తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Baby Names: మీ పిల్లల కోసం ప్రత్యేకమైన అర్థవంతమైన పేర్లు, ఇవి ఏ కాలంలో అయిన ఎవర్ గ్రీన్ పేర్లే

Baby Names: మీ పిల్లల కోసం ప్రత్యేకమైన అర్థవంతమైన పేర్లు, ఇవి ఏ కాలంలో అయిన ఎవర్ గ్రీన్ పేర్లే

Haritha Chappa HT Telugu

11 October 2024, 14:00 IST

google News
  • Baby Names: మీ పిల్లలకు అందమైన, అర్థవంతమైన పేర్ల కోసం వెతుకుతున్నారా? ఇక్కడ మేము కొన్ని పేర్లు ఇచ్చాము. ఇవి ఎప్పటికీ పాతబడవు. ఏ కాలంలో అయినా ఇవి కొత్తగా, ప్రత్యేకంగా అనిపిస్తాయి. 

అందమైన పిల్లల పేర్లు
అందమైన పిల్లల పేర్లు (shutterstock)

అందమైన పిల్లల పేర్లు

మీ బిడ్డకు అర్థవంతమైన, ప్రత్యేకమైన పేరు పెట్టాలని ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది. పేరు వెతికేందుకు ఎంతో కష్టపడతారు కూడా. బిడ్డ పుట్టడానికి ముందే పేరు ఏం పెట్టాలా అని ఆలోచించడం మొదలుపెడతారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం, పిల్లల పేరు కూడా అతని వ్యక్తిత్వాన్ని, స్వభావాన్ని ప్రభావితం చేస్తుందని నమ్ముతారు. అందుకే కుటుంబంలో ప్రతి ఒక్కరూ పిల్లలకు ఒక పేరును ఎంచుకునేటప్పుడు చాలా శ్రద్ధ వహిస్తారు. మీరు కూడా మీ పిల్లల పేరు మిగిలిన పిల్లల కంటే భిన్నంగా, అర్థవంతంగా ఉండాలని కోరుకుంటే, ఈ బేబీ నేమ్ లిస్ట్ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక్కడిచ్చని పేర్ల జాబితాలో ప్రతి పేరుకు ప్రత్యేకమైన మరియు భిన్నమైన అర్థం ఉంది. ఇవి ఎప్పుడైనా కూడా ఎవర్ గ్రీన్ పేర్లు. పాతవి అనిపించవు. ఇవన్నీ కూడా ఎంతో మందికి నచ్చేవి. మీ పాపకు లేదా బాబుకు ఇందులోనుంచి ఒక అందమైన, అర్థవంతమైన పేరును ఎంపిక చేసుకోండి.

అబ్బాయిల పేర్లు

జైడెన్ - కృతజ్ఞత కలవాడు

ఆరవ్ - ఉరుము

అర్మాన్ - కోరిక

దక్ష్ - విలువైన వ్యక్తి

అయాన్ - దేవుని బహుమతి

కియాన్ - భగవంతుని దయ

మృదుల్ - మృదువైన మనసు కల వ్యక్తి

నిషాన్ - సంతకం చేయడం

రాజ్ వీర్ - ధైర్యవంతుడు

రిధాన్ - దేవుని బహుమతి

ఇషాన్ - సూర్యుడు

కపిల్ - సూర్యుడు

కయాన్ - నక్షత్రాలు

చిరాగ్ - దీపం

ఆకర్ష్ - ఆకర్షణీయమైన

దివిజ్ - స్వర్గంలో జన్మించిన బిడ్డ

విహాన్ - ఉదయం

ఆధవ్ - పాలకుడు

ఆదిష్ - వివేకంతో కూడిన వ్యక్తి

ఆదిరూప్ - మహాశివుడు

అమ్మాయిల పేర్లు

సహారా - మద్దతు

ఆశ్వి - ఆశీర్వాదం

నవీ - దయ

కిమాయ - దివ్యమైన

జోయా - జీవితం

జియానా - దేవుడి దయ

కియానా - కాంతి

మిషా - భగవంతుని పోలిక

మైరా - ప్రియమైన

నిహిరా - దొరికిన నిధి

భాను - కాంతి కిరణాలు

సమీరా - గాలి తరంగాలు

అహనా - సూర్యుని మొదటి కిరణం

జియా - జీవితం

అర్నా - లక్ష్మీ దేవి

కియారా - ప్రియమైన

మన్నత్ - ఏదైనా సాధించాలనే కోరిక

ఆధ్యాత్మ - ధ్యానం చేసే వ్యక్తి

అదీప్త - ప్రకాశవంతమైన వ్యక్తి

ఆహ్వా - ప్రియమైన వ్యక్తి

ఆహి - ఆత్మ

తదుపరి వ్యాసం