Narsingi Drugs Seize : టాలీవుడ్ హీరో లవర్ వద్ద డ్రగ్స్ సీజ్
Narsingi Drugs Seize : రంగారెడ్డి జిల్లా నార్సింగిలో ఓ యువతి వద్ద డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఆమె టాలీవుడ్ హీరో ప్రేయసిగా పోలీసులు గుర్తించారు.
Narsingi Drugs Seize : రంగారెడ్డి జిల్లా నార్సింగిలో డ్రగ్స్ కలకలం రేగింది. సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసుల దాడుల్లో లావణ్య అనే యువతి వద్ద డ్రగ్స్ పట్టుబడ్డాయి. లావణ్య టాలీవుడ్ హీరో లవర్ గా పోలీసులు గుర్తించారు. ఆమె వద్ద 4 గ్రాముల MDMA డ్రగ్స్ ను ఎస్వోటీ పోలీసులు సీజ్ చేశారు. NDPS యాక్ట్ కింద యువతిపై కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. MDMA డ్రగ్స్ గోవా నుంచి తీసుకొని వచ్చినట్లు సమాచారం. యువతి టాలీవుడ్ హీరో ప్రేయసిగా పోలీసులు గుర్తించారు. అయితే ఆ హీరో ఎవరు అనే విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. ఈ ఎండీఎంఏ డ్రగ్స్ ను గోవా నుంచి తీసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు. డ్రగ్స్ పట్టుపడిన ప్రతీసారి టాలీవుడ్ తో లింకులు ఉండడంతో గమనార్హం.
సదరు యువతి మ్యూజిక్ టీచర్‌గా పని చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు యువతిని అరెస్ట్ చేసి ఉప్పర్‌పల్లి కోర్టులో హాజరుపర్చారు. కోర్టు ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో యువతిని పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు.