తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Toothbrush In Bathroom : మీ టూత్ బ్రష్‌ బాత్రూమ్‍లో పెడుతున్నారా? ఇతరుల వాటితో కలిపేస్తున్నారా?

Toothbrush In Bathroom : మీ టూత్ బ్రష్‌ బాత్రూమ్‍లో పెడుతున్నారా? ఇతరుల వాటితో కలిపేస్తున్నారా?

Anand Sai HT Telugu

24 September 2023, 8:45 IST

google News
    • Toothbrush In Bathroom : ఉదయం లేవగానే అందరం చేసే మొదటి పని బ్రష్ చేయడం. అయితే పని అయ్యాక మీ టూత్ బ్రష్‌ను ఎక్కడ ఉంచుతారు? బాత్రూమ్‍లో పెడుతున్నారా? మీ కుటుంబ సభ్యుల లేదా రూమ్‌మేట్స్ కు చెందిన ఇతర టూత్ బ్రష్‌లతో మిక్స్ చేశారా? ఈ అలవాటు మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.
టూత్ బ్రష్
టూత్ బ్రష్ (unplash)

టూత్ బ్రష్

మనం దంత ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించం. రోజుకు ఎన్ని సార్లు పళ్ళు తోముకోవాలి? దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎలా? మీరు ఉపయోగించే టూత్ బ్రష్ సరిగా ఉందా? ఇలాంటివి చాలా విషయాలు చూసుకోవాలి. మీ దంత పరిశుభ్రత మీ మొత్తం ఆరోగ్యానికి సంబంధించినదని అర్థం చేసుకోవాలి.

బాత్రూమ్ సాధారణంగా సూక్ష్మక్రిములతో నిండి ఉంటుందని మనకు తెలుసు. టూత్‌బ్రష్‌ని అక్కడే ఉంచితే క్రిములు, మల కణాలు బ్రష్ మీదకు వెళ్లొచ్చని వైద్యులు చెబుతున్నారు. మీ బాత్రూమ్ వాతావరణంలో మల కణాలు ఉండే అవకాశం ఉంది. టాయిలెట్ మూతను మూసివేయకుండా ఫ్లష్‌ చేస్తే.. మల కణాలు మీ బాత్రూమ్ అంతటా వ్యాపించే అవకాశం ఉంది. మల బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవుల చిన్న బిందువులు గాలిలోకి విడుదల కావచ్చు. ఇది మీ టూత్ బ్రష్ వంటి వాటిపై స్థిరపడగలదు. అందువల్ల, మీ టూత్ బ్రష్‌ను బాత్రూమ్ వాతావరణంలో ఉంచడం సరి కాదని అర్థం చేసుకోవాలి.

మీ టూత్ బ్రష్ హోల్డర్ టాయిలెట్ సీటుకు ఎంత దూరంలో ఉందో కూడా చూసుకోవాలి. ఇది మీ టాయిలెట్ సీటుకు సమీపంలో ఉన్నట్లయితే, గాలిలో ఉండే కణాలు దానిపై పడే ఛాన్స్ ఉంది. అలాగే, బాత్రూమ్ పరిసరాలు తేమగా ఉంటాయి. ఇది మీ టూత్ బ్రష్‌పై బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తుంది.

టూత్‌బ్రష్‌ని ఉపయోగించే ముందు దానిని ట్యాప్ వాటర్ కింద బాగా కడగడం మంచి పద్ధతి. ఇది మీ టూత్ బ్రష్ ఉపరితలం నుండి మలినాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఉపయోగించిన తర్వాత టూత్ బ్రష్‌ను టూత్ బ్రష్ హోల్డర్ లేదా కప్పులో నిటారుగా ఉంచండి. దానిని గాలిలో ఆరనివ్వండి.

కొందమంతి ఒక మగ్గులాంటి దాంట్లో టూత్ బ్రష్ పెట్టేస్తారు. కుటుంబం అంతా అందులోనే పెడతారు. ఇది కూడా మంచి పద్ధతి కాదు. ప్రత్యేక సాకెట్‌లతో కూడిన టూత్ బ్రష్ హోల్డర్ మార్కెట్లో దొరుకుతాయి. ఒకదానితో ఒకటి అంటుకోకుండా ఉంటాయి. ఒకరి బ్రష్.. మరొక బ్రష్‍కు తగిలితే బ్యాక్టిరియా వచ్చే ప్రమాదం ఉంటుంది. గాలికి పెట్టిన తర్వాత.. ఆరిపోయాక అవసరమైతే మీ టూత్ బ్రష్‌ను కవర్‌లో ఉంచవచ్చు.

మీ టూత్ బ్రష్‌ను ప్రతి మూడు నుండి నాలుగు వారలకు మార్చాలని నిర్ధారించుకోండి. పాత లేదా దెబ్బతిన్న టూత్ బ్రష్ ఉపయోగించడం పరిశుభ్రమైనది కాదు. రెగ్యులర్ రీప్లేస్‌మెంట్‌తో పాటు దుమ్ము, బ్యాక్టీరియా ఏర్పడకుండా ఉండటానికి టూత్ బ్రష్‌ను పూర్తిగా కడగాలి. తరచుగా మార్చాలి.

బాత్రూమ్‍లో గాలిలో మల కణాల వ్యాప్తిని తగ్గించడంలో సహాయపడే ఒక ఆరోగ్యకరమైన అలవాటు ఫ్లష్ చేయడానికి ముందు టాయిలెట్ మూతను మూసివేయడం. 2012 చేసిన ఓ అధ్యయనంలో టాయిలెట్ మూతను పైకి అలానే ఉంచి.. ఫ్లష్ చేసినప్పుడు సీటు పైన 25 సెంటీమీటర్ల వరకు బ్యాక్టీరియా కనుగొనబడింది. ఇప్పటి నుండి టాయిలెట్ సీట్ మూతను మూసి ఫ్లష్ చేయడం మర్చిపోవద్దు. అసలు బాత్రూమ్‍లో కాకుండా బయట బ్రష్ పెట్టుకుంటే ఇంకా మంచిది.

తదుపరి వ్యాసం