తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Weekly Horoscope | ఈ వారం రాశి ఫలాలు.. ఆ రాశి వారికి అన్నీ శుభవార్తలే!

Weekly Horoscope | ఈ వారం రాశి ఫలాలు.. ఆ రాశి వారికి అన్నీ శుభవార్తలే!

HT Telugu Desk HT Telugu

31 July 2022, 6:57 IST

google News
    • Weekly Tarot Card Readings: జూలై 31 నుంచి ఆగష్టు 06, 2022 వరకు మీ రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోండి. ప్రముఖ టారో కార్డ్ అనలిస్ట్ మనీషా కౌషిక్ అందించిన వార ఫలాలు ఇక్కడ ఉన్నాయి. 
Weekly Horoscope
Weekly Horoscope

Weekly Horoscope

జూలై 31 నుంచి ఆగష్టు 06, 2022 వరకు రాశి ఫలాలు

మేష రాశి (మార్చి 21-ఏప్రిల్ 20)

మేషరాశి వారికి ఈ వారం శుభప్రదంగా ఉంటుంది. వారం ప్రారంభం నుంచి మీరు అనుకున్న పని అనుకున్న సమయానికి పూర్తవుతుంది. కొత్త వస్తువులను కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. గృహంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగం మారాలని ప్రయత్నాలు చేస్తున్న వారు వారం చివరి నాటికి గొప్ప అవకాశాలు అందుకుంటారు. మీ ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ప్రేమ సంబంధాల విషయంలో ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది. ప్రేమ భాగస్వామితో ఆహ్లాదకరమైన క్షణాలు గడిపే అవకాశాలు ఉంటాయి. అయితే కొన్ని విచారకరమైన వార్తలను స్వీకరించినప్పుడు, మీ మనస్సు నిరుత్సాహంగా ఉండవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో కొంత సమయం గడపడం వల్ల విశ్రాంతి లభిస్తుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి పర్యాటక ప్రదేశానికి వెళ్లవచ్చు. ఆరోగ్యం మామూలుగా ఉంటుంది.

వృషభం (ఏప్రిల్ 21-మే 20)

వృషభ రాశి వారికి ఈ వారం అంతా అనుకూలంగా ఉంటుంది. మీరు గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న సమస్యలన్నింటికి పరిష్కారం లభిస్తుంది. వ్యక్తులతో చోటుచేసుకున్న అపార్థాలు తొలగిపోతాయి. వృత్తి, వ్యాపార విషయాలలో అనుకూలత లభిస్తుంది. వ్యాపార విస్తరణ దిశగా అడుగులు వేస్తారు. కార్యాలయంలో మీ పనికి ప్రశంసలు అందుకుంటారు. మరిన్ని బాధ్యతలను కూడా స్వీకరించే అవకాశం ఉంది. మీ బాధ్యతలకు సహోద్యోగుల నుంచి సహకారం లభిస్తుంది. అదనపు ఆదాయ వనరులు పెరుగుతాయి. అయితే ఈ వారం ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మీరు భూమి, భవనం లేదా వాహనం కొనుగోలు చేయవచ్చు. వారసత్వ ఆస్తులకు సంబంధించిన అడ్డంకులు తొలగిపోతాయి. వారం రెండవ భాగంలో అనారోగ్య సమస్యలు రావొచ్చు. ఎక్కువ ఒత్తిడి తీసుకోకండి. ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.

మిథున రాశి (మే 21-జూన్ 21)

మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉంటుంది. వ్యాపారానికి సంబంధించి ఎటువంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకండి. మీ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారవచ్చు. కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది. ఈ వారంలో మీరు ఒక పెద్ద సమస్య నుంచి కాస్త ఊరట చెందుతారు. తేలికపాటి అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. జలుబు, జ్వరం, అలర్జీలు ఇబ్బంది పెడతాయి. ప్రాజెక్ట్‌లలో ఏదైనా వైఫల్యం కారణంగా నిరాశకు గురయ్యే అవకాశం ఉంది. అదనపు పని భారం మీ ఒత్తిడికి కారణమవుతుంది. అసూయతో కొద్ది మంది వ్యక్తులు మీకు ఇబ్బంది కలిగిస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వాహనం నడిపేటపుడు అప్రమత్తంగా ఉండండి. భాగస్వామితో సాన్నిహిత్యం పెరుగుతుంది. మీరు మీ జీవిత భాగస్వామితో ఆహ్లాదకరంగా గడిపే అవకాశాలను పొందుతారు.

కర్కాటకం (జూన్22-జూలై 22)

కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా ముఖ్యమైనది. వారం ప్రారంభంలో మీరు మీ కెరీర్, వ్యాపారం లేదా జీవితానికి సంబంధించి పెద్ద నిర్ణయం తీసుకోవచ్చు. కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్యకు సంబంధించి మీకు పెద్ద ఉపశమనం లభిస్తుంది. వారం చివరి భాగంలో వ్యాపారం లేదా ఏదైనా పనికి సంబంధించి ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. వ్యాపార విస్తరణ ప్రణాళికలు ఫలిస్తాయి. పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న వారు కొన్ని శుభవార్తలను అందుకుంటారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవితానికి సంబంధించిన ఏవైనా ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పుడు, మీ జీవిత భాగస్వామి నుంచి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది.ప్రయాణాలు ఫలవంతం అవుతాయి. అదృష్టం మీ వైపు ఉంటుంది. ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది.

సింహ రాశి (జూలై 23-ఆగస్టు 23)

ఈ వారం మీరు చేపట్టే ప్రతీ పనిలో ఆశించిన విజయాన్ని పొందుతారు. విదేశాల్లో వృత్తి, వ్యాపారాలు చేయాలనే ఆలోచనలో ఉన్నవారు ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. చాలా కాలంగా భూమి-భవనం లేదా వాహనాన్ని కొనుగోలు చేయాలనే ఆలోచన ఉంటే, ఈ వారం అనుకూలంగా ఉంది. వారసత్వ ఆస్తుల ద్వారా లాభం చేకూరుతుంది. వారం ద్వితీయార్థంలో కెరీర్, వ్యాపారంలో రహస్య శత్రువులు అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నించవచ్చు. కాబట్టి మీ ప్రణాళికలను రహస్యంగా ఉంచండి. భాగస్వామితో అనుబంధం బాగుంటుంది. వైవాహిక జీవితం కూడా ఆనందంగా ఉంటుంది. వారం చివరి నాటికి, మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి ఏదైనా విహారయాత్రకు వెళ్ళవచ్చు. కుటుంబంలో సామరస్యమైన వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం మామూలుగా ఉంటుంది.

కన్య (ఆగస్టు 24-సెప్టెంబర్ 23)

కన్య రాశి వారికి ఈ వారం ప్రారంభంలో శుభప్రదంగా ఉంటుంది. మంచి లక్ష్యంతో పని చేసే వారు కెరీర్ లేదా వ్యాపారంలో ఆశించిన విజయాన్ని పొందుతారు. వారం ద్వితీయార్థంలో కొన్ని ఇంటి సమస్యలు మీకు ఆందోళన కలిగిస్తాయి. భూముల క్రయవిక్రయాలు మానుకోండి. చిన్న విషయానికి భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడతాయి. మీ వైవాహిక జీవితంలో చిన్నచిన్న తగాదాలు ఉన్నప్పటికీ సాఫీగానే సాగుతుంది. వివాదాలను వివేకంతో పరిష్కరించటం వలన ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. ఈ వారం అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. సీజనల్ వ్యాధులపై జాగ్రత్త వహించండి. డబ్బును పెట్టుబడి పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మర్చిపోవద్దు. పరీక్ష-పోటీలకు సిద్ధమవుతున్న వారు మరింత తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది.

తులా రాశి (సెప్టెంబర్ 24-అక్టోబర్ 23)

తులా రాశి వారికి ఈ వారం అదృష్టం తలుపు తడుతుంది. వారం ప్రారంభంలో కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. శ్రేయోభిలాషులు లేదా నిపుణుల అభిప్రాయాన్ని తీసుకొని ముందడుగు వేయండి. ఉద్యోగస్తులకు అదనపు ఆదాయ వనరులు పెరుగుతాయి. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. భూమి, భవనాల క్రయ, విక్రయాల వల్ల లాభం ఉంటుంది. వారం మధ్యలో, మీరు మీ ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించవలసి ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు మిమ్మల్ని ఆందోళనకు గురిచేస్తాయి. మీరు ప్రేమలో ఉన్నట్లయితే మీ ప్రేమ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి, చీలిక ఉండవచ్చు. వివాహితులకు వైవాహిక జీవితం బాగుంటుంది. మీరు మీ జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతును పొందుతారు. వివాహం కాని వారికి వివాహం నిశ్చయమయ్యే సూచనలు ఉన్నాయి.

వృశ్చిక రాశి (అక్టోబర్ 24-నవంబర్ 22)

ఈ వారం వ్యవహారాల్లో మంచి పురోగతిని సాధిస్తారు. వివిధ మార్గాల్లో మీ ఆదాయం పెరుగుతుంది. వ్యక్తులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. వృత్తిరంగంలో ఉన్నవారు మెరుగైన పనితీరును కనబరుస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. పని ఒత్తిడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఆరోగ్యం క్షీణించవచ్చు. పెట్టుబడులకు ఈ వారం అనుకూలంగా ఉంది. పూర్వీకుల ఆస్తి లేదా భూమి-నిర్మాణానికి సంబంధించిన వివాదం ఆందోళనకు దారితీయవచ్చు. సంభాషణల ద్వారా పరిష్కారం లభిస్తుంది.ప్రేమలో ఉన్నవారికి అపార్థాలు తొలగిపోతాయి, తిరిగి మీ బంధం బలపడుతుంది. ఈ వారం మీరు కుటుంబంతో కలిసి ఏదైనా వేడుకల్లో పాల్గొనవచ్చు.

ధనుస్సు (నవంబర్ 23-డిసెంబర్ 21)

ఈ వారం అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది. అదనపు ఆదాయ వనరులు పొందవచ్చు. అయితే తెలివైన నిర్ణయాలు తీసుకోవడం, ప్రణాళికబద్ధంగా పనులను పూర్తి చేయడం వలన మీకు విజయాలు దక్కుతాయి. కొన్నిసార్లు మీ మనస్సులో ప్రతికూల ఆలోచనలు తలెత్తవచ్చు. నిలిచిపోయిన డబ్బు వాయిదాల వారీగా తిరిగి వస్తుంది. కష్ట సమయాల్లో పెద్దల సహాయం మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. భూమి, భవనానికి సంబంధించిన వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారానికి సంబంధించి ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. విద్యార్థులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న విజయాన్ని పొందవచ్చు. భార్యాభర్తల మధ్య అనుబంధం మధురంగా ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మకరం (డిసెంబర్ 22-జనవరి 21)

వారం ప్రారంభంలో, మీరు అనుకున్న పనిని సకాలంలో పూర్తి చేయడంలో ఆరోగ్యం ఆటంకంగా మారుతుంది. ఈ వారం కాస్త ఒడిదుడుకులు ఉండవచ్చు. కోపతాపాలకు దూరంగా ఉండండి. ఆవేశంతో ఏ నిర్ణయం తీసుకోకుండా జాగ్రత్తపడండి. జీవిత భాగస్వామితో ఏదో ఒక విషయంలో వివాదం మీ ఒత్తిడికి కారణం అవుతుంది. అయితే, వారం చివరి నాటికి, మీ సంతోషకరమైన వైవాహిక జీవితం తిరిగి ట్రాక్‌లోకి వస్తుంది. వావాహనాన్ని చాలా జాగ్రత్తగా నడపండి, ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. ఈ వారం మీరు ఆర్థికంగా నష్టపోయే సూచనలు ఉన్నాయి. వ్యాపారంలో డబ్బు పెట్టుబడి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. వృత్తిరంగంలో ఉన్నవారికి కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు.

కుంభం (జనవరి 22-ఫిబ్రవరి 19)

కుటుంబపరంగా కొన్ని శుభవార్తలను అందుకుంటారు. ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి. సృజనాత్మక కార్యకలాపాలతో కూడా బిజీగా ఉంటారు.వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. జీవితంలో స్థిరపడేందుకు సరైన దృక్పథంలో ఆలోచనలు చేస్తారు. మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునే దిశగా మీ అడుగులుంటాయి. వృత్తిపరంగా అంతా అనుకూలంగా ఉంది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం ద్వారా ఇబ్బందులో పడవచ్చు కాబట్టి జాగ్రత్త వహించండి. ఆరోగ్యం బాగుంటుంది. ఆత్మీయుల రాకతో ఇంట్లో ఆనందం నెలకొంటుంది. ఖర్చులు పెరిగవచ్చు. వారం చివరిలో తీర్థయాత్ర లేదా దేవదర్శనం కోసం ప్రయాణాలు చేయవచ్చు.

మీనం (ఫిబ్రవరి 20-మార్చి 20)

మీన రాశి వారికి ఈ వారం అదృష్టం వెన్నంటే ఉంటుంది. వారం ప్రారంభంలో వృత్తి-వ్యాపారానికి సంబంధించి చేసే ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి. మీ సానుకూల దృక్పథం, ఆలోచనలో సమతుల్యత ముఖ్యమైన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. వారం ద్వితీయార్థంలో మీ జీవితానికి సంబంధించిన సమస్యలను అధిగమించగలుగుతారు. ప్రస్తుత వ్యాపార కార్యకలాపాలు నెమ్మదిస్తాయి. అతిగా ఆలోచించడం వల్ల ముఖ్యమైన పురోగతులు మీ చేతుల్లోంచి జారిపోవచ్చు. సామాజిక, ఆధ్యత్మిక కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. పని నుంచి కొంత విరామం మీ మానసిక ఆరోగ్యానికి మంచిది.

టాపిక్

తదుపరి వ్యాసం