తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Swapna Shastra : కలలో శివుడు కనిపిస్తే ఏమని అర్థం.. మీరు ఏం చేయాలి?

Swapna Shastra : కలలో శివుడు కనిపిస్తే ఏమని అర్థం.. మీరు ఏం చేయాలి?

Anand Sai HT Telugu

12 November 2023, 18:30 IST

google News
    • Lord Shiva In Dreams : శివుడు ఏ భక్తుడిని ప్రసన్నం చేసుకుంటే, ఆ భక్తుడి కోరికలు తీరుస్తాడని నమ్ముతారు. భవిష్యత్తులో జరిగే సంఘటనల గురించి చాలాసార్లు మహాదేవుడు తన భక్తులను హెచ్చరిస్తాడని అంటారు. అది కలల రూపంలో కూడా ఉండవచ్చు. స్వప్న శాస్త్రం ప్రకారం కలలో శివుడు కనిపించడం అంటే ఏంటో చూద్దాం.
స్వప్న శాస్త్రం
స్వప్న శాస్త్రం

స్వప్న శాస్త్రం

ప్రతి ఒక్కరూ రాత్రి పడుకున్నప్పుడు కలలు కంటారు. మంచి కల కావచ్చు లేదా పీడకల కావచ్చు. కొన్నిసార్లు భయానక కలలు మనలను భయపెడతాయి. కొన్నిసార్లు ఫన్నీ కలలు మనల్ని నవ్విస్తాయి. కొన్నిసార్లు ఒక రహస్యమైన కల మనల్ని రోజంతా ఆలోచించేలా చేస్తుంది. ప్రతి కల ప్రత్యేక అర్థాన్ని కలిగి ఉంటుంది.

శివుడు ఏ భక్తుడిని ప్రసన్నం చేసుకుంటే, ఆ భక్తుడి కోరికలు తీరుస్తాడని నమ్మకం. జీవితంలో భవిష్యత్తులో జరిగే సంఘటనల గురించి ఆయన హెచ్చరిస్తాడని నమ్ముతారు. ఈ విషయం కలల రూపంలోనూ ఉండొచ్చు. అయితే ఆ విషయాలపై భక్తులు జాగ్రత్తగా ఉండాలి. శివుడిని మనం కలలలో వివిధ రూపాలలో చూడవచ్చు. అయితే స్వప్న శాస్త్రం కూడా కలలో శివుడు కనిపిస్తే ఏం అర్థం చేసుకోవాలో చెబుతుంది.

కలలో శివలింగాన్ని చూడటం చాలా మంచి, శుభ సంకేతం. దీని అర్థం మీ మంచి కాలం ప్రారంభం అవుతుందని. మీకు అలాంటి కల వచ్చినప్పుడు, మీరు శివాలయానికి వెళ్లి శివలింగానికి పాలు సమర్పించాలి.

మీకు కలలో శివాలయం కనిపిస్తే, మీ అనారోగ్యాలు నయమవుతాయని అర్థం చేసుకోవాలి. ఇది సంపదకు చిహ్నం కూడా.

మీకు కలలో శివుడితో త్రిశూలం కనిపిస్తే అది శుభసూచకం. శివుడు నీతో చాలా సంతోషంగా ఉన్నాడు అంటే అతని ఆశీస్సులు నీపై ఉన్నాయని చెబుతుంది. మీ జీవితంలోని కష్టాలను ఎదుర్కోవడానికి శివుడు మీకు శక్తిని ప్రసాదిస్తాడని అర్థం. మీకు అలాంటి కల వచ్చినప్పుడు మీరు శివుడిని పూజించాలి.

మీ కలలో శివుడు నందిపై ఉండటాన్ని చూస్తే, ఈ కల చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. మీరు మీ శత్రువులపై విజయం సాధించబోతున్నారని దీని అర్థం.

మీ కలలో శివుడు, పాము కలిసి కనిపించడం శుభ సంకేతం. మీరు సంపద పొందుతారు లేదా మీ సంపద పెరుగుతుంది అని అర్థం.

మీకు కలలో శివ-పార్వతులు కలిసి కనిపిస్తే శుభసూచకం. ఆర్థిక లాభం ఉంటుంది. అవివాహితులకు కలలో శివుడు, పార్వతి కలిసి కనిపిస్తే అది వివాహానికి సూచన.

గమనిక : పైన ఇచ్చిన కథనం విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. హిందూస్థాన్ టైమ్స్ తెలుగు.. ఇందులోని అంశాలకు బాధ్యత వహించదు. మీ విచక్షణ ప్రకారం నిర్ణయాలు తీసుకోండి. సమాచారం అందించేందుకు మాత్రమే కథనం ఇచ్చాం.

తదుపరి వ్యాసం