుదలకు తల్లిపాలే శ్రేయస్కరం.. బిడ్డ ఆకలితో ఉన్నట్లు ఇలా తెలుసుకోవచ్చు!
01 August 2023, 15:18 IST
- World Breastfeeding Week 2023: ప్రతి సంవత్సరం ఆగస్ట్ 1 నుండి ఆగస్టు 7 వరకు 'ప్రపంచ తల్లిపాల వారం' గా నిర్వహిస్తారు. శిశువుకు తల్లి తన చనుబాలు పంచడానికి ఉన్న ఆవశ్యకతను తెలియజెప్పేందుకు ఈ వారోత్సవాన్ని నిర్వహిస్తారు.
World Breastfeeding Week 2023
World Breastfeeding Week 2023: ప్రతి సంవత్సరం ఆగస్ట్ 1 నుండి ఆగస్టు 7 వరకు 'ప్రపంచ తల్లిపాల వారం' గా నిర్వహిస్తారు. శిశువుకు తల్లి తల్లి తన చనుబాలు పంచడానికి ఉన్న ఆవశ్యకతను తెలియజెప్పేందుకు ఈ వారోత్సవాన్ని నిర్వహిస్తారు.
తల్లి మీ రొమ్ముపాలను నేరుగా బిడ్డకు అందివ్వడాన్ని బ్రెస్ట్ ఫీడింగ్ లేదా నర్సింగ్ అని అంటారు. తల్లి తన చనుబాలు ఇవ్వడం అనేది ఆమె వ్యక్తిగత నిర్ణయం తీసుకోవడం వ్యక్తిగత విషయం. అయినప్పటికీ చాలా మంది వైద్య నిపుణులు, శిశువు జన్మించిన నాటి నుంచి 6 నెలల పాటు ప్రత్యేకంగా తల్లిపాలు ఇవ్వమని గట్టిగా సిఫార్సు చేస్తున్నారు. తల్లికి పాలు రానప్పుడు వైద్యులు ఫార్ములా పాలను సూచిస్తారు కానీ, తల్లులు సరైన పోషకాహారం తీసుకుంటూ తమ చనుబాల ఉత్పత్తిని పెంచుకోవాలని చెప్తారు. శిశువుకు మొదటి ఆరు నెలల పాటు జ్యూస్ లేదా నీరు ఇవ్వకూడదు, ఆరు నెలల తర్వాత ఇతర ఆహార పదార్ధాలను శిశువుకు అందిస్తూనే ఏడాది వరకు తల్లిపాలను కొనసాగించాలని ఇది సిఫార్సు చేస్తున్నారు.
శిశువుకు ఏ సమయంలో పాలు ఇవ్వాలి
మీ బిడ్డకు ఎంత తరచుగా తల్లిపాలు ఇవ్వాలి అనేది బిడ్డ ఆకలిపై ఆధారపడి ఉంటుంది. శిశువు కొద్దికొద్దిగా పాలు తీసుకుంటుందా, లేదా ఎక్కువ సేపు తీసుకోడానికి ఇష్టపడుతుందా అని చూస్తూ పాలు పట్టాలి. బిడ్డ పెరుగుతున్న కొద్దీ ఈ అవసరం మారుతుంది. సాధారణంగా నవజాత శిశువులు తరచుగా ప్రతి 2-3 గంటలకు పాలు తాగాలని కోరుకుంటారు. 2 నెలల నాటికి, ప్రతి 3-4 గంటలకు ఆకలిగా ఉండటం సాధారణం, ఆరు నెలల నాటికి చాలా మంది పిల్లలు ప్రతి 4-5 గంటలకు ఆహారం తీసుకుంటారు. వారు ఆకలిగా ఉన్నట్లు నోటితో చెప్పలేరు, అయినప్పటికీ కొన్ని సంజ్ఞలు చేస్తారు, ఆ సంకేతాల ఆధారంగా బిడ్డ ఆకలితో ఉన్నట్లు గుర్తించి పాలు పట్టాలి.
మీ బిడ్డ ఆకలితో ఉన్నట్లు సంకేతాలు
శిశువులకు ఆకలి వేసినపుడు కొన్ని సంకేతాలు ఇస్తారు, మీ బిడ్డ ఆకలితో ఉన్నట్లు మీకు తెలియజేసే అత్యంత సాధారణ మార్గాలలో ఒకటి ఏడవడం. బిడ్డ ఆగి ఆగి ఏడుస్తుందంటే ఆకలితో ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. మరికొన్ని సంకేతాలు ఎలా ఉంటాయో ఇక్కడ చూద్దాం.
- శిశువు పెదాలను చప్పరించడం లేదా నాలుకను బయటకు తీయడం చేస్తే ఆకలివేస్తుందని అర్థం
- తలను అటు ఇటూ తిప్పడం రొమ్ము కోసం వెతకడానికి దవడ, నోరు లేదా తలను కదిలిస్తుంది
- నోటిలో చేయి పెట్టుకొని చప్పరించడం
- తరచుగా నోరు తెరవడం
- గజిబిజిగా ఉన్నట్లు చేయడం
- వస్తువులను చప్పరించడం
తల్లి తన బిడ్డకు చనుబాలు ఇవ్వడం ద్వారా అటు తల్లికి, ఇటు బిడ్డకు చాలా ప్రయోజనాలు ఉంటాయని వైద్యులు అంటున్నారు. ఫార్ములా పాలకు అలవాటుపడిన శిశువులు తల్లిపాలు తాగినా పూర్తి సంతృప్తిని పొందలేరు, ఎందుకంటే ఫార్ములా పాలు రుచికరంగా ఉంటాయి, అయినప్పటికీ తల్లిపాలు తాగితేనే శిశువుకు సరైన పోషణ లభిస్తుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది, శిశువు ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి చనుబాలు ఇవ్వడమే తల్లులు తమ మొదటి ప్రాధాన్యతగా భావించాలని చెబుతున్నారు.