తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Perihelion Day 2024 : జనవరిలో భూమి సూర్యుడికి దగ్గరగా వెళ్తుంది.. అప్పుడు ఏం జరుగుతుంది?

Perihelion Day 2024 : జనవరిలో భూమి సూర్యుడికి దగ్గరగా వెళ్తుంది.. అప్పుడు ఏం జరుగుతుంది?

Anand Sai HT Telugu

02 January 2024, 11:45 IST

    • Perihelion Day 2024 : ఖగోళ శాస్త్రంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మనం ఊహించలేం. ప్రతిరోజూ ఏదో ఒక ఆశ్చర్యం జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు భూమి సూర్యుడికి దగ్గరగా వెళ్లి దాని నుండి మళ్లీ దూరంగా వెళ్లనుంది.
సూర్యుడిగి దగ్గరగా భూమి
సూర్యుడిగి దగ్గరగా భూమి

సూర్యుడిగి దగ్గరగా భూమి

ఈ సృష్టిలో ఎన్నో వింతలు, విశేషాలు. అవునా.. నిజమా.. అనేలా ఉంటాయి. ఇప్పుడు కూడా ఓ ప్రత్యేకమైన విషయం జరగనుంది. భూమి సూర్యుడికి దగ్గరగా వెళ్లనుంది. భూమి సూర్యుడిని సమీపించే ప్రక్రియను పెరిహెలియన్ అంటారు. అంటే భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు, అది ఒక నిర్దిష్ట చుట్టుకొలతతో సూర్యునికి దగ్గరగా ఉన్న ప్రదేశానికి చేరుకుంటుంది. అంటే సూర్యుడికి దగ్గరగా వెళ్తుంది. భూమి కక్ష్యకు అత్యంత సమీపంలో ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు

Tired After Sleeping : రాత్రి బాగా నిద్రపోయినా.. ఉదయం అలసిపోవడానికి కారణాలు

Foxtail Millet Benefits : మీకు ఉన్న అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టేందుకు కొర్రలు చాలు

Egg potato Fry: పిల్లలకు నచ్చేలా కోడిగుడ్డు ఆలూ ఫ్రై రెసిపీ, చిటికెలో వండేయచ్చు

Mango eating: ఆయుర్వేదం ప్రకారం మామిడిపండ్లను తినాల్సిన పద్ధతి ఇది, ఇలా అయితేనే ఆరోగ్యానికి ఎంతో మంచిది

ఇందులో రెండు రకాల చర్యలు జరుగుతాయి. ఒకటి పెరిహెలియన్, మరొకటి అఫెలియన్. పెరిహెలియన్ అంటే భూమి సూర్యుడికి అత్యంత సమీప బిందువుకు చేరుకునే ప్రక్రియ. అఫెలియన్ అంటే భూమి సూర్యుడి నుండి తన దూరపు బిందువుకు చేరుకునే ప్రక్రియ.

ఇదంతా చెప్పుకోవడం ఎందుకంటే.. మనం ఇప్పుడు జనవరి 2, 3 తేదీల్లో పెరిహెలియన్ పొజిషన్‌ను చూస్తాం. అంటే ఈ రెండు రోజులు భూమి సూర్యుడి దగ్గరే ఉంటుంది. పెరిహెలియన్ గ్రీకు పదం నుంచి వచ్చింది. పెరిహెలియన్ సమయంలో భూమి సూర్యుని నుండి 91 మిలియన్ మైళ్ల కంటే ఎక్కువ దూరంలో ఉంటుంది.

భూమి సూర్యుని నుండి దూరంగా వెళ్ళినప్పుడు, గ్రహం కక్ష్య వేగం తగ్గుతుంది. చాలా దూరంలో ఉన్న బిందువును సమీపిస్తున్నప్పుడు అతి తక్కువ వేగంతో కదులుతుంది. సూర్యుని వైపు తిరిగి వెళ్లడం ప్రారంభించినప్పుడు ఇది వేగవంతమవుతుంది.

మరోవైపు భూమి విషయంలో చంద్రుడి కక్ష్యలో అదనపు చలనాన్ని కలిగిస్తుంది. మిలంకోవిచ్ సైకిల్స్ అని వీటిని పిలుస్తారు. వందల, వేల సంవత్సరాలుగా భూమి కక్ష్యలో వైవిధ్యాలు ఉన్నాయి.

జనవరి ప్రారంభంలో భూమి సూర్యుడికి దగ్గరగా ఉంటుంది. ఇది భూమి కక్ష్యలో సూర్యుని నుండి దూరంగా ఉన్న బిందువును సూచిస్తుంది. భూమి-సూర్యుడు మధ్య సగటు దూరం 159 మిలియన్ కిలోమీటర్లు. జనవరి ప్రారంభంలో భూమి సూర్యుడికి దగ్గరగా ఉన్నప్పుడు, సూర్యుడు పెద్దదిగా కనిపిస్తాడు. జనవరి ప్రారంభంలో ఉత్తర అర్ధగోళంలో, శీతాకాలంలో భూమి సూర్యుడికి దగ్గరగా ఉంటుంది. జూలై ప్రారంభంలో ఉత్తర అర్ధగోళ వేసవిలో, భూమి సూర్యుని నుండి చాలా దూరంగా ఉంటుంది. కానీ ఈ ప్రక్రియ వల్ల వాతావరణంలో ఎలాంటి మార్పు ఉండదు.

తదుపరి వ్యాసం