తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chicken Egg Muffins Recipe : హెల్తీ బ్రేక్​ఫాస్ట్ రెసిపీ.. చికెన్, ఎగ్ మఫిన్స్

Chicken Egg Muffins Recipe : హెల్తీ బ్రేక్​ఫాస్ట్ రెసిపీ.. చికెన్, ఎగ్ మఫిన్స్

21 September 2022, 6:55 IST

    • Chicken Egg Muffins Recipe : ఉదయాన్నే హెల్తీగా స్టార్ట్ చేయాలనుకుంటే చికెన్, ఎగ్ మఫిన్ రెసిపీని ట్రై చేయాల్సిందే. ఎందుకంటే ఇది ఎంత హెల్తీయో.. అంతే సింపుల్​గా రెడీ చేయవచ్చు కూడా. ముఖ్యంగా నాన్​వెజ్ ఇష్టపడేవారికి ఇది ఫేవరెట్ బ్రేక్​ఫాస్ట్ అవుతుంది. మరి దీనిని ఎలా తయారుచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్, ఎగ్ మఫిన్స్
చికెన్, ఎగ్ మఫిన్స్

చికెన్, ఎగ్ మఫిన్స్

Chicken Egg Muffins Recipe : సులభమైన గ్రాబ్ అండ్ గో ఆప్షన్​లో బ్రేక్​ఫాస్ట్ కావాలి అంటే కచ్చితంగా చికెన్, ఎగ్ మఫిన్​ రెసిపీ చెప్పవచ్చు. ఇది ఆరోగ్యకరమైనది కూడా. ఇది పూర్తిగా హెల్తీ పదార్థాలతో నిండి ఉంటుంది. దీనిని తయారు చేయడానికి గంటలు గంటలు కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. చాలా సింపుల్​గా కొన్ని పదార్థాలతోనే దీనిని తయారు చేసుకోవచ్చు. మరి దీనిని ఎలా తయారు చేయాలి.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

* వెన్న - 1 టేబుల్ స్పూన్

* పుట్టగొడుగులు - 4-5 ముక్కలు

* ఉల్లిపాయ - 1 (చిన్నది తరగాలి)

* చిల్లీఫ్లేక్స్ - చిటికెడు

* చికెన్ సాసేజ్ - 5-6 ముక్కలు

* చీజ్ - 50 గ్రాములు

* మిరియాల పొడి - రుచికి తగినంత

* సాల్ట్ - రుచికి తగినంత

* గుడ్లు - 6

చికెన్, ఎగ్ మఫిన్‌ల తయారీ విధానం

గుడ్లు పగులకొట్టి ఓ గిన్నెలో వేయాలి. దానిలో పుట్టగొడుగులు, వెన్న, ఉల్లిపాయ, చిల్లీఫ్లేక్స్, చికెన్ సాసేజ్, మిరియాల పొడి, సాల్ట్ వేసి బాగా కలపాలి. ఇప్పుడు మఫిన్ ట్రైను తీసుకుని.. ప్రతి మఫిన్ టిన్​ను మూడువంతులు మిశ్రమంతో నింపండి. దానిపై చీజ్ ముక్కలు వేయండి. దానిని పది నుంచి పదిహేను నిమిషాలు 350 డిగ్రీలు బంగారు గోధుమ రంగు వచ్చేవరకు బేక్ చేయండి. అంతే చికెన్, ఎగ్ మఫిన్స్ రెడీ.. వీటిని వేడిగాను తినొచ్చు.. లేదా చల్లార్చుకుని తినొచ్చు.

టాపిక్