Dreams and Meanings : ఈ జంతువులు పదే పదే కలలో కనిపిస్తే అదృష్టం
26 November 2023, 18:30 IST
- Meaning Of Dreams : స్వప్న శాస్త్రం వివిధ రకాల కలలకు అర్థాలు చెబుతుంది. నిద్రపోతున్నప్పుడు కలలు కనడం సహజం, కానీ జంతువులు మీ కలలో పదేపదే కనిపిస్తే మీ అదృష్టం మారుతుందని అర్థం. అది ఎలాగో చూద్దాం..
కలలు వాటి అర్థాలు
డ్రీమ్ సైన్స్ ప్రకారం, మీరు కలలో చూసేది రాబోయే భవిష్యత్తును సూచిస్తుంది. ఎన్నో సార్లు మనం కలలో అదే విషయాన్ని పదే పదే చూస్తుంటాం, అది చాలాసార్లు చూసిన తర్వాత మనసులో నిలిచిపోతుంది. కానీ ప్రతి కల ఏదో చెబుతుందని మీకు తెలుసా? అంటే ప్రతి కల వెనుక ఏదో ఒక అర్థం దాగి ఉంటుంది. కొన్ని జంతువులను కలలో చూడటం చాలా శుభప్రదం. మీరు కలలో జంతువును చూస్తే ఏం జరుగుతుందో చూద్దాం..
ఆవును చూడటం హిందూ మతంలో గౌరవనీయమైన స్థానం. ఒక వ్యక్తి కలలో ఆవును చూస్తే అది శుభ సంకేతం. కలలో ఆవును చూడటం అంటే దేవుడు ఆ వ్యక్తికి తన ఆశీర్వాదాలను ప్రసాదించబోతున్నాడని, సమీప భవిష్యత్తులో ప్రతిదానిలో విజయం సాధిస్తారని అర్థం.
ఒక వ్యక్తి తన కలలో ఏనుగును చూసినట్లయితే, అతని మంచి కాలం ప్రారంభమవుతుందని అర్థం. ఈ కల వ్యక్తి సంపద పెరుగుతుందని సూచిస్తుంది. త్వరలో జీవితంలో ఆనందం, శ్రేయస్సు ఉంటుంది.
గుడ్లగూబ కలలో కనిపిస్తే ఏమవుతుంది? చాలా సార్లు గుడ్లగూబలు కలలో కూడా కనిపిస్తాయి. మీరు మీ కలలో గుడ్లగూబలను చూసినట్లయితే, మీ జీవితంలో సంపద పెరుగుతుందని అర్థం చేసుకోండి. లక్ష్మీ ఆశీస్సులు మీకు ఎల్లప్పుడు ఉంటాయి.
మీకు కలలో పాము కనిపిస్తే, మీ కలలో నల్ల పాము కనిపిస్తే, అది అదృష్టాన్ని సూచిస్తుంది. సమీప భవిష్యత్తులో మీ కీర్తి పెరుగుతుంది. మీ ప్రతి కోరిక నెరవేరుతుంది.
స్వప్న శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తికి కలలో కుందేలు కనిపిస్తే, అది శుభ సంకేతమని అర్థం చేసుకోవాలి. అంటే మీ జీవితంలో ప్రేమ పెరుగుతుంది. మీరు ప్రతిదానిలో విజయం సాధిస్తారు. కలలో తెలుపు రంగు పామును చూడటం కూడా అదృష్టంగా చెబుతారు.
అంతేకాదు మీ కలలో తెలుపు రంగు సింహాన్ని చూస్తే శుభప్రదంగా అనుకోవాలి. ఈ విధంగా తెల్ల సింహం కనిపిస్తే.. కెరీర్లో పురోగతిని పొందుతారని, కుటుంబం, సామాజిక జీవితంలో విజయం సాధిస్తారని నమ్ముతారు. అలాంటి వ్యుక్తులు జీవితంలో ప్రతీ విషయాన్ని ఆత్మవిశ్వాసంతో పరిష్కరించుకుంటారు. ఆపదలు వస్తే పోరాడుతారు.
గమనిక : పైన ఇచ్చిన కథనం విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. హిందూస్థాన్ టైమ్స్ తెలుగు.. ఇందులోని అంశాలను ఆమోదించదు. మీ విచక్షణ ప్రకారం నిర్ణయాలు తీసుకోండి. సమాచారం అందించేందుకు మాత్రమే కథనం ఇచ్చాం.