Boiled Egg Omelette : ఉడకబెట్టిన ఎగ్స్​తో ఆమ్లెట్.. టేస్ట్ అదిరిపోతుంది..-today breakfast recipe is boiled egg omelette here is the making process ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Today Breakfast Recipe Is Boiled Egg Omelette Here Is The Making Process

Boiled Egg Omelette : ఉడకబెట్టిన ఎగ్స్​తో ఆమ్లెట్.. టేస్ట్ అదిరిపోతుంది..

Geddam Vijaya Madhuri HT Telugu
Sep 09, 2022 07:35 AM IST

Boiled Egg Omelette : చాలామంది ఆమ్లెట్ తినడానికి ఇష్టపడతారు. ఉదయాన్నే త్వరగా చేసుకోగలిగే బ్రేక్​ఫాస్ట్​లలో ఇది కూడా ఒకటి. అయితే మీరు ఆమ్లెట్ ప్రియులైతే.. బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్​ని ట్రై చేయాల్సిందే. ఎందుకంటే మీరు ఒక్కసారి తింటే దానితో కచ్చితంగా లవ్​లో పడతారు కాబట్టి.

బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్
బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్

Boiled Egg Omelette : ఉడకబెట్టిన గుడ్లతో ఆమ్లెట్‌. వినడానికి వెరైటీగా ఉన్నా.. తినడానికి మాత్రం బాగుంటుంది. అవును మీరు ఉదయాన్నే టేస్టీగా, ఈజీగా తయారు చేసుకోగలిగే బ్రేక్​ఫాస్ట్ తినాలనుకుంటే.. మీరు హ్యాపీగా బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ వేసుకుని తినేయొచ్చు. దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటి? ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

* గుడ్లు - 3

* ఉడికించిన గుడ్లు - 3 (గుండ్రంగా కట్ చేసుకోవాలి)

* పచ్చిమిర్చి - 3-4 (తరిగినవి)

* కొత్తిమీర - 2 టేబుల్ స్పూన్స్ (తరిగినది)

* ఉల్లిపాయ (మీడియం) - 1 (ముక్కలుగా కోయాలి)

* ఉప్పు - రుచికి తగినంత

* కారం - 1 టేబుల్ స్పూన్

* చాట్ మసాలా - అర టీస్పూన్

* అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్

తయారీ విధానం

ముందుగా గిన్నె తీసుకుని దానిలో గుడ్లను పగుల గొట్టి వేయాలి. ఉప్పు, కారం, ఉల్లిపాయలు, కొత్తిమీర ఆకులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. అనంతరం స్టౌవ్​ మీద పాన్ పెట్టాలి. అది వేడి అయిన తర్వాత.. గుడ్ల మిశ్రమాన్ని దానిపై పోయాలి.

దానిపైన గుండ్రంగా కట్ చేసిన ఉడికించిన గుడ్లను ప్లేస్ చేయాలి. వాటిపై కొద్దిగా చాట్ మసాలా, కారం, రుచికి తగినంత ఉప్పు చల్లుకోండి. 3.5-10 నిమిషాలు మూతపెట్టి. ఆమ్లెట్‌ను మరొక వైపునకు తిప్పండి. తదుపరి 5-10 నిమిషాలు దానిని ఉడికించండి. తురిమిన చీజ్ ఉంటే వేసి.. వేడి వేడిగా ఆస్వాదించండి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్