తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ghee Rice Recipe : గీ రైస్ ఇలా వండితే సూపర్ టేస్టీ.. వదలకుండా తింటారు

Ghee Rice Recipe : గీ రైస్ ఇలా వండితే సూపర్ టేస్టీ.. వదలకుండా తింటారు

Anand Sai HT Telugu

19 February 2024, 11:00 IST

    • Ghee Rice Recipe In Telugu : నెయ్యి ఆరోగ్యానికి చాలా మంచిది. దీనితో రైస్ వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. లొట్టలేసుకుంటూ తింటారు.
గీ రైస్ తయారీ విధానం
గీ రైస్ తయారీ విధానం (Unsplash)

గీ రైస్ తయారీ విధానం

నెయ్యి తింటే చాలా ప్రయోజనాలు దక్కుతాయి. అయితే దీనిని వంటలో కలిపి చేస్తే అదిరిపోతుంది. ఎప్పుడూ ఒకేలాగా మధ్యాహ్నం భోజనం తింటే.. బోర్ కొడుతుంది అనుకునేవారు గీ రైస్ చేసుకోండి. చేయడం చాలా ఈజీగా ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది చిన్న పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.

ట్రెండింగ్ వార్తలు

Baby First Bath : శిశువుకు మెుదటిసారి స్నానం చేయించేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు

Single Reasons : మీరు సింగిల్‌గా ఉండడానికి ఈ 5 అంశాలు కారణం కావొచ్చు

Brinjal Chutney : 4 వంకాయలు ఉడకబెట్టి ఇలా చట్నీ చేస్తే.. ఎంతో ఇష్టంగా తింటారు

Ginger Garlic Paste: అల్లం వెల్లుల్లి కలిపి పేస్ట్ చేయడం మంచి పద్ధతి కాదా? పోషకాలు తగ్గుతాయా?

నెయ్యి రైస్‌లో మసాలాలు, ఉల్లిపాయలు, జీడిపప్పు, ఎండుద్రాక్షలు కూడా వేసుకోవచ్చు. మీరు ఈ గీ రైస్‌ని రెండు రకాలుగా ఆస్వాదించవచ్చు. దీన్ని అలాగే తినవచ్చు లేదా సోయా చంక్స్‌తో తినవచ్చు. అయితే ఈ రకం అన్నం మీకు తినాలి అనిపిస్తూ ఉంటుంది. పలావ్ ఆకులు, జీలకర్ర వంటి మసాలా దినుసులు ఈ వంటకాన్ని మరింత రుచికరంగా చేస్తాయి. ఈ మసాలా గీ రైస్ తయారు చేయడం సులభం. గీ రైస్ ఎలా తయారు చేయాలో, తయారీకి కావలసిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం..

గీ రైస్‌కు కావాల్సిన పదార్థాలు

నెయ్యి - 2 టెబుల్ స్పూన్లు

బియ్యం - 1 ½ కప్పు

జీలకర్ర - 1 టెబుల్ స్పూన్

పలావ్ ఆకు - 3

జీడిపప్పు - 3 టెబుల్ స్పూన్లు

కరివేపాకు-కొద్దిగా

పచ్చిమిర్చి - 4 లేదా 5

పచ్చి బఠానీలు - ½ కప్పు

ఉల్లిపాయలు - 2 (తరిగినవి)

ఉప్పు-రుచికి సరిపడా

పసుపు - 1 టెబుల్ స్పూన్

గీ రైస్ తయారీ విధానం

ఓ గిన్నెలో 1½ టేబుల్ స్పూన్ నెయ్యి జోడించండి. తర్వాత అందులో జీడిపప్పు వేసి కాస్త బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.

తర్వాత ఎండుద్రాక్ష కూడా జోడించండి. అవి సరిగ్గా వేయించిన తర్వాత, దానిని తీసి పక్కన పెట్టండి.

అందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయను వేసి గోధుమరంగు రంగు వచ్చేవరకు వేయించాలి.

తర్వాత సగం (½) చెంచా నెయ్యి వేయాలి. పలావ్ ఆకు, జీలకర్ర, లవంగాలు, ఏలకులు జోడించండి.

ఒక నిమిషం వేయించాలి. తర్వాత అందులో 2 పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ముందుగా వేయించుకున్నవన్నీ అందులో వేసుకోవాలి.

బియ్యాన్ని ముందుగా కడుక్కోవాలి. సుమారు 3 నుండి 4 నిమిషాలు అందులో వేయించాలి.

తర్వాత బియ్యానికి సరిపడా నీరు పోయాలి. తర్వాత బాగా కలపాలి.

బియ్యం పూర్తిగా మూతపెట్టి ఉడికించాలి. అంతే వేడి వేడి గీ రైస్ రెడీ.

తదుపరి వ్యాసం