తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Belly Fat Burning Tips : ఈ ఆసనాలతో 15 రోజుల్లోనే పొట్ట దగ్గర కొవ్వు తగ్గుతుందట..

Belly Fat Burning Tips : ఈ ఆసనాలతో 15 రోజుల్లోనే పొట్ట దగ్గర కొవ్వు తగ్గుతుందట..

24 August 2022, 9:56 IST

    • Belly Fat Burning Tips : కొంత మంది ఎంత బరువు తగ్గినా.. పొట్ట దగ్గర కొవ్వు మాత్రం అలానే ఉండిపోతుంది. మీరు కూడా అలాంటి ఇబ్బంది పడుతున్నా.. లేదా పొట్ట దగ్గర కొవ్వు తగ్గించుకోవాలి అనుకున్నా ఈ సింపుల్ యోగా ఆసనాలు వేస్తే చాలు అంటున్నారు యోగానిపుణులు. 15 నుంచి 20 రోజుల్లో తేడాను మీరే గమనిస్తారు అంటున్నారు.
పొట్ట కొవ్వును ఇలా తగ్గించుకోండి..
పొట్ట కొవ్వును ఇలా తగ్గించుకోండి..

పొట్ట కొవ్వును ఇలా తగ్గించుకోండి..

Belly Fat Burning Tips : మీరు మీ వృత్తి జీవితంలో ఎక్కువ సమయం డెస్క్ వద్ద పనిచేస్తూ ఉంటూ.. పొట్ట దగ్గర కొవ్వు పెరగడం సహజం. అయితే మీరు దానిని నిర్లక్ష్యం చేస్తే.. దాని పరిమాణం పెరుగుతూనే ఉంటుంది. మీరు కూడా ఆ జాబితాలోనే ఉండి పొట్టను తగ్గించుకునేందుకు అవస్థలు పడుతున్నారా? అయితే మీరు యోగా చేయండి. యోగాతో పొట్ట దగ్గర కొవ్వును ఇట్టే కరిగించుకోవచ్చు అంటున్నారు యోగా నిపుణులు. అయితే ఈ ఆసనాలు పెద్ద కష్టమేమి కాదని.. చాలా సింపుల్​ ఆసనాలతో మీరు అనుకున్న రిజల్ట్స్​ను తక్కువ వ్యవధిలోనే పొందవచ్చు అంటున్నారు. మరి ఇంతకీ ఆ ఆసనాలు ఏంటి? పొట్ట కొవ్వును తగ్గించడానికి అవి ఏ విధంగా సహాయం చేస్తాయో తెలుసుకోండి.

నౌకాసనం

నేలపై లేదా చాపపై కుర్చోండి. మీ చేతులను నిటారుగా ఉంచి బాగా ఊపిరి పీల్చుకోండి. అప్పుడు నెమ్మదిగా కాలును 45 డిగ్రీల వరకు పైకి లేపండి. మిగిలిన శరీరాన్ని నిటారుగా ఉంచుతూ కూర్చోండి. మీ చేతులను నిటారుగానే ఉంచండి. సీటు ఆకారం V లాగా ఉంటుంది. దీనినే బోటింగ్ అంటారు. తర్వాత శ్వాస వదులుతూ కాళ్లను నెమ్మదిగా కిందకి దించండి. దీని వల్ల పొట్ట దగ్గర ఉండే కొవ్వు వేగంగా తగ్గుతుంది. మొదట్లో ఈ ఆసనం వేయడం కష్టం అనిపించినా.. తర్వాత మీరే ఈజీగా చేసేస్తారు.

భుజంగాసనం

ముందుగా చాపపై బోర్లా పడుకోండి. తర్వాత చేతులపై బరువు ఆన్చి.. శరీరం పైభాగాన్ని ఎత్తండి. కాళ్లు నిటారుగా ఉంచండి. కాలి వేళ్లు చాపను తాకేలా ఉంచండి. పైభాగాన్ని పైకి ఎత్తేటప్పుడు పీల్చుకోండి. అనంతరం క్రమం తప్పకుండా శ్వాస తీసుకోండి. ఇలా 20 నుంచి 30 నిమిషాల పాటు చేసి యథాస్థితికి రావొచ్చు.

కుంభాసనం (ప్లాంక్)

చాపమీద బోర్లా పడుకోవాలి. అరికాళ్లు, మోచేతులపై బరువు ఆన్చి.. శరీరాన్ని పైకి లేపాలి. వీలైనంత సేపు ఈ ప్లాంక్ స్థితిలో ఉండవచ్చు. ఇది పొట్ట దగ్గర కొవ్వు తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్​గా పనిచేస్తుంది.

ఉస్త్రాసనం

ముందుగా మోకరిల్లి.. మీ ఎడమ మడమను ఎడమ చేతితో పట్టుకోవడానికి ప్రయత్నించండి. మీ తలను నెమ్మదిగా వెనక్కి వంచి.. ఉదరం సాగేలా చూసుకోండి. తర్వాత కుడి చేతితో కుడి మడమను పట్టుకోండి. మీకు వీలైనంత కాలం ఇలా ఉండొచ్చు.

ధనురాసనం

చాప మీద బోర్లా పడుకోండి. అప్పుడు కాళ్లను వెనుక నుంచి పైకి లేపడానికి ప్రయత్నించండి. ముందు శరీరాభాగాన్ని లేపుతూ.. చేతులతో మీ కాళ్లను పట్టుకుని.. బరువు పొట్టపై పడేలా చేయండి. ఈ ఆసనాన్ని వీలైనంత ఎక్కువసేపు చేయండి.

ఈ ఆసనాలను రోజూ చేస్తూ ఉంటే మీరు 15 నుంచి 20 రోజుల్లోనే మెరుగైన ఫలితాలను చూస్తారు.

తదుపరి వ్యాసం