తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Vivo T1x । వివో నుంచి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌, ఫీచర్లు ఇలా ఉన్నాయి!

Vivo T1x । వివో నుంచి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌, ఫీచర్లు ఇలా ఉన్నాయి!

HT Telugu Desk HT Telugu

20 July 2022, 14:42 IST

    • Vivo కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో లాంచ్ చేసింది. రూ. 12 వేల నుంచి ధరలు ప్రారంభమవుతున్నాయి. బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. మిగతా వివరాలు తెలుసుకోండి..
Vivo T1x
Vivo T1x

Vivo T1x

గ్లోబల్ టెక్నాలజీ బ్రాండ్ వివో తమ T-సిరీస్‌లో మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్ Vivo T1xని భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఇది బడ్జెట్ స్మార్ట్‌ఫోన్, అయినప్పటికీ ఇందులో కొన్ని మెరుగైన ఫీచర్లు ఉన్నాయి. Vivo T1x స్మార్ట్‌ఫోన్‌ ఇన్‌సెల్ డిస్‌ప్లేను కలిగి ఉంది. బ్లూ లైట్ నుంచి రక్షణ కోసం, ఇది ఐ ప్రొటెక్షన్ మోడ్‌ను కలిగి ఉంటుంది. కళ్లపై భారం లేని సౌకర్యవంతమైన వీక్షణను అందిస్తుంది.

ట్రెండింగ్ వార్తలు

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

మొబైల్ గేమింగ్ ఇష్టపడేవారి కోసం T1xలో అల్ట్రా గేమ్ మోడ్, మల్టీ టర్బో 5.0 ఫీచర్‌లు ఉన్నాయి. దీంతో అత్యుత్తమ లాగ్-ఫ్రీ గేమింగ్ అనుభవాన్ని పొందవచ్చు. ఎక్కువ సేపు గేమ్స్ ఆడినా, ఫోన్ హీట్ పెరగకుండా 4-లేయర్ కూలింగ్ సిస్టమ్‌తో కూడా వస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో VEG టెక్నాలజీతో కూడిన 5000mAh బ్యాటరీని ఇచ్చారు. ఇది స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ జీవితాన్ని పొడిగిస్తుంది. పూర్తిగా బ్యాటరీ వినియోగించినా కూడా దీని బ్యాటరీకి ఎలాంటి ఇబ్బందులు రావు.

ఇంకా Vivo T1x ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి. వీటి ధరలు ఎంత మొదలగు అన్ని వివరాలు ఇక్కడ కింద పేర్కొన్నాం.

Vivo T1x స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.58 అంగుళాల FHD+ IPS LCD డిస్‌ప్లే
  • 4GB/ 6GB RAM, 64GB/128 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
  • Qualcomm స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్
  • వెనకవైపు 50+2 మెగా పిక్సెల్ కెమెరా, ముందు భాగంలో 8 MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
  • 5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 18W ఛార్జర్

ఈ ఫోన్ గ్రావిటీ బ్లాక్, స్పేస్ బ్లూ కలర్ అనే రెండు కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది.

కాన్ఫిగరేషన్ పరంగా మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.

Vivo T1x 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ కోసం ధర రూ. 11,999/-

4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 12,999/-

టాప్-ఆఫ్-ది-లైన్ 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 14,999/-.

Vivo T1x జూలై 27 నుంచి ఫ్లిప్‌కార్ట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. వివిధ బ్యాంక్ ఆఫర్లు కూడా వర్తిస్తాయి.

టాపిక్

తదుపరి వ్యాసం