Bathukamma Songs With Lyrics : కలవారి కోడలు ఉయ్యాలో.. మీ కోసం టాప్ 3 ఉయ్యాల పాటలు
15 October 2023, 9:30 IST
- Bathukamma Songs Lyrics : బతుకమ్మ సందర్భంగా ఉయ్యాల పాటలకు చాలా వినిపిస్తాయి. ఆడపడుచుల నోట ఉయ్యాల పాటలు వస్తుంటాయి. ఆ పాటల్లో మీ కోసం మూడు పాటలు సేకరించింది HT Telugu.
బతుకమ్మ పాటలు
ఆడపడుచులు బతుకమ్మ ముందు ఉయ్యాల పాటలు పాడుతుంటే చెప్పలేని ఆనందం కలుగుతుంది. ఒక్కరు పాడుతుంటే.. మిగిలిన వాళ్లు కలిపి పాడుతుంటే.. ఊరంతా వినిపిస్తుంది. అలాంటి బతుకమ్మ పాటలు మీ కోసం..
మెుదటి పాట
శ్రీరాముని తల్లి ఉయ్యాలో శ్రీమతి కౌసల్య ఉయ్యాలో..
ప్రేమతో శాంతను ఉయ్యాలో పిలిచి దగ్గర తీసి ఉయ్యాలో..
నా తల్లి శాంతమమ ఉయ్యాలో నా ముద్దులపట్టి ఉయ్యాలో..
అత్తవారింటికి ఉయ్యాలో ఆనందముగా పొమ్ము ఉయ్యాలో..
అత్తమామ సేవ ఉయ్యాలో ఉత్తమంగా చెయ్యి ఉయ్యాలో..
భర్తను సేవించ ఉయ్యాలో వైకుంఠంబున ఉయ్యాలో..
వారిపైన ప్రేమ ఉయ్యాలో వాసుదేవుడి పూజ ఉయ్యాలో..
పేదరికము చూసి ఉయ్యాలో ప్రీతి తప్పకు తల్లి ఉయ్యాలో..
కలిగి ఉన్నంతల ఉయ్యాలో కనిపెట్టి తిరగాలి ఉయ్యాలో..
ఇరుగు పొరుగిండ్లకు ఉయ్యాలో తిరగబోకోయమ్మ ఉయ్యాలో..
అందుకే ముందుగా ఉయ్యాలో ఆలోచనుండాలి ఉయ్యాలో..
ఏది చూసిన గాని ఉయ్యాలో ఏది చేసినగాని ఉయ్యాలో..
చేసే పనులందు ఉయ్యాలో చిత్తంబు నిలపాలి ఉయ్యాలో..
పని చెడినంక ఉయ్యాలో చింతించి ఫలమేమి ఉయ్యాలో..
మాట జారిన వెనక ఉయ్యాలో మరితిరిగి రాదమ్మ ఉయ్యాలో..
అందుకే ముందుగా ఉయ్యాలో ఆలోచనుండాలి ఉయ్యాలో..
అపకీర్తితోను ఉయ్యాలో బతికి ఫలమేమి ఉయ్యాలో..
సాధు సత్పురుషులు ఉయ్యాలో సమయానికేతెంచు ఉయ్యాలో..
అన్నపానాదుల ఉయ్యాలో ఆదరించుము తల్లి ఉయ్యాలో..
అత్తవారింటికి ఉయ్యాలో అమ్మవారింటికి ఉయ్యాలో..
మంచిపేరు తెమ్ము ఉయ్యాలో మా తల్లి శాంతమ్మ ఉయ్యాలో..
కొడుకులు బిడ్డలు ఉయ్యాలో కొమరొప్పకలగని ఉయ్యాలో..
నిండు ముత్తైదువై ఉయ్యాలో ఉండవమ్మ తల్లి ఉయ్యాలో..
మంచి పేరు తెమ్ము ఉయ్యాలో మా తల్లి శాంతమ్మ ఉయ్యాలో..
కొడుకులు బిడ్డలు ఉయ్యాలో కొమరొప్ప కలగని ఉయ్యాలో..
నిండు ముత్తైదువ ఉయ్యాలో ఉండవమ్మ తల్లి ఉయ్యాలో..
రెండో పాట
ఆటగూటం మీద ఉయ్యాలో..
అయోధ్యలోన ఉయ్యాలో..
అలసొచ్చె లక్ష్మణుడు ఉయ్యాలో..
ఆటలాడి వచ్చే ఉయ్యాలో..
ఆటలాడి వచ్చే ఉయ్యాలో..
అలసి సొలసి వచ్చే ఉయ్యాలో..
వదినె దాహమని ఉయ్యాలో..
సీత చెంతకు పాయె ఉయ్యాలో..
ఏమని అనదాయె ఉయ్యాలో...
మా తల్లి సీతమ్మ ఉయ్యాలో..
అటు నుంచి లక్ష్మణుడు ఉయ్యాలో..
అన్న వద్దకు పాయె ఉయ్యాలో..
అలిగున్న రాముడు ఉయ్యాలో..
ఏమని అనడాయె ఉయ్యాలో..
సీతారాముల మధ్యన ఉయ్యాలో..
వాదంబూలాయెనె ఉయ్యాలో..
యోచించి లక్ష్మణుడు ఉయ్యాలో..
చిలుక చెంతకు పాయె ఉయ్యాలో..
చిలుకరో చిలుక ఉయ్యాలో..
వాదమాయె చిలుక ఉయ్యాలో..
మీ అమ్మ మీ నాన్న ఉయ్యాలో..
అలగినారమ్మ ఉయ్యాలో..
అలకలు తీర్చవే ఉయ్యాలో..
ఓ రామ చిలుక ఉయ్యాలో..
నీ చిన్ని ముక్కుకు ఉయ్యాలో..
ముక్కెర చేయిస్త ఉయ్యాలో..
నీ చిన్న రెక్కలకు ఉయ్యాలో..
వెండి పోయిస్తా ఉయ్యాలో..
నీ చిన్న కాళ్లకు ఉయ్యాలో..
గజ్జెలేయిస్తా ఉయ్యాలో..
నువ్వు పోయె తోవల్ల ఉయ్యాలో..
శెనగ నాటిస్తా ఉయ్యాలో..
శెనగ తిని చేయి కడగ ఉయ్యాలో..
చెలిమె తవ్విస్త ఉయ్యాలో..
మూడో పాట
కలవారి కోడలు ఉయ్యాలో..
కనక మహాలక్ష్మి ఉయ్యాలో..
కడుగుతున్నది ఉప్పు ఉయ్యాలో..
కడవళ్లోన పోసి ఉయ్యాలో..
అప్పుడే వచ్చేను ఉయ్యాలో..
ఆమె పెద్దన్న ఉయ్యాలో..
కాళ్లకు నీళ్లిచ్చి ఉయ్యాలో..
కన్నీళ్లు దీసి ఉయ్యాలో..
ఎందుకు సెల్లెలా ఉయ్యాలో..
ఏమి కష్టాలమ్మా ఉయ్యాలో..
తుడుచుకో కన్నీళ్లు ఉయ్యాలో..
ముడుచుకో కురులమ్మ ఉయ్యాలో..
ఎత్తుకో బిడ్డాను ఉయ్యాలో..
వెళ్లి వద్దాము ఉయ్యాలో..
చేరిమి వారితో ఉయ్యాలో..
చెప్పిరా పోవమ్మా ఉయ్యాలో..
పట్టె మంచ మీద ఉయ్యాలో..
పవళించినామా ఉయ్యాలో..
మాయన్నల వచ్చిరి ఉయ్యాలో..
మమ్ము పంపుతారా ఉయ్యాలో..
నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో..
అరుగుల్ల కూసున్న ఉయ్యాలో..
ఓ అత్తగారు ఉయ్యాలో..
మా అన్నలు వచ్చిరి ఉయ్యాలో..
మమ్ము పంపుతారా ఉయ్యాలో..
నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో..
మీ బావను అడుగు ఉయ్యాలో..
భారతం చదివేటి ఉయ్యాలో..
బావ పెద్ద బావ ఉయ్యాలో..
మా అన్నలు వచ్చిరి ఉయ్యాలో..
మమ్ము పంపుతారా ఉయ్యాలో..
నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో..
మీ అక్కను అడుగు ఉయ్యాలో..
వంటశాలలో ఉన్న ఉయ్యాలో..
ఓ అక్క గారూ ఉయ్యాలో..
మా అన్నలు వచ్చిరి ఉయ్యాలో..
మమ్ము పంపుతారా ఉయ్యాలో..
నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో..
నీ భర్తనే అడుగు ఉయ్యాలో..
రచ్చలో కూర్చున్న ఉయ్యాలో..
రాజేంద్రబోగి ఉయ్యాలో..
మా అన్నలు వచ్చిరి ఉయ్యాలో..
మమ్ము పంపుతారా ఉయ్యాలో..
కట్టుకో చీరలు ఉయ్యాలో..
పెట్టుకో సొమ్ములు ఉయ్యాలో..
ఎత్తుకో బిడ్డను ఉయ్యాలో..
వెళ్లి రా ఊరికి ఉయ్యాలో..
పుట్టినింటికి నీవు ఉయ్యాలో..
శుభముగా పోయిరా ఉయ్యాలో..
మెట్టినింటికి నీవు ఇయ్యాలో..
క్షేమంగా తిరిగి రా ఉయ్యాలో..
మెట్టినింటికి నీవు ఉయ్యాలో..
క్షేమంగా తిరిగి రా ఉయ్యాలో..