తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Childhood Love Story : తూనీగ.. తూనీగ లవ్ స్టోరీ.. ఆ ప్రేమ లేఖ రాసిందెవరో చెప్పండయ్యా?

Childhood Love Story : తూనీగ.. తూనీగ లవ్ స్టోరీ.. ఆ ప్రేమ లేఖ రాసిందెవరో చెప్పండయ్యా?

Anand Sai HT Telugu

14 February 2024, 8:00 IST

    • Real Life Childhood Love Story : చిన్న వయసులో కలిగేది ఆకర్శణ అని కొందరంటారు. కానీ కొన్నిసార్లు ఆ ఆకర్శణే ప్రేమ వరకూ దారితీస్తుంది. అలాంటి చిన్ననాటి ప్రేమ కథ ఒకటి చదువుకుందాం.. చాలా ఇంట్రస్టింగ్..
రియల్ లైఫ్ లవ్ స్టోరీ
రియల్ లైఫ్ లవ్ స్టోరీ (Unsplash)

రియల్ లైఫ్ లవ్ స్టోరీ

ప్రేమకు వయస్సు ఉంటుందా? కొన్నిసార్లు ఉంటుంది.. కొన్నిసార్లు ఉండదు. ఎందుకంటే కొందరి జీవితాల్లో చిన్నప్పుడు ఆకర్శణగా మెుదలై.. రెండు జీవితాలను కలిపే ప్రేమ వరకూ ప్రయాణం సాగుతుంది. ఎవరో చేసిన పనికి.. ఓ ఇద్దరు కలవడం అంటే అది కాస్త వింతేగా. అలా తూనీగ.. తూనీగ వయసులో మెుదలై.. అదే చిన్నప్పుడు మెుదలై ఎవరూ ఊహించని ట్విస్ట్‌తో కలిసిన ఓ ప్రేమ కథ గురించి తెలుసుకుందాం..

ట్రెండింగ్ వార్తలు

Monday Motivation: ఎవరి గొప్ప వారిదే, జీవితంలో ఎదురయ్యే ఎవరినీ చులకనగా చూడకండి

Acid Reflux At Night : రాత్రి గుండెల్లో మంట రావడానికి కారణాలు.. ఈ అసౌకర్యాన్ని ఎలా తొలగించాలి?

Relationship Tips : పెళ్లికి ముందే ఈ 5 విషయాలు చర్చించండి.. లేదంటే తర్వాత సమస్యలు

Cashew Tomato Gravy : టొమాటో జీడిపప్పు గ్రేవీ తయారు చేయండి.. ఎంజాయ్ చేస్తూ తింటారు

2006.. ఆరో తరగతి చదివే రోజులు అవి.. త్రైమాసిక పరీక్షలు(25 మార్కులే). ఏదో పరీక్ష సరిగా గుర్తు లేదు.. కాళ్ళ మధ్యలో బుక్ పెట్టి, కంపాస్ బాక్స్ లో చిట్టీలు పెట్టి రాసే రోజులు కాబట్టి ఏ పరీక్ష అయిన ఒకటే. అందరం కూర్చోని మధ్యాహ్న భోజనంలో ఏం పెడతారో మాట్లాడుకుంటున్నాం. సడన్ గా ఒక అమ్మాయి వచ్చి అరేయ్ కౌశిక్ ఒక్కసారి పక్కకి రా అని పిలుపు. అప్పటి వరకు రెస్పెక్ట్ తో పిలుస్తూ ఉండేది. ఆ టైమ్ కి రా అనేసరికి పక్కన ఉన్న వాళ్లు అంత షాక్. మరి ఆ వయసులో అమ్మాయి పిలిచింది అంటే అదో గొప్ప.. నేను కూడా స్టైల్‌గా వెళ్లాను..

హూ.. హూ...హూ.. తెలుసు... హూ తెలిసింది.. అని అంటుంటే ఏంటో అని నాకు కూడా కాస్త వింతగా అనిపించింది. అంతకు ముందు రోజే మా మాథ్స్ సర్ బండి టైర్ పంక్చర్ చేసిన.. ఈమెకు తెలిస్తే.. ఊరంతా తెలుస్తుంది. రెండు గంటలు దూరం నుంచి చూస్తూ.. హూ..హూ తోనే అయిపోయింది. బాగా రిక్వెస్ట్ చేసేసరికి.. అసలు విషయం చెప్పేసింది. నువ్ లవ్ లెటర్ రాశావట. నీకు రిప్లై లెటర్ రాసి పెట్టింది ఆ అమ్మాయి అదే కావ్య అని చెప్పింది. ఏది చూపియ్ అనేసరికి చూపించింది.

'ప్రియమైన కౌశిక్ గారు.. మీరు రాసిన ఉత్తరం అందింది.. నాతో వస్తవా నువ్ నాతో వస్తావా అనే సాంగ్ నాకు చాలా ఇష్టం. మీకు కూడా అదే అనుకుంటున్నా. ఇట్లు మీ ప్రియురాలు..'

ఇప్పుడు అప్పటి విషయం గురించి ఆలోచిస్తే.. నవ్వు ఆగదు. కానీ ఆ సమయానికి ఊర్లో నేనో లవర్ బాయ్ అయిపోయా. ఎందుకంటే ఈ విషయం చిలికి చిలికి గాలి వానలా స్కూల్ మొత్తం తెలిసింది. నాలుగంటే నాలుగు రోజులకే ఊరంతా పాకింది. అప్పుడు మొదలయ్యాయి నా కష్టాలు.

మొదట్లో ఫ్రెండ్స్ ఇళ్లకు వెళ్లడం ఆపేశా. వెళ్తే లవ్ చేస్తున్నావటగా అని ఒకటే అడగడం. మళ్ళీ అడిగే వాళ్లంతా ముసలి వాళ్లే. మా ఇంటి ముందు ఉండే చెట్టు దగ్గర చాలా మంది నా గురించే విషయం. చిన్న వయసు కదా.. ఓ బోనులో పెట్టి మెదడును గుచ్చుతున్నట్టు ఉండే ఆ టైమ్ లో. టీచర్లు అదో రకంగా చూస్తుండే. మంచి మార్కులు అయితే తెచ్చుకునే ప్రయత్నం చేసినా.. కానీ టీచర్ల మనసులో మాత్రం ఓ రకమైన చెడు ముద్ర పడిపోయింది.

ఒక రోజు స్కూలుకు అందరికంటే ముందే వెళ్లాను. ఆమె వచ్చే టైమ్ కోసం వెయిట్ చేశా. తను రానే వచ్చింది. ధైర్యం చేసి అడిగేశా. నాకు ఎందుకు లెటర్ రాశావ్.. అని ఆమె నవ్వుకుంటూ వెళ్లిపోయింది. మరుసటి రోజు ఊర్లో మరో పుకారు.. ఇద్దరు కలుసుకున్నారటగా.. అని. అప్పటి నుంచి ఒక్క ఏడాది పాటు ఏ పొలం దగ్గరకు వెళ్లినా నా కథే గురించే చర్చ. తెలియకుండానే నా మైండ్‌లో ఆమెపై ఆకర్శణ పెరిగింది. నేను కూడా ఆమెను చూడటం మెుదలుపెట్టా.

ఈ విషయం మా ఇంట్లో వాళ్లకి ఎప్పుడో తెలిసింది. కానీ నన్ను అడిగేందుకు చాలా రోజులు తీసుకున్నారు. ఓ రోజు పొలం మధ్యలోకి తీసుకెళ్లింది అమ్మ. చుట్టు పక్కల ఎవరైనా వింటారేమో అని జాగ్రత్త. నిన్ను, ఆ పిల్లను సార్ చాలా కొట్టిండట కదా.. అట్లా చెయ్యకు బిడ్డ నీకు దండం పెడతా అని విషయం అడిగేసింది. నాకేం తెలియదు అంటే అస్సలు వినలే.. అపుడు లవ్ సాంగ్స్ బాగా చూస్తుండే. ఆమె భయం ఆమెది. ఆ దెబ్బకు మొదలైన హాస్టల్ జీవితం చదువు అయ్యే వరకు నడిచింది.

తర్వాత ఊరుకెళ్లడం తగ్గించేశా. జాబ్ వచ్చిన తర్వాత ఓ రోజు ఊరికెళ్లా. నాకు ప్రేమ లేఖ రాసిన అమ్మాయి కనిపించింది. అప్పటికీ ఇంకా ఆమెకి కూడా పెళ్లి కాలేదు. నేరుగా పెళ్లి చేసుకుందామా అని అడిగేశా. ఆలోచించింది.. ఓకే చెప్పింది.. జాబ్ ఉండటంతో ఇంట్లో వాళ్లు కూడా అడ్డు చెప్పలేకపోయారు.

అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఆమె ప్రియమైన కౌశిక్ గారు మీరు రాసిన ఉత్తరం అందింది..అనే లేఖ రాసింది కదా. అసలు ఆమెకు ప్రేమ లేఖను నేను రాయలేదు. ఎవరో లవ్ లెటర్ రాస్తే.. నేను అనుకుని నాకు రిప్లై రాసింది. తనకు రాసింది ఎవరో మాత్రం నాకు ఇప్పటికీ తెలియదు. కానీ ఓ మంచి వ్యక్తిని నా జీవితంలోకి వచ్చేలా చేశాడు అతడు. ఆ ఆజ్ఞాత వ్యక్తి ఎవరో ఇప్పటికైనా చెప్పండయ్యా.. క్లాస్ లో ఉన్నది 9 మంది బాయ్స్ మాత్రమే. చాలా ఏళ్ళు అవుతుంది ఇప్పటికీ ఆ లెటర్ రాసింది ఎవరో ఇంకా తెలియలేదు. నేను కూడా ఆమెకి చెప్పలేదు.

ఆకర్శణగా మెుదలైన మా కథ.. పెళ్లిగా మారింది. అందరి జీవితాల్లో ఇలాగే జరగాలని లేదు. మాకు ప్రేమ మెుదలైనా.. ఉద్యోగం వచ్చేవరకూ దూరంగానే ఉన్నాం. ఏదో ఒకటి సాధిస్తే ఎన్ని రోజులైనా మనకు కావాల్సిన వాళ్లు మన దగ్గరకే వస్తారు.

ఆనంద్ సాయి మాదాసు

తదుపరి వ్యాసం