తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Top Smart Phones | స్మార్ట్ ఫోన్ కొనాలి అనుకుంటున్నారా? అయితే టాప్ 5 ఇవే..

Top Smart Phones | స్మార్ట్ ఫోన్ కొనాలి అనుకుంటున్నారా? అయితే టాప్ 5 ఇవే..

HT Telugu Desk HT Telugu

15 April 2022, 9:20 IST

    • మీరు స్మార్ట్ ఫోన్​ కొనాలి అనుకుంటున్నారా? అయితే మీకోసం మార్కెట్లలో చాలా ఆప్షన్లు ఉన్నాయి. వాటిలో బెస్ట్ ఏంటో తేల్చుకోలేకపోతున్నారా? వాటి ఫీచర్లు, ధరలు గురించి సరైనా అవగాహన లేదా? అయితే మీ ముందుకు మేము టాప్ 5 స్మార్ట్ ఫోన్స్​ను తీసుకువచ్చాం. ఈ స్మార్ట్​ ఫోన్స్​పై మీరు లుక్కేసి.. ఏది బెస్టో.. దానిని సెలక్ట్ చేసుకోండి.
టాప్ 5 స్మార్ట్ ఫోన్స్
టాప్ 5 స్మార్ట్ ఫోన్స్

టాప్ 5 స్మార్ట్ ఫోన్స్

Samsung Galaxy S22 Ultra: 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్​తో, శాంసంగ్ గెలాక్సీ ఎస్22 ఆల్ట్రా 4ఎన్ఎమ్ క్వాల్​కామ్ స్నాప్​డ్రాగన్ 8 జనరేషన్ 1 ఆక్టా-కోర్ ప్రాసెసర్​తో రూపొందించారు. ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఇది దాదాపు 1.5 రోజుల పాటు ఉంటుంది. అంతేకాకుండా 45డబ్ల్యూ పవర్ అడాప్టర్‌తో ఫోన్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను కూడా అనుమతిస్తుంది. డిస్​ప్లే విషయానికి వస్తే, ఇది క్వాడ్ హెచ్​డీ+ రిజల్యూషన్, 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో 6.8-అంగుళాల డైనమిక్ ఆమ్​లెడ్ 2ఎక్స్ స్క్రీన్‌ను కలిగి ఉంది. దీనిని అల్యూమినియం ఫ్రేమ్​తో తయారు చేశారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ దీనికి మరింత రక్షణ ఇస్తుంది. 100ఎక్స్ డిజిటల్ జూమ్‌తో కూడిన క్వాడ్-కెమెరా సెటప్‌తో.. ఎస్​ పెన్‌తో వస్తుంది. బుర్గుండి, ఫాంటమ్ వైట్, ఫాంటమ్ బ్లాక్.. ఈ మూడు కలర్ వేరియంట్‌లలో లభిస్తుంది. దీని ధర రూ. 1,34,999.

ట్రెండింగ్ వార్తలు

Duck Egg Benefits : వారానికో బాతు గుడ్డు తినండి.. ఆరోగ్యంగా ఉండండి

Kakarakaya Ullikaram: మధుమేహుల కోసం కాకరకాయ ఉల్లికారం కర్రీ, వేడివేడి అన్నంలో కలుపుకుంటే ఒక్క ముద్ద కూడా మిగల్చరు

Morning Habits : ఉదయం ఈ 5 అలవాట్లు చేసుకుంటే ఒక్క నెలలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది

Godhuma Laddu: పిల్లలకు బలాన్నిచ్చే గోధుమ పిండి లడ్డూలు, ఇలా సులువుగా చేసేయండి

iPhone SE 3: యాపిల్ ఐ ఫోన్ ఎస్​ఈ ఒక కాంపాక్ట్, మన్నికైన డిజైన్‌తో వస్తుంది. ఐ ఓఎస్ 15తో కలిపి.. కట్స్​ లేని అనుభవాన్ని అందిస్తుంది. కొత్త ఐఫోన్ ఎస్​ఈ ఏ15 బయోనిక్, 5జీ, ఎక్కువ బ్యాటరీ జీవితం వంటి మొదలైన వాటి పనితీరుతో సహా అప్‌గ్రేడ్‌లను కలిగి ఉంది. ఇది మూడు రంగు ఎంపికలలో వస్తుంది. ఫోన్ 4.7-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఏరోస్పేస్-గ్రేడ్ అల్యూమినియం, గ్లాస్ డిజైన్‌ను కలిగి ఉంది. నీరు, ధూళి నిరోధకత కోసం ఐపీ67గా కూడా రేట్ చేశారు. ఈ ఫోన్ వైర్‌లెస్ ఛార్జింగ్ కోసం క్యూఐ-సర్టిఫైడ్ ఛార్జర్‌లకు అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది. ఐఫోన్ 12 ఎంపీ వెడల్పు కెమెరాను కలిగి ఉంటుంది. 64జీబీ, 128జీబీ, 256జీబీ మోడళ్లలో అందుబాటులో ఉంది. ప్రారంభ ధర రూ. 43,900.

Xiaomi 11T Pro 5G: షియోమి 11టి ప్రో 5జీ క్వాల్​కామ్ స్నాప్​డ్రాగన్ 888 ప్రాసెసర్‌ ఆధారితం. ఇది 6.67-అంగుళాల ఆమ్​లెడ్​ హెచ్​డీఆర్ 10+ డిస్‌ప్లేతో వస్తుంది. 8జీబీ+128జీబీ, 8జీబీ+256జీబీ, 12జీబీ+256జీబీ ర్యామ్, స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. 120డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఫోన్ 108ఎంపీ ట్రిపుల్ కెమెరా సిస్టమ్‌ను కూడా అందిస్తుంది. సెలెస్టియల్ బ్లూ, మూన్‌లైట్ వైట్, మెటోరైట్ బ్లాక్ కలర్స్​లలో అందుబాటులో ఉంది. దీని ధర రూ. 39,999.

iPhone 13 Pro Max: ఫోన్ 6.7-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్​డీఆర్ డిస్‌ప్లే, యాపిల్ ఏ15 బయోనిక్ ప్రాసెసర్, 3ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో కూడిన కెమెరా సిస్టమ్‌తో వస్తుంది. ఈ ఫోన్ 128జీబీ, 256జీబీ, 512జీబీ, 1టీబీ స్టోరేజ్ ఆప్షన్‌లలో లభిస్తుంది. సియెర్రా బ్లూ, గ్రాఫైట్, గోల్డ్, సిల్వర్, ఆల్పైన్ గ్రీన్ కలర్ వేరియంట్‌లలో ఎంచుకోవచ్చు. దీని ధర రూ. 1,19,900.

Realme GT 2 Pro: రియల్​మీ జీటీ 2 ప్రో పేపర్ టెక్ మాస్టర్ డిజైన్‌తో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ని కలిగి ఉంది. ఇది 8జీబీ, 12జీబీ ర్యామ్ వేరియంట్లలో లభిస్తుంది. అదేవిధంగా 128 జీబీ, 256జీబీ అంతర్గత స్టోరేజ్​తో కూడా అందుబాటులో ఉంది. 6.7-అంగుళాల డిస్‌ప్లే, 50ఎంపీ + 50ఎంపీ ప్రైమరీ కెమెరా సిస్టమ్‌ను కూడా కలిగి ఉంది. రియల్​మీ జీటీ 2 ప్రో పేపర్ గ్రీన్, పేపర్, స్టీల్ బ్లాక్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. దీని ధర రూ. 49,999.

టాపిక్

తదుపరి వ్యాసం