తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Bathukamma Songs 2023 : శ్రీలక్ష్మీదేవి ఉయ్యాలో.. సృష్టి బతుకమ్మయ్యే ఉయ్యాలో..

Bathukamma Songs 2023 : శ్రీలక్ష్మీదేవి ఉయ్యాలో.. సృష్టి బతుకమ్మయ్యే ఉయ్యాలో..

Anand Sai HT Telugu

15 October 2023, 8:00 IST

google News
    • Bathukamma Songs 2023 : బతుకమ్మ పాటలు వినేందుకు హాయిగా అనిపిస్తుంది. మనకు తెలియని బతుకమ్మ పాటలు ఎన్నో ఉన్నాయి. అలాంటివాటిని మీకోసం సేకరిస్తోంది HT Telugu. అందులో భాగంగా శ్రీలక్ష్మీదేవి ఉయ్యాలో పాట మీ కోసం..
బతుకమ్మ పాటలు
బతుకమ్మ పాటలు

బతుకమ్మ పాటలు

బతుకమ్మ ఆడుతుంటే ఉయ్యాల పాటలకు ఉన్న ప్రత్యేకతే వేరు. ఉయ్యాల పాటల్లోనూ చాలా ఉన్నాయి. అందులో కొన్ని మీ కోసం అందిస్తున్నాం. బతుకమ్మ సందర్భంగా ఆడపడుచులు ఈ పాట పాడుతూ.. బతుకమ్మ ఆడొచ్చు. అందులో భాగంగా శ్రీలక్ష్మీదేవి ఉయ్యాలో పాట మీ కోసం..

శ్రీలక్ష్మీదేవి ఉయ్యాలో..

సృష్టి బతుకమ్మయ్యే ఉయ్యాలో..

ధరచోళ దేశమున ఉయ్యాలో..

ధర్మాంగుడనురాజు ఉయ్యాలో..

అతివ సత్యవతి ఉయ్యాలో..

నూరు నోములు నోమి ఉయ్యాలో..

నూరు మంది గాంచె ఉయ్యాలో..

వారు శూరులయ్యు ఉయ్యాలో..

వైరులచే హతమైరి ఉయ్యాలో..

తల్లిదండ్రులపుడు ఉయ్యాలో..

తరగ శోఖమున ఉయ్యాలో..

తన రాజ్యములుబాసి ఉయ్యాలో..

దాయాదులను బాసి ఉయ్యాలో..

వనితతో ఆ రాజు ఉయ్యాలో..

వనమందు వసించే ఉయ్యాలో..

కలికి లక్ష్మి గూర్చి ఉయ్యాలో..

ఘనతపం బొనరించె ఉయ్యాలో..

ప్రత్యక్షమై లక్ష్మి ఉయ్యాలో..

పలికె వరమడుగమనే ఉయ్యాలో..

వినుతించి వేడుచు ఉయ్యాలో..

వెలది తన గర్భమున ఉయ్యాలో..

పుట్టుమని వేడగా ఉయ్యాలో..

పూబోణిమది మెచ్చి ఉయ్యాలో..

సత్యవతి గర్భమున ఉయ్యాలో..

జన్మించే శ్రీలక్ష్మి ఉయ్యాలో..

అంతలో మునులునూ ఉయ్యాలో..

అక్కడకి వచ్చిరీ ఉయ్యాలో..

కపిల గాలవులునూ ఉయ్యాలో..

కశ్యపాంగీరసలు ఉయ్యాలో..

అత్రివశిష్ఠులూ ఉయ్యాలో..

ఆ కన్నియను జూచి ఉయ్యాలో..

బ్రతకగనె ఈ తల్లి ఉయ్యాలో..

బ్రతుకమ్మయనిరంత ఉయ్యాలో..

తానుధన్యుండంచు ఉయ్యాలో..

తన బిడ్డతో రాజు ఉయ్యాలో..

నిజపట్టణము కేగి ఉయ్యాలో..

నేల పాలించగ ఉయ్యాలో..

శ్రీమహవిషుండు ఉయ్యాలో..

చాక్రాంకడను పేర ఉయ్యాలో..

రాజు వేషంబున ఉయ్యాలో..

రాజు ఇంటికి వచ్చి ఉయ్యాలో..

ఇల్లరికమ వుండి ఉయ్యాలో..

పెండ్లాడి కొడుకలా ఉయ్యాలో..

ఆరువేలమంది ఉయ్యాలో..

అతిసుందరాంగులు ఉయ్యాలో..

ధర్మాంగుడనురాజు ఉయ్యాలో..

తన భార్య సత్యవతి ఉయ్యాలో..

సరిలేరు సిరులతో ఉయ్యాలో..

సంతోషమెుందిరి ఉయ్యాలో..

జగతిపై బతుకమ్మ ఉయ్యాలో..

శాశ్వతంబుగ నిలిచే ఉయ్యాలో..

తదుపరి వ్యాసం