తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  అనుకున్నది దక్కలేదా? అయితే బాధపడకండి.. ఇంకా మంచిదేదో మీకు రాసిపెట్టి ఉంది..

అనుకున్నది దక్కలేదా? అయితే బాధపడకండి.. ఇంకా మంచిదేదో మీకు రాసిపెట్టి ఉంది..

HT Telugu Desk HT Telugu

17 May 2022, 6:30 IST

google News
    • మన జీవితంలో కొన్ని విషయాల కోసం చాలా ఎదురు చూస్తాం. అవి మన దగ్గరకు వచ్చినట్టే వచ్చి.. దూరమైపోతాయి. కానీ ఆ సమయంలో మనం ఓడిపోయామని బాధపడకూడదు. అది మన దురదృష్టమని.. అదృష్టమనేది మనకి లేదని ఆలోచించకూడదు. మనకి దీనికన్నా మంచిదేదో రాసి పెట్టి ఉంది కాబట్టే ఇప్పుడు అది మనకి దక్కలేదు అనుకోవాలి.
మంచిదేదో రాసి పెట్టి ఉంది
మంచిదేదో రాసి పెట్టి ఉంది

మంచిదేదో రాసి పెట్టి ఉంది

Tuesday Quote | కొన్నిసార్లు మీరు చాలా బలంగా కోరుకున్నవి.. దగ్గరకు వచ్చి.. మీకు ఆశపుట్టించి.. అందనంత దూరానికి వెళ్లిపోవచ్చు. ఏదైనా సాధించాలని కోరికతో మనం చాలా కష్టపడుతూ ఉంటాం. ఎంత ప్రయత్నించినా.. అది మనకి దక్కకపోవచ్చు. ఆ సమయంలో కృంగిపోతూ.. మనకి అదృష్టం లేదు... మన దరిద్రమే ఇంత అని బాధపడకూడదు. అలా చింతించకుండా.. వాస్తవాన్ని అంగీకరించి.. ఇంతకన్నా మంచిదేదో మనకి రాసిపెట్టి ఉందని అనుకోవాలి.

మీపై, మీ సామర్థ్యాలపై విశ్వాసాన్ని కొనసాగించాలి. ఏదైనా మీకు అందకుండా పోయినప్పుడు.. దానిని వదిలేయండి. ఇది మన కోసం ఉద్దేశించినది కాదు అనుకుని.. ఇంకా గొప్పది ఏదో మనకి వస్తోందని అనుకోవాలి. మెరుగైన ఫలితాలు పొందటానికి మీరు అర్హులని గుర్తించుకోవాలి. మీకు రాసిపెట్టి ఉంటే అవి మీ వద్దకు వస్తాయి. రానివాటి గురించి ఆలోచించి బుర్రపాడు చేసుకోకండి. సహనంతో.. తగినంత విశ్వాసంతో ముందుకు సాగండి. మీపై, దేవుడిపై విశ్వాసం కలిగి ఉండండి. విషయాలు వాటంతట అవే వస్తాయి.

టాపిక్

తదుపరి వ్యాసం