తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ragi For Diabetes: డయాబెటిస్ ఉన్న వారు రాగులను ఇన్ని రకాలుగా తీసుకోవచ్చు! బోర్ కొట్టకుండా..

Ragi for diabetes: డయాబెటిస్ ఉన్న వారు రాగులను ఇన్ని రకాలుగా తీసుకోవచ్చు! బోర్ కొట్టకుండా..

16 August 2023, 23:03 IST

google News
    • Ragi for diabetes: డయాబెటిస్ ఉన్న వారు రాగులను కచ్చితంగా తీసుకోవాలి. దీన్ని వల్ల చాలా లాభాలు ఉంటాయి. రాగులను చాలా రకాలుగా మీ డైట్‍లో యాడ్ చేసుకొని తినవచ్చు. అవేంటో ఇక్కడ చూడండి. 
Ragi for diabetes: డయాబెటిస్ ఉన్న వారు రాగులను ఇన్ని రకాలుగా తీసుకోవచ్చు! బోర్ కొట్టకుండా..
Ragi for diabetes: డయాబెటిస్ ఉన్న వారు రాగులను ఇన్ని రకాలుగా తీసుకోవచ్చు! బోర్ కొట్టకుండా..

Ragi for diabetes: డయాబెటిస్ ఉన్న వారు రాగులను ఇన్ని రకాలుగా తీసుకోవచ్చు! బోర్ కొట్టకుండా..

Ragi for diabetes: భారత దేశంలో డయాబెటిస్ (మధుమేహం / షుగర్) ఓ ప్రధానమైన సమస్యగా ఉంది. కోట్లాది మంది డయాబెటిస్‍తో బాధపడుతున్నారు. మధుమేహం ఉన్న వారు కచ్చితంగా కఠినమైన డైట్ పాటించాలి. మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. అయితే, డయాబెటిస్ ఉన్న వారు తమ డైట్‍లో రాగులను తీసుకోవడం చాలా ముఖ్యం. రాగుల్లో ఫైబర్, విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. మధుమేహం ఉన్న వారికి రాగులు చాలా రకాలుగా మంచి చేస్తాయి. అయితే, రాగులతో చేసిన ఒకే రకరమైన వంటలను రోజూ తినడం కొందరికి బోర్‌గా ఉండొచ్చు. రాగులను పూటకో రకంగా చేసుకుంటే తినేందుకు కూడా ఆసక్తి కలుగుతుంది. అలా, రాగులను ఎన్ని రకాలుగా మీ డైట్‍లో తీసుకోవచ్చో ఇక్కడ చూడండి.

రాగి గంజి

నీరు లేదా పాలలో రాగి పిండి వేసి కాస్త చిక్కగా ఉడికించుకోవాలి. దాంట్లో తేనె, బెల్లం లాంటి ఆరోగ్యకరమైన స్వీట్నర్లను కాస్త వేసుకోవచ్చు. వీటితో పాటు తరిగిన పండ్లను లేదా జీడిపప్పు, బాదం పప్పు లాంటి నట్స్ కాస్త వేసుకొని తినవచ్చు.

రాగి దోశ, రాగి ఇడ్లీ

దోశ లేదా ఇడ్లీ పిండి తయారు చేసుకునే సమయంలో బియ్యానికి, రవ్వకు బదులుగా రాగులు వేసుకోవచ్చు. అది పిండిగా చేసుకున్నాక దోశ, ఇడ్లీగా చేసుకోవచ్చు.

రాగి చపాతీలు/రొట్టెలు

గోధుమ పిండితో రాగి పిండిని కలుపుకొని.. దాంట్లో తరిగిన కూరగాయలు, కాస్త కారం, ఉప్పు వేసుకొని కలపాలి. ఆ తర్వాత చిన్న ఉండలుగా చేసుకొని చపాతీల్లా ఒత్తుకోవాలి. ఆ తర్వాత పెనంపై కాల్చి.. కర్రీతో తినొచ్చు. అలాగే, కేవలం రాగి పిండితో కూడా రొట్టెలు చేసుకోవచ్చు.

రాగి ఉప్మా

రాగి ఉప్మా కోసం ముందుగా రాగి పిండిని వేయించుకోవాలి. ఆ తర్వాత కూరగాయలు, కారం, నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. అనంతరం వేయించుకున్న రాగి పిండిని వాటిలో వేయాలి.

రాగి సూప్

రాగి పిండిలో నీరు పోసి కూరగాయల రసం, తరిగిన కూరగాయలు, కాస్త మసాలా దినుసులు వేసి ఉడికించుకోవాలి. దీంతో రాగిసూప్ రెడీ అవుతుంది. ఇది డిన్నర్‌కు మంచి ఆప్షన్‍గా ఉంటుంది.

రాగి సలాడ్

ముందుగా రాగి గింజలను మొలకెత్తనివ్వండి. ఆ తర్వాత తరిగిన కూరగాయలను, మీకు నచ్చిన సుగంద ద్రావ్యాలను కాస్త మొలకెత్తిన రాగుల్లో వేసుకోండి. అంతా బాగా కలిపి తినండి. లంచ్ చేసే సమయంలో తీసుకుంటే బెస్ట్.

రాగి కిచిడి

రాగి, బియ్యం, ఇతర ధాన్యాలను, కూరగాయలను కలుపుకొని కిచిడీ చేసుకోవచ్చు. ఇది కూడా చాలా ఆరోగ్యకరం.

రాగి పాన్‍కేక్

రాగి పిండిని గోధుమ పిండి లేకపోతే ఓట్స్‌లో కలుపుకోవాలి. అనంతరం వాటిలో మజ్జిగ వేసి గట్టిగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని మైక్రోవేవ్ ఓవెన్‍లో పాన్ కేకుల్లా తయారు చేసుకోవాలి. అందులో మీకు నచ్చిన పండ్లను టాపింగ్స్‌గా వాడుకోవచ్చు.

తదుపరి వ్యాసం