తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tt Injection: Tt ఇంజెక్షన్ ఎప్పుడు తీసుకోవాలి? తరచూ తీసుకుంటే ప్రమాదమా?

TT Injection: TT ఇంజెక్షన్ ఎప్పుడు తీసుకోవాలి? తరచూ తీసుకుంటే ప్రమాదమా?

Haritha Chappa HT Telugu

21 December 2023, 17:00 IST

google News
    • TT Injection: చిన్న దెబ్బ తగలగానే ఎంతో మంది TT ఇంజెక్షన్ తీసుకుంటూ ఉంటారు. ఇలా చేయడం మంచిదేనా?
టీటీ ఇంజెక్షన్ ఎప్పుడు వేయించుకోవాలి?
టీటీ ఇంజెక్షన్ ఎప్పుడు వేయించుకోవాలి? (Pixabay)

టీటీ ఇంజెక్షన్ ఎప్పుడు వేయించుకోవాలి?

TT Injection: చిన్న దెబ్బ తగిలినా, ఏదైనా గుచ్చుకున్న వెంటనే టీటీ ఇంజెక్షన్ చేయించుకునే వారి సంఖ్య ఎక్కువే. చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరు TT ఇంజక్షన్ పేరు వినే ఉంటారు. అంటే టెటనస్ టాక్సైడ్ అని అర్థం. గాయం తగిలిన చోట ఇన్ఫెక్షన్ కాకుండా ఉండేందుకు ఈ టీటీ ఇంజక్షన్‌ను ఇస్తారు. ఇన్ఫెక్షన్లలో ఒకటి టెటనస్. ఒకప్పుడు ఇది ప్రాణాంతక వ్యాధిగా ఉండేది. పూర్వం గాయాలు తగిలిన చోట టెటనస్ ఇన్ఫెక్షన్ అభివృద్ధి చెంది ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఎక్కువే. దీన్ని ధనుర్వాతం అని పిలుస్తారు. వైద్యరంగం అభివృద్ధి చెందకముందు ఈ ధనుర్వాతం బారిన పడి ఎంతోమంది మరణించేవారు. వారిలో చిన్నపిల్లలే అధికంగా ఉండేవారు. ఎందుకంటే చిన్న పిల్లలకే త్వరగా గాయాలు తగిలేవి. తగిన మందులు లేక ధనుర్వాతం బారిన పడి ప్రాణాలు పోగొట్టుకున్న వారి సంఖ్య అధికంగానే ఉండేది.

గాయం తగిలినప్పుడు క్లోస్ట్రిడియం టెటాని అనే బ్యాక్టీరియా అక్కడ చేరి ఇన్ఫెక్షన్‌కు కారణం అవుతుంది. ఈ బ్యాక్టీరియా మట్టిలో, దుమ్ములో ఇలా ఎక్కడైనా ఉండొచ్చు. ఇవి గాయం ద్వారా శరీరంలోకి చేరి తీవ్రమైన ఇన్ఫెక్షన్‌కు కారణం అవుతాయి. ఇలా ఈ బ్యాక్టీరియాని అడ్డుకునేందుకే టీటీ ఇంజక్షన్‌ను వేయించుకుంటారు.

టీటీ ఇంజక్షన్ ఎన్నిసార్లు వేయించుకోవచ్చు?

గాయాలు తగిలినప్పుడు అది ఇన్ఫెక్షన్‌గా మారి ధనుర్వాతం బారిన పడకుండా టీటీ ఇంజక్షన్ రక్షణ ఇస్తుంది. ఒక్కసారి టీటీ ఇంజక్షన్ వేసుకుంటే పదేళ్ల వరకు మళ్లీ వేయించుకోవాల్సిన అవసరం లేదు. కానీ కొంతమంది ప్రతి ఆరు నెలలకు ఒకసారి వేయించుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల మరిన్ని సైడ్ ఎఫెక్టులు వచ్చే అవకాశం ఉంటుంది. టీటీ ఇంజక్షన్ వేయించుకోవడం వల్ల గాయం వల్ల వచ్చే నొప్పి తగ్గదు. అది కేవలం ఇన్ఫెక్షన్ బారిన పడకుండా మాత్రమే కాపాడుతుంది. అయితే అది కూడా క్లోస్ట్రిడియం టెటాని అనే బాక్టీరియా నుంచి మాత్రమే కాపాడుతుంది. ఇది కాకుండా ఇతర సూక్ష్మ క్రిములు ఏవైనా కూడా గాయం మీద చేరొచ్చు. వాటి నుంచి ఈ టీటీ ఇంజక్షన్ రక్షణ కల్పించదు.

టీటీ ఇంజక్షన్ కేవలం ధనుర్వాతం బారిన పడకుండా మాత్రమే రక్షణ కల్పిస్తుంది. ఇతర ఇన్ఫెక్షన్లు రాకుండా అడ్డుకునే శక్తి దీనికి ఉండదు. టీటీ ఇంజక్షన్ తప్పనిసరిగా ఇస్తారు. ఇది ఆ బ్యాక్టీరియాతో వ్యతిరేకంగా పోరాడే యాంటీ బాడీస్‌ను శరీరంలో ఉత్పత్తి చేస్తుంది. దీని వల్ల ఆ యాంటీ బాడీలు శిశువును చేరుకుంటాయి. శిశువును ధనుర్వాతం బారిన పడకుండా కాపాడతాయి. ఈ ఇంజక్షన్ చేయించుకున్నాక చాలా నొప్పిగా ఉంటుంది.

టాపిక్

తదుపరి వ్యాసం