తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Masala Tea Recipe : మనసును రిఫ్రెష్ చేయాలంటే.. మసాలా టీ తాగాల్సిందే..

Masala Tea Recipe : మనసును రిఫ్రెష్ చేయాలంటే.. మసాలా టీ తాగాల్సిందే..

13 September 2022, 7:11 IST

    • Masala Tea Recipe : టీ అనేది ఓ ఎమోషన్. ఆడ, మగ.. చిన్నా, పెద్దా తేడా లేకుండా.. అందరూ దీనికి బానిసలనే చెప్పవచ్చు. మీరు టీ ప్రియులైతే దీని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే మీ సాధారణ టీని ఈ చల్లని వాతావరణంలో మసాలా టీతో రిప్లేస్ చేయండి. మీరు ఎంజాయ్ చేయడం పక్కా. 
మసాలా టీ
మసాలా టీ

మసాలా టీ

Masala Tea Recipe : టీ గురించి తెలిసిన వారికి.. మసాలా టీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు దానిని ట్రై చేయకపోయినా కచ్చితంగా ఏదొక సందర్భంలో దాని గురించి వినే ఉంటారు. అయితే మీరు ఈ చల్లని వాతావరణంలో వేడి వేడి మసాలా టీని ఈజీగా తయారు చేసుకుని.. హ్యాపీగా ఆరగించేయండి. ఎందుకంటే దీనిలో ఉండే మసాలాలు మిమ్మల్ని సీజనల్ వ్యాధుల నుంచి మిమ్మల్ని కాపాడుతాయి. అంతేకాకుండా దీని టేస్ట్ అదిరిపోతుంది కూడా. మీ బ్రేక్​ఫాస్ట్​ని ఈ అద్భుతమైన పానీయంతో నింపేయాలి అనుకుంటున్నారా? అయితే దీనిని ఎలా తయారు చేసుకోవాలి.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

* ఏలకులు

* దాల్చిన చెక్క

* సోంపు

* మంచినీళ్లు

* టీ పొడి

* పంచదార

* పాలు

తయారీ విధానం

లవంగాలు, దాల్చినచెక్క, ఏలకులు, సోంపు వంటి మసాలా దినుసులను సమాన పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు ఓ పాన్ తీసుకుని స్టౌవ్ వెలిగించి.. ఈ మసాలా దినుసులను వేసి వేయించాలి. అవి కొంచెం చల్లారాక.. మిక్సీలో వేసి మంచిగా గ్రైండ్ చేయాలి. ఈ పొడిని ఓ కంటైనర్లో స్టోర్ చేసుకోండి.

ఇప్పుడు మీరు స్టౌవ్ వెలిగించి.. టీ కోసం ఓ గిన్నే తీసుకుని.. స్టౌవ్ మీద ఉంచండి. దానిలో కొన్ని నీరు పోసి.. ఓ చెంచా మసాలా పౌడర్ వేసి మరిగించండి. దానిలో టీపొడి వేసి మరిగించండి. దాని నుంచి సువాసన వస్తున్నప్పుడు పాలు పంచదార వేసి మరోసారి పొంగనివ్వండి. అంతే మీ మసాలా చాయ్ రెడీ అయిపోయినట్లే. దీనిని మీరు అలానే తాగేయవచ్చు. లేదా ఉస్మానియా బిస్కెట్లు, రస్కులు, బ్రెడ్ వంటి వాటితో తీసుకోవచ్చు.

తదుపరి వ్యాసం