తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Roti Or Rice : కొవ్వు తగ్గేందుకు రాత్రి భోజనంలో ఏది బెస్ట్? అన్నమా? చపాతీనా?

Roti Or Rice : కొవ్వు తగ్గేందుకు రాత్రి భోజనంలో ఏది బెస్ట్? అన్నమా? చపాతీనా?

HT Telugu Desk HT Telugu

08 April 2023, 18:20 IST

    • Roti Or Rice For Weight Loss : బరువు తగ్గించే ప్రణాళికలు సక్సెస్ కావాలంటే కార్బోహైడ్రేట్ల తీసుకోవడం తగ్గించాలి. ప్రోటీన్ వినియోగాన్ని పెంచాలని తరచుగా సిఫార్సు చేస్తారు. ఇండియాలో భోజనంలో అన్నం, చపాతీ రూపంలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. మరి బరువు తగ్గేందుకు ఏది తింటే బెస్ట్?
రైస్ వర్సెస్ చపాతీ
రైస్ వర్సెస్ చపాతీ

రైస్ వర్సెస్ చపాతీ

బరువు తగ్గేందుకు చాలా మంది ట్రై చేస్తుంటారు. ఈ సమయంలో రాత్రి భోజనం గురించి కాస్త ఆలోచనలో పడతారు. అన్నం తినాలా? లేదంటే చపాతీ తినాలా? అని అర్థంకాదు. కొంతమంది ఎవరికి నచ్చినట్టు వాళ్లు చెప్పేస్తారు. అన్నం తినడం మంచిదా, చపాతీ తినడం మంచిదా తెలుసుకుందాం.

చాలామంది 'బాడీ ఫ్యాట్ లాస్ ప్లాన్'లో ఉంటారు. అలాంటప్పుడు అన్నం తినాలా? లేక చపాతీ బెస్టా? వారంతా అయోమయంలో ఉంటారు. ఎల్లప్పుడూ రాత్రి భోజనం(Dinner) తేలికపాటిదే చేయాలి. మీ లక్ష్యం బరువు తగ్గడం(Weight Loss) అయితే, అన్నం లేదా చపాతీ రెండు కూడా రాత్రి భోజనానికి మంచి ఎంపికలు.

బియ్యంలో చాలా తక్కువ సోడియం ఉంటుంది. అయితే 120 గ్రాముల గోధుమలలో 190 mg సోడియం ఉంటుంది. వైట్ రైస్‌లో కేలరీలు ఎక్కువ, పోషకాలు తక్కువగా ఉంటాయి. 60 గ్రాముల బియ్యంలో 80 కేలరీలు, 1 గ్రాము ప్రోటీన్, 0.1 గ్రాముల కొవ్వు, 18 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి.

చపాతీ(Chapati)ని గోధుమలతో తయారు చేస్తారు. కాబట్టి బియ్యంతో పోలిస్తే ఇందులో ఎక్కువ పోషకాలు ఉంటాయి. చిన్న రొట్టెలో 71 కేలరీలు, 3 గ్రాముల ప్రోటీన్, 0.4 గ్రాముల కొవ్వు, 15 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. గోధుమలతో పోలిస్తే బియ్యంలో భాస్వరం, మెగ్నీషియం తక్కువగా ఉంటుంది. ఇంకా బియ్యం, గోధుమలు రెండింటిలోనూ ఒకే విధమైన ఫోలేట్, ఐరన్ ఉంటాయి.

అన్నం, చపాతీ రెండూ ఆరోగ్య ప్రయోజనాలను(health benefits) కలిగి ఉన్నాయి. ఒకవైపు బియ్యం, జొన్నల్లో అమినో యాసిడ్స్ ఉంటాయి. ప్రోటీన్ యొక్క పూర్తి మూలం కూడా. మరోవైపు మీరు పప్పు, బార్లీ, ఓక్రా లేదా రాగులతో చేసిన చపాతీని తింటే, మీ ఆరోగ్యానికి కాల్షియం, ఫాస్పరస్, జింక్ వంటి పోషకాలు లభిస్తాయి. రెండూ మంచి ఎంపికలు, ప్రత్యామ్నాయ రోజులలో తీసుకోవచ్చు.

అయితే రాత్రి 8 గంటల లోపు భోజనం చేసేందుకు ప్రయత్నించండి. అలాగే రాత్రిపూట కార్బోహైడ్రేట్లు(carbohydrates) అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల కడుపు ఉబ్బరం ఏర్పడుతుంది. అన్నంతో పోలిస్తే చపాతీ త్వరగా కడుపు నింపుతుంది. అన్నం రెండు రొట్టెలు ఇచ్చినంత సంతృప్తిని ఇవ్వదు. గోధుమలతో పోలిస్తే బియ్యంలో డైటరీ ఫైబర్, ప్రొటీన్(Protien), కొవ్వు తక్కువగా ఉండడమే దీనికి కారణం. ఒక పెద్ద గిన్నె అన్నం దాదాపు 440 కేలరీలను కలిగి ఉంటుంది. స్థిరమైన బరువు తగ్గేందుకు మీరు కాస్త అన్నం లేదా 2 రోటీలు తినాలి.

తదుపరి వ్యాసం