తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Heart Attack | గుండెపోటు వచ్చే కొన్ని రోజుల ముందు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి?

Heart Attack | గుండెపోటు వచ్చే కొన్ని రోజుల ముందు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి?

28 February 2022, 15:06 IST

google News
    • ఒత్తిడి, ఆధునిక జీవనశైలితో చిన్న వయసులోనే గుండెపోటుకు గురవుతున్న వారి సంఖ్య ఎక్కువవుతోంది. అయితే గుండెపోటు వచ్చే కొన్ని రోజుల ముందు కొన్ని ముఖ్యమైన లక్షణాలు కనిపిస్తుంటాయి. వీటిని గమనిస్తే.. గుండెపోటు ముప్పు నుంచి తప్పించుకోవచ్చు.
హార్ట్ ఎటాక్
హార్ట్ ఎటాక్ (pixabay)

హార్ట్ ఎటాక్

గుండె పోటు సడెన్ గా వస్తుంది అంటారు. నిజానికి సరిగ్గా గమనిస్తే.. గుండె పోటు వచ్చే ముందు మన శరీరం కొన్ని సూచనలు ఇస్తుంది. కానీ ఎవరూ వాటిని అంత సీరియస్ గా తీసుకోరు. ఈ లక్షణాలను చిన్న విషయాలుగా తీసుకోవడం వల్ల చిన్న వయసులోనే గుండెపోటుతో మృత్యవాత పడుతున్న వారి సంఖ్య ఎక్కువవుతోంది. మరి హార్ట్ ఎటాక్ వచ్చే కొన్ని రోజుల ముందు శరీరంలో కలిగే మార్పులేంటో చూద్దామా?

ఇవీ లక్షణాలు..

సాధారణంగా గుండెకు రక్త సరఫరా సరిగా కాకపోతే.. హార్ట్ ఎటాక్ వస్తుంది. ఈ కాలంలో ఒత్తిడి, కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం, తగిన కసరత్తులు చేయకపోవడం వల్ల రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి.. రక్తసరఫరాకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. దీంతో సడెన్ గా గుండె పోటుతో కుప్పకూలుతున్నారు. 

  • గుండెపోటు వచ్చే కొన్ని రోజుల ముందే ఎడమవైపు శరీరభాగాల్లో నొప్పి, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందులు, ఎడమ చేయి నుంచి పైన దవడ వరకూ నొప్పి వస్తుండటం వంటివి కనిపిస్తాయి.
  • చెమటలు విపరీతంగా వస్తుంటాయి. ఎన్ని నీళ్లు తాగినా నోరు పొడిబారినట్లే ఉంటుంది. స్పృహ తప్పే అవకాశాలు కూడా ఉంటాయి. ఛాతీ కూడా బరువుగా ఉన్నట్లు అనిపిస్తుంది.

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే..

గుండె ఆరోగ్యంగా ఉండేందుకు కొన్ని ప్రత్యేకమైన ఆహార పదార్థాలు ఉన్నాయి. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి.. రక్తనాళాల్లో అడ్డంకులు లేకుండా చేస్తుంది. ఓట్స్, చేపలు, వెల్లుల్లి, పెసలు వంటి ప్రతి రోజూ తీసుకుంటూ ఉండాలి.

తదుపరి వ్యాసం