తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Wallpaper Dos And Don’ts: ఇంట్లో వాల్‌ పేపర్లు పెడుతున్నారా? చేయాల్సినవి, చేయకూడనివి ఇవే

Wallpaper Dos and Don’ts: ఇంట్లో వాల్‌ పేపర్లు పెడుతున్నారా? చేయాల్సినవి, చేయకూడనివి ఇవే

HT Telugu Desk HT Telugu

21 November 2023, 20:14 IST

google News
  • Wallpaper Dos and Don’ts: ఇంటి గోడలకు వాల్ పేపర్లు పెట్టుకుంటే అందం రెట్టింపు అవుతుంది. అయితే వాటిని ఇన్‌స్టాల్ చేసేటప్పుడు కొన్ని విషయాలు దృష్టిలో ఉంచుకోవాలి. 

వాల్ పేపర్ టిప్స్
వాల్ పేపర్ టిప్స్ (freepik)

వాల్ పేపర్ టిప్స్

ఇంటి గోడలను అలంకరించుకునేందుకు ఇప్పుడు చాలా మంది రకరకాల వాల్‌ పేపర్లను ప్రయత్నిస్తున్నారు. గోడలను ఎలివేట్‌ చేసుకోవడం ద్వారా ఇంటికి మరింత అందాన్ని తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వీటి ఎంపిక విషయంలో వాడే విషయంలో కొన్నింటిని తప్పకుండా దృష్టిలో ఉంచుకోవాలని ఇంటీరియర్‌ డిజైనర్లు చెబుతున్నారు. అవేంటంటే

  • వాల్‌ పేపర్‌ని మీ ఇంటి రంగులకు, ఇతర ఇంటీరియర్‌కి నప్పేలా ఉండే వాటిని ఎంపిక చేసుకోండి. సోఫాలు, కార్పెట్లు, టైల్స్‌ లాంటి అన్నింటికీ అది బాగా నప్పే విధంగా ఉండాలి. అది మీ గది అందాన్ని మరింత ఎలివేట్‌ చేసేలా ఉండాలని గుర్తుంచుకోండి.
  • సాధారణంగా వాల్‌ పేపర్లు గది నాలుగు వైపుల ఉన్న గోడలకూ అంటిస్తే క్లంజీగా ఉన్న భావన కలుగుతుంది. అలా కాకుండా ఎలివేట్ చేయాలనుకున్న ఒక వైపు గోడను మాత్రమే దీని కోసం ఎంచుకోండి. పడక గదుల్లో అయితే మంచం తల వైపు ఉండే గోడను ఇందుకు ఎంపిక చేసుకోండి. హాల్లో యాక్సెంట్‌ వాల్‌ని వీటితోనూ డిజైన్‌ చేయించుకోవచ్చు.
  • వీటిని ఇన్‌స్టాల్ చేసుకోవడానికి మీరు ఎప్పుడూ ప్రయత్నించకండి. ప్రొఫెషనల్స్‌తో మాత్రమే వీటిని ఫిక్స్‌ చేయించుకోండి. వారు చిన్న చిన్న విషయాలను కూడా దృష్టిలో ఉంచుకుని చాలా పకడ్బందీగా దీన్ని గోడకు అతికిస్తారు. అందుకు గోడను కూడా ముందు సిద్ధం చేస్తారు. అందువల్ల లుక్‌ చాలా బాగుంటుంది. అదే మనం ఎంత బాగా చేద్దాం అని మొదలు పెట్టినా చివరికి అది ఎక్కడో ఒక దగ్గర ఎబ్బెట్టుగా కనిపిస్తుంది.
  • వాల్‌ పేపర్‌ని ఇన్‌స్టాల్‌ చేసిన తర్వాత గదిలో లైటింగ్‌ ఎలా ఉందన్న దాన్నీ దృష్టిలో ఉంచుకోండి. ఒక వేళ తక్కువగా ఉంటే ఆ గోడ ఎలివేట్‌ అయ్యేలా కాస్త లైటింగ్‌ని పెంచుకోండి. ఇప్పుడు బల్బుల్లో రకరకాల లైటింగ్‌లు, ప్యాట్రన్లు కూడా అందుబాటులో ఉంటున్నాయి. ఏది నప్పుతుంది అన్నదాన్ని బట్టి లైటింగ్‌ని ఎంచుకోండి.
  • వాల్‌ పేపర్లలో రకరకాల టెక్స్చర్లు, ప్యాట్రన్‌లు, ఎంబోజింగ్‌లలాంటివి అందుబాటులో ఉంటాయి. మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా? పెంపుడు జంతువులు ఉన్నాయా? అన్న విషయాల ఆధారంగా వీటిలో ఏది ఎంచుకోవాలనేది నిర్ణయించుకోండి.
  • ఇంట్లో వాల్‌ పేపర్‌తో ఓ ఫోకల్‌ పాయింట్‌ని క్రియేట్‌ చేయండి. అంటే గదిలోకి రాగానే ఏ గోడపై అయితే దృష్టి పడుతుందో దాన్ని ఎలివేట్‌ చేసుకుని ఫోకల్‌ పాయింట్‌ని క్రియేట్‌ చేసుకోవచ్చు.
  • అలాగే వీటిని ఏర్పాటు చేసుకునేప్పుడు భవిష్యత్తునూ దృష్టిలో ఉంచుకోండి. అవసరం అనుకుంటే తేలికగా డిజైన్‌ని మార్చుకునేలా ఉండాలి. లేదంటే దీర్ఘ కాలంపాటు పాడు కాకుండా అయినా ఉండాలి.
  • పర్సనల్‌ వాల్‌ పేపర్లు ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నాయి. మీ కుటుంబ సభ్యుల ఫోటోలతోనూ మీరు ఇప్పుడు వాల్ పేపర్లను చేయించుకోవచ్చు.

తదుపరి వ్యాసం