తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ugadi 2022 | ఉగాది గురించి చరిత్ర ఏమంటుంది.. మీకు తెలుసా?

Ugadi 2022 | ఉగాది గురించి చరిత్ర ఏమంటుంది.. మీకు తెలుసా?

HT Telugu Desk HT Telugu

31 March 2022, 12:13 IST

    • తెలుగు సంవత్సరాది. దీనిని యుగాది అని కూడా పిలుస్తారు. తెలుగు సంవత్సర ప్రారంభంలో మొదటి రోజున దీనిని జరుపుకుంటారు. కొత్త దుస్తుల నుంచి నోరూరించి వంటకాల వరకు ఉగాది పెట్టింది పేరు. ఉగాది కొత్త సంవత్సరం తాజాదనాన్ని... ప్రజలలో ఆనందాన్ని తెస్తుంది. మరి చరిత్ర ఉగాది గురించి ఏమి చెప్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉగాది 2022
ఉగాది 2022

ఉగాది 2022

Ugadi 2022 | తెలుగు సంవత్సరం ప్రారంభంలో మొదటి రోజున మనం ఉగాది జరపుకుంటారు. రాబోయే కొత్త సంవత్సరంలో ప్రజలు తప్పనిసరిగా అన్ని రుచులను అనుభవించాలని... జీవితంలోని మంచితనాన్ని పొందాలని ఉగాది పండుగ సూచిస్తుంది. అయితే ఉగాది గురించి మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలేంటో ఇప్పుడు చూద్దాం.

ట్రెండింగ్ వార్తలు

Bad Food Combinations: ఆయుర్వేదం ప్రకారం తినకూడని ఫుడ్ కాంబినేషన్లు ఇవే

Fatty liver in diabetics: ఫ్యాటీ లివర్.. డయాబెటిస్, ఊబకాయం ఉన్న వారిలో ఇది కామన్

Mutton Curry: పచ్చిమామిడి మటన్ కర్రీ స్పైసీగా వండుకుంటే అదిరిపోతుంది

Ayurvedam Tips: నానబెట్టిన కిస్‌మిస్‌లు, కుంకుమ పువ్వును కలిపి తినమని చెబుతున్న ఆయుర్వేదం, అలా తింటే ఏం జరుగుతుందంటే

ఉగాది చరిత్ర

హిందూ పురాణాల ప్రకారం.. బ్రహ్మ దేవుడు ఉగాది రోజున విశ్వ సృష్టిని ప్రారంభించాడని నమ్ముతారు. దుర్గామాత తొమ్మిది రూపాలను జరుపుకునే తొమ్మిది రోజుల పండుగలో మొదటి రోజు - చైత్ర నవరాత్రే. బ్రహ్మ దేవుడు మానవజాతి సృష్టికి నాంది పలికినందుకు గుర్తుగా ఉగాదిగా జరుపుకుంటారు. 12వ శతాబ్దంలో.. భారతీయ గణిత శాస్త్రవేత్త భాస్కరాచార్య ఉగాదిని తెలుగువారికి కొత్త సంవత్సరం, కొత్త నెల, కొత్త రోజుగా గుర్తించారు.

ఉగాది ప్రాముఖ్యత

యుగాది అంటే ఒక సంవత్సరం ప్రారంభం. యుగం అంటే కాలం. ఆది అంటే ఏదో ప్రారంభం. ఉగాది విశ్వాన్ని సృష్టించడానికి బ్రహ్మ దేవుడు చేసిన కృషిని సూచిస్తుంది. శీతాకాలంలోని కఠినమైన చలి తర్వాత, వసంతకాలం ప్రారంభం, తేలికపాటి వాతావరణాన్ని సూచించే పండుగ కూడా దీనిని పరిగణిస్తారు. ఈ సంతోషకరమైన సందర్భాన్ని... మన దగ్గరి, ప్రియమైన వారితో ఆనందంగా కలిసిమెలిసి జరుపుకుంటారు.

ఉగాది ఎలా జరుపుకుంటారంటే..

పండుగకు వారం రోజుల ముందు నుంచే ఉగాది వేడుకలకు సన్నాహాలు ప్రారంభమవుతాయి. ప్రజలు తమ ఇళ్లను శుభ్రం చేసి కొత్త బట్టలు కొనుగోలు చేస్తారు. గృహ ద్వారబంధాలను మామిడి ఆకులతో అలంకరిస్తారు. పండుగ రోజున ప్రజలు తమ ఇంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆవు పేడతో కలిపిన నీటిని చల్లుతారు. అనంతరం ముగ్గులు వేసి పువ్వులు, రంగులతో అలంకరిస్తారు. స్నానాలు చేసి.. కొత్తబట్టలు ధరించి దేవుళ్లకు పూజలు చేసి.. నూతన సంవత్సరానికి స్వాగతం పలికుతారు. ఉగాది పచ్చడితో పండుగను ప్రారంభించి.. రకరకాల పిండివంటలు చేసుకుంటారు. బంధువులు, స్నేహితులతో కలిసి ఆనందంగా గడుపుతారు.

తదుపరి వ్యాసం