తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Oils For Sleep: వాసనతో నిద్ర తెప్పించే నూనెలివే.. వాటిని ఎలా వాడాలంటే..

oils for sleep: వాసనతో నిద్ర తెప్పించే నూనెలివే.. వాటిని ఎలా వాడాలంటే..

08 May 2023, 20:00 IST

google News
  • oils for sleep: ప్రశాంతమైన నిద్రకు ఉపకరించే ఎసెన్షియల్ నూనెల గురించి తెలుసుకోండి.

నిద్ర
నిద్ర (pexels)

నిద్ర

ఎసెన్షియల్ నూనెల వల్ల నొప్పుడు తగ్గడం, ఆందోళన తగ్గడమే కాదూ వాటిని సరిగ్గా వాడితే మంచి నిద్ర మీ సొంతమవుతుంది. మంచి నిద్రకు సాయం చేసే కొన్ని ఎసెన్షియల్ నూనెలున్నాయి. వాటిని ఎలా వాడాలో ఏ నూనె వల్ల ఎలాంటి లాభముందో చూద్దాం.

ఎసెన్షియల్ నూనెలని ఎలా వాడాలి?

ఈ నూనెలని డిఫ్యూజర్ లో వేసుకోవచ్చు. దానివల్ల గదంతా పరిమళభరితం అవుతుంది. లేదంటే మీరు స్నానం చేసే నీటిలో రెండు చుక్కల నూనె వేసుకోవచ్చు. మీరు పడుకునే దిండ్ల మీద రెండు చుక్కల ఈ నూనెను రాసుకుంటే మంచి వాసన వస్తుంది. లేదా తలనొప్పి, ఒళ్లు నొప్పుల వల్ల నిద్ర పట్టకపోతే వీటిని నేరుగా కాకుండా కొబ్బరి నూనెలో కలిపి మర్దనా చేసుకోవచ్చు.

ఏ నూనెలు మంచివి?

ల్యావెండర్ నూనె:

దీని ప్రయోజనాలు బోలెడు. ఈ నూనె వాసన పీల్చడం వల్ల నిద్ర లేమి సమస్య తగ్గుతుందని తేలింది. దీన్ని స్నానం చేసే నీటిలో లేదా, నేరుగా వాసన పీల్చినా మంచిదే. నిద్రపట్టడమే కాదు దీని వల్ల ఆందోళన తగ్గుతుంది, నొప్పులున్నా తగ్గుముఖం పడతాయి.

చేమంతి నూనె:

చేమంతి నూనె వాసన వల్ల సుఖమైన నిద్ర సొంతమవుతుంది. అయితే దీన్ని నేరుగా ఒంటికి రాసుకోవడం కన్నా కూడా డిఫ్యూజర్ లో వాడితే దాని వాసన మరింత రెట్టింపవుతుంది. ఆ వాసన వల్ల ప్రశాంతంగా అనిపిస్తుంది.

గంధపు నూనె:

దీని ధర కాస్త ఎక్కువగా ఉండటం వల్ల దీన్ని తక్కువగా వాడతారు కానీ దీని ప్రయోజనాలు బోలెడు. దీనికి భావోద్వేగాలను నియంత్రిచే శక్తి ఉంది. ఈ వాసన చూడగానే ప్రశాంతంగా అనిపిస్తుంది. దానివల్ల ప్రశాంతంగా నిద్ర పడుతుంది. గుండె కొట్టుకునే వేగాన్ని, శ్వాస తీసుకునే రేటును నియంత్రణ లోకి తెచ్చి నిద్రపోయేలా చేస్తుంది. దీన్ని కూడా నేరుగా వాడకుండా డిఫ్యూజర్ లో వాడితే ఎక్కువ ప్రయోజనాలుంటాయి.

నీలగిరి నూనె:

నిద్ర సమస్యతో పాటూ శ్వాస సంబంధిత సమస్యని కూడా తగ్గస్తుందిది. కొంతమందికి నిద్రలో కఫం వస్తుంటుంది. దానివల్ల నిద్ర పట్టదు. ఈ సమస్య తరచూ వేదిస్తుంటుంది. అలాంటప్పుడు ఈ నూనె వాసన చక్కగా పనిచేస్తుంది.

ఈ నూనెలన్నీ మీరు సుఖమైన నిద్ర పొందేలా సాయపడతాయి. కానీ వీటితో పాటూ మీరు నిద్రలోకి జారాలంటే కొన్ని మార్పులు చేసుకోవాలి.

  1. నిద్ర విషయంలో క్రమ శిక్షణ అవసరం. రోజూ ఒకే సమయానికి నిద్ర పోవడం, నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి.
  2. పుస్తకాలు చదవటం, సంగీతం వినడం, వేడినీటి స్నానం వల్ల మంచి నిద్ర పడుతుంది.
  3. మీరు నిద్రపోయే గది వాతావరణం చల్లగా, చీకటిగా ఉండాలి.
  4. పరుపు, దిండ్లు మీకు సౌకర్యాన్ని ఇవ్వాలి
  5. నిద్రపోయే కన్నా కనీసం రెండు మూడు గంటల ముందే భోజనం చేసేయాలి.
  6. కాఫీ, టీ లకు రాత్రి పూట దూరంగా ఉండాలి.
  7. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.

టాపిక్

తదుపరి వ్యాసం