తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Vivo X80 Series ఫోన్లతో మీ కథను సినిమాటిక్‌గా షూట్ చేసుకోవచ్చు!

Vivo X80 Series ఫోన్లతో మీ కథను సినిమాటిక్‌గా షూట్ చేసుకోవచ్చు!

HT Telugu Desk HT Telugu

18 May 2022, 16:11 IST

google News
    • వివో తమ బ్రాండ్ నుంచి Vivo X80 ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ సిరీస్‌ను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ రెండు ఫోన్లలో కెమెరాలు ప్రధాన ఆకర్షణ. సినిమాటిక్‌గా ఫోటోలు, వీడియోలు తీసుకోవచ్చని కంపెనీ పేర్కొంది. 
Vivo X80 Series
Vivo X80 Series (Vivo)

Vivo X80 Series

మొబైల్ తయారీదారు వివో గత కొన్నిరోజులుగా వరుసగా సరికొత్త మోడల్ ఫోన్లను మార్కెట్లో విడుదల చేస్తుంది. తాజాగా Vivo X80 ఫ్లాగ్‌షిప్ సిరీస్‌ను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ X80 సిరీస్‌లో రెండు మోడల్స్ ఉన్నాయి.  ఇందులో ఒక మోడల్ Vivo X80 కాగా మరొకటి Vivo X80 Pro. బేసిక్ మోడల్‌లో ర్యామ్, స్టోరేజ్ ఆధారంగా వేరియంట్‌లు అందుబాటులో ఉన్నాయి. 

ఈ స్మార్ట్‌ఫోన్‌లలో Zeiss-ఆధారిత కెమెరా మాడ్యూల్స్ ఉండటం ప్రధాన ఆకర్షణ. ఫోటోలు, వీడియోలు తీసుకోవడానికి అధునాతనమైన వ్యవస్థను పొందుపరిచారు. సినిమాటిక్ స్టైల్ ఫోటో, సినిమాటిక్ వీడియో అలాగే 360-డిగ్రీ హోరిజోన్ లెవెల్ స్టెబిలైజేషన్ వంటి ఫీచర్‌లు ఉన్నాయి. తక్కువ-కాంతిలోనూ ఫోటోలు తీయవచ్చు, వీడియోగ్రఫీ కోసం AI ఆధారిత ప్రత్యేకమైన Vivo V1+ ఇమేజింగ్ చిప్ కూడా ఉంది.

ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు మే 25 నుండి ఫ్లిప్‌కార్ట్, Vivo అధికారిక ఆన్‌లైన్ స్టోర్ అలాగే ఆఫ్‌లైన్ రిటైలర్ల ద్వారా కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటాయి.  ఏ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి. వీటి ధరలు ఎంత మొదలగు అన్ని వివరాలు ఇక్కడ కింద పేర్కొన్నాం.

Vivo X80 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.78 అంగుళాల ఫుల్ HD+ AMOLED డిస్‌ప్లే

8GB/12 GB RAM, 128/256 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం

మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్

వెనకవైపు 50+12+12 మెగా పిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, ముందు భాగంలో 32 MP సెల్ఫీ షూటర్‌

ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్

4500 mAh బ్యాటరీ సామర్థ్యం, 80W ఛార్జర్

8 GB RAM, 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర, రూ. 54,999/-

12 GB RAM, 256 GB స్టోరేజ్ వేరియంట్ ధర, రూ. 59,999/-

ఈ ఫోన్ కాస్మిక్ బ్లాక్ , అర్బన్ బ్లూ అనే రెండు కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది.

Vivo X80 Pro స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.78 అంగుళాల ఫుల్ HD+ AMOLED డిస్‌ప్లే

12GB RAM, 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్

వెనకవైపు 50+48+12+ మెగా పిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్, ముందు భాగంలో 32 MP సెల్ఫీ షూటర్‌

ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్

4700 mAh బ్యాటరీ సామర్థ్యం, 80W ఛార్జర్

ధర, రూ. 79,999/-

ఈ ఫోన్ కాస్మిక్ బ్లాక్ అనే ఒకేఒక్క కలర్ ఆప్షన్‌తో లభిస్తుంది. 

టాపిక్

తదుపరి వ్యాసం