తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Dreams And Meanings : మీరు కలలో దెయ్యంతో పోరాడారా? అర్థం ఏంటి?

Dreams and Meanings : మీరు కలలో దెయ్యంతో పోరాడారా? అర్థం ఏంటి?

Anand Sai HT Telugu

04 December 2023, 19:00 IST

google News
    • Meaning Of Dreams : స్వప్న శాస్త్రం ప్రకారం కలలో వింత వింతవి కనిపిస్తుంటాయి. అయితే వీటికి ప్రత్యేకమైన అర్థాలు ఉంటాయి. కలలో దెయ్యం కనిపించిందంటూ చాలా మంది చెబుతారు. దీనికి అర్థమేంటో తెలుసా?
స్వప్న శాస్త్రం
స్వప్న శాస్త్రం

స్వప్న శాస్త్రం

అందరూ రాత్రిపూట కలలు కంటారు. ఇది సహజ చర్య. కొన్ని కలలు మధురమైన కలలు. కానీ కొన్ని పీడకలగా మారతాయి. కొన్నిసార్లు భయానక కలలు మనలను భయపెడతాయి. కొన్నిసార్లు ఫన్నీ కలలు మనల్ని నవ్విస్తాయి. కొన్నిసార్లు ఒక కలలు మనల్ని రోజంతా ఆలోచించేలా చేస్తాయి.

ప్రతి కల దాని స్వంత ప్రత్యేక అర్ధాన్ని కలిగి ఉంటుంది. వాటి గురించి ఎక్కువగా చింతించాల్సిన పని లేదు. దాని అర్థం తెలుసుకుని జాగ్రత్తగా ఉంటే చాలు. మీ కలలో ఎప్పుడైనా దెయ్యాన్ని చూసారా? మీరు దెయ్యంతో పోరాడారా? అయితే స్వప్న శాస్త్రం ప్రకారం దీని అర్థం ఏమిటో తెలుసుకుందాం..

డ్రీమ్ సైన్స్ ప్రకారం, కలలో దెయ్యం కనిపించడం మంచి సంకేతంగా పరిగణించబడదు. మీరు డబ్బును కోల్పోవచ్చు. మీరు డబ్బును పోగొట్టుకోబోతున్నారని లేదా పనికిరాని వాటి కోసం డబ్బు ఖర్చు చేస్తారని దీని అర్థం. అలాగే కలలో దెయ్యం కనిపిస్తే మీ ఆరోగ్యంపై అవగాహన ఉండాలి. ఎందుకంటే భవిష్యత్తులో మీరు కొన్ని ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవచ్చు.

మీరు మీ కలలో దెయ్యంతో పోరాడి ఓడించినట్లయితే, అది మంచి సంకేతంగా పరిగణిస్తారు. మీ జీవితంలోని అడ్డంకుల నుండి మీరు త్వరలో విముక్తి పొందుతారని దీని అర్థం. జీవితంలో కష్టాలు తీరుతాయని అర్థం.

మీ కలలో ఎగిరే దెయ్యం కనిపిస్తే, స్వప్న శాస్త్రం ప్రకారం, శత్రువులు మీకు హాని చేస్తారని అర్థం. మీకు అలాంటి కల వచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి.

నిద్రలో అందరూ కలలు కనడం సహజం. పగలు కావచ్చు, రాత్రి కావచ్చు, ఉదయం చూసిన కల నెరవేరుతుందని చాలా మంది చెప్పడం విన్నాం. ఆ రోజు మనం ఏ టాపిక్ గురించి ఎక్కువగా మాట్లాడుకున్నా అలాంటి కలలు కనడం మామూలే అని అంటారు. కానీ మనకు గుర్తుకు రాకపోయినా చాలా సార్లు వింత కలలు వస్తాయి. మనకు కొన్ని భయానక కలలు, నవ్వడం, ఏడుపు ఇలా వివిధ రకాలుగా కనిపిస్తాయి. కలలు మన భవిష్యత్తు జీవితానికి సంకేతమని చెబుతారు. వాటి గురించి స్వప్న శాస్త్రం వివరిస్తోంది.

గమనిక : పైన ఇచ్చిన కథనం విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. హిందూస్థాన్ టైమ్స్ తెలుగు.. ఇందులోని అంశాలను ఆమోదించదు. మీ విచక్షణ ప్రకారం నిర్ణయాలు తీసుకోండి. సమాచారం అందించేందుకు మాత్రమే కథనం ఇచ్చాం.

తదుపరి వ్యాసం