Women's Day Wishes : ఈ అద్భుతమైన కోట్స్‌తో ఉమెన్స్ డే విషెస్ చెప్పండి
06 March 2023, 10:06 IST
- International Women's Day 2023 : మార్చి 8న మహిళా దినోత్సవం. ప్రపంచవ్యాప్తంగా ఈరోజును జరుపుతారు. అయితే మీ ప్రియమైన మహిళకు.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పండి.
మహిళా దినోత్సం
ప్రతి సంవత్సరం, మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకొంటారు. ఇది మహిళలకు మాత్రమే ఉద్దేశించిన రోజు. మహిళా దినోత్సవం మహిళల విజయాలను జరుపుకోవడానికి, మహిళల సమానత్వం, లింగ అసమానత గురించి అవగాహన పెంచడానికి అంకితం చేయబడింది. తల్లిగా, భార్యగా, సోదరిగా, స్నేహితురాలిగా మన జీవితాలను ఏదో ఒక విధంగా ప్రభావితం చేసిన మహిళలను గౌరవించే రోజు కూడా ఇది. అయితే వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలపండి.
ఆమె గాలి, ఆమె నీరు. ఆమె మంచు, ఆమె అగ్ని. ఆమె శక్తివంతమైనది, ఆమె ప్రతిష్టాత్మకమైనది. ఆమె ఒక ప్రత్యేకం.. మహిళ దినోత్సవ శుభాకాంక్షలు!
ప్రతి ఇల్లు, ప్రతి హృదయం, ప్రతి అనుభూతి, ఆనందం యొక్క ప్రతి క్షణం మీరు లేకుండా అసంపూర్ణం. మీరు మాత్రమే ఈ ప్రపంచాన్ని పూర్తి చేయగలరు. మహిళ దినోత్సవ శుభాకాంక్షలు!
చాలా మంది జీవితాల్లో మార్పు తెచ్చేది మీరే. అందులో నేనూ ఒకడిని, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు!
ప్రతి పురుషుడికి తన జీవితం గందరగోళంగా ఉన్నప్పుడు ఒక మహిళ అవసరం. జీవితంలో రాజును రక్షించాలంటే.. రాణి అవసరం. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు!
అమ్మను పూజించు..
భార్యను ప్రేమించు..
సోదరిని దీవించు..
మహిళను గౌరవించు..
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
స్త్రీ లేకపోతే జననం లేదు..
స్త్రీ లేకపోతే గమనం లేదు..
స్త్రీ లేకపోతే ఈ సృష్టిలో జీవం లేదు..
స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదు..
మహిళలను గౌరవిద్దాం.. కాపాడుకుందాం.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
జననం నీవే.. గమనం నీవే..
సృష్టివి నీవే.. కర్తవు నీవే..
కర్మవు నీవే.. ఈ జగమంతా నీవే..
భగవంతుడు అన్ని చోట్లా ఉండలేడు కదా..
అందుకే ప్రతీ ఇంట్లో నువ్ ఉన్నావ్..
ఓ మహిళా నీకిదే మా వందనం..
మహిళా దినోత్సవ శుక్షాకాంక్షలు
కనులు తెరిచిన క్షణం నుంచి.. బంధం కోసం బాధ్యత కోసం.., కుటుంబం కోసం, అందర్నీ కనుపాపలా తలచి, ఆత్మీయత పంచి, తనవారి కోసం అహర్నిశలు కష్టించి, వారిని సహించి, వారి భవిష్యత్ గురించి, తన ఇంటిని నందనవనం చేసే స్త్రీ మూర్తికి.. పాదాభివందనం..
ఆమె సృష్టికే ఓ కానుక.. ఆమె అనేది ఓ మధుర భావన..
ఆమె శక్తి అపారం.. ఆమె యుక్తి అమూల్యం..
ప్రేరణ ఆమె.. లాలనా ఆమె..
తల్లిగా.. చెల్లిగా.. తోడుగా.. నీడగా.. ఆమె పాత్ర అనితర సాధ్యం..
ఆమె లేకుంటే అంతా శూన్యం..
అందుకే ఆమెకు శతకోటి వందనాలు..
Happy Women's Day